రైల్ నిలయం వద్ద కాంగ్రెస్ నేతల మెరుపు ధర్నా.. ఎందుకో తెలుసా?

Publish Date:Oct 28, 2026

Advertisement

ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న జాతీయ స్థాయి నిరసన ర్యాలీకి తెలంగాణ నుంచి పార్టీ శ్రేణులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు మెరుపు ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, శ్రీ గణేష్‌తో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.

ప్రత్యేక రైళ్లు కేటాయించలేదంటూ ఆగ్రహం.!

నవంబర్ 1న న్యూఢిల్లీలోని చారిత్రాత్మక రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ పేరుతో నిరసన ర్యాలీ నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలను తరలించేందుకు ప్రత్యేక రైళ్లను కేటాయించాలని కాంగ్రెస్ నేతలు కోరినట్లు సమాచారం. అయితే, ప్రత్యేక రైళ్ల ఏర్పాటుకు అనుమతి లభించలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దీంతో ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లపై దృష్టి సారించినట్లు తెలిపారు.

మోదీ, అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు.!

ప్రత్యేక రైళ్ల కేటాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజకీయ కారణాలతోనే తమ పార్టీకి అడ్డంకులు సృష్టిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. రైల్వే జీఎం కార్యాలయం ఎదుట బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు. దీంతో రైల్ నిలయం పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పీసీసీ చీఫ్ సహా పలువురు నేతల అరెస్ట్.!

ధర్నా కొనసాగుతున్న సమయంలో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, శ్రీ గణేష్ సహా పలువురు నాయకులను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఢిల్లీలో జరగనున్న నిరసన ర్యాలీకి వెళ్లకుండా ఎన్ని అడ్డంకులు ఎదురైనా తమ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివెళ్తాయని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించడమే తమ ఆందోళన లక్ష్యమని పేర్కొన్నారు.

 

 

[ Congress leaders stage a lightning protest at Rail Nilayam, Telangana Congress, Secunderabad Railway Station, Mahesh Kumar Goud, Ponnam Prabhakar, South Central Railway, Congress Protest, Vote Bachao Desh Bachao, Ramlila Maidan Rally, Congress Leaders Arrested ]

By
en-us Political News

  
అలాగే మాజీ సీబీఐ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు, సజ్జనార్‌పై  బహిరంగంగా పలు ఆరోపణలు, తీవ్ర వ్యాఖ్యలు చేశారనీ,   పోలీసు యూనిఫాం వెనుక దాక్కున్న నేరస్థుడిగా ఆయన సజ్జనార్ ను అభివర్ణించారనీ తన లేఖలో పేర్కొన్న రాజాసింగ్, అటువంటి ఆరోపణలను ఎదుర్కొంటున్న సజ్జనార్ పై చర్యలు తీసుకోకుండా కేవలం బదలీతో సరిపెట్టడమేంటని నిలదీశారు.
అక్వాన్ ప్రభావం ప్రధానంగా తెలంగాణలోని తూర్పు దక్షిణ జిల్లాలపై అధికంగా ఉంటుంది. ఈ నెల 20 నుంచి 22 వరకూ అక్వాన్ ప్రభావంతో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.  
ఐదు తులాల బంగారం ఆశ.. రెండున్నర తులాల గొలుసు స్వాహా.!
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
భారత రాజకీయాల్లో దేశంలోనే అత్యంత సంపన్నుల ఎదుగుదలపై, ముఖ్యంగా పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ అసాధారణ ప్రగతిపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ సంక్షేమ కానుకను అందించేందుకు సిద్ధమైంది.
women cricketer Nandini suicide,BCCI Under 19 cricket, Vikarabad crickete, rFemale cricketer suicide
బీసీ రాజ్యాధికార పాదయాత్రలో తన వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు.
అక్రమ రవాణా ముఠాలకు సింహస్వప్నం.. వేలాది మంది బాధితులకు విముక్తి.. 2 వేల మందికి పైగా సివిల్ సర్వెంట్లకు మార్గదర్శకత్వం.
రాష్ట్రంలో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే అంశాలపై ప్రముఖులు స్పందిస్తుండడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
తెలంగాణ విద్యా వ్యవస్థలో కీలక సంస్కరణలు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఇటీవలి కాలంలో ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో తగిన భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిర్వహించిన దాండియా వేడుకలో దురదృష్టవశాత్తు ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. అలాగే ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా సినిమా ప్రమోషన్ ఈవెంట్  నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.  
కూల్‌డ్రింక్‌లో విషం కలిపి 10వ తరగతి విద్యార్థి హత్య.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.