కన్ఫూజన్ లో కాంగ్రెస్.. తప్పులో కాలేసిందా?

Publish Date:May 15, 2025

Advertisement

పహల్గాం ఉగ్రదాడి మొదలు కాంగ్రెస్ పార్టీ  ఆచారానికి భిన్నంగా ఆచి చూచి అడుగులు వేస్తూ వచ్చింది. వ్యూహతంకంగా పావులు కదిపింది. అక్కడ ఇక్కడ ఒకటి రెండు అపశ్రుతులు వినిచ్పించినా.. అందరిదీ ఒకటే మాట అన్నట్లుగా ప్రభుత్వానికి అండగా, ఒకే మాటపై  నిలిచింది. ఆపరేషన్ సిందూర్ విషయంలోనూ, అనంతర పరిణామాల విషయంలో ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించింది. ప్రభుత్వం తీసుకునే ఎలాంటి చర్యకైనా కాంగ్రెస్ మద్డతు ఉంటుందని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనాయకుడు,లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఇతర నాయకులు ప్రకటించారు. 

నిజానికి పహల్గాం ఉగ్రదాడి జరిగిన వెంటనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) పహల్గామ్   దాడిని ఖండిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతుగా నిలిచిన పాకిస్తాన్‌కు తగిన గుణ పాఠం  చెప్పవలసిన సమయం ఆసన్నమైందని తీర్మానంలో పేర్కొంది. అలాగే..  ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తీర్మానంలో పేర్కొంది. కేవలం తీర్మానం చేయడం మాత్రమే కాదు, ఆచరణలోనూ నిబద్దత చూపింది. 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న  పహల్గాం దాడి  సంఘటనలో  భద్రతా లోపాలు వంటి వైఫల్యాల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉన్నా, కాంగ్రెస్ పార్టీ విజ్ఞత చూపింది. సమన్వయంతో వ్యవహరించింది. ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీని అనుసరించాయి.

అంతవరకు అంతా బాగుంది.  అయితే.. ఎప్పుడైతే కాల్పుల విరమణ అంశం తెరపైకి వచ్చిందో, అక్కడి నుంచి కథ అడ్డ తిరిగింది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్  అతి ఉత్సాహంతో చేసిన ప్రేలాపనలు  కాంగ్రెస్ పార్టీకి  ప్రభుత్వం పై విరుచుకు పడేందుకు అస్త్రాన్ని అందిచాయి. ఇక అక్కడి నుంచి కథ మారింది. కాంగ్రెస్ గొంతు సవరించుకుని  ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రారంభించింది. ఇండియా కూటమి పార్టీలు అదే దారిలోకి వచ్చాయి. కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా    పాత్ర ఏమిటని నిలదీశాయి. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో, భారత్-పాకిస్థాన్ దేశాలు తటస్థ ప్రదేశంలో విభిన్న అంశాలపై విస్తృత స్థాయి చర్చలకు అంగీకరించాయని చేసిన ప్రకటనపై కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వివరణ కోరారు. అలాగే.. కాల్పుల విరమణకు పాకిస్థాన్ ఇచ్చిన హామీ, ఏమిటి, పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలను కూల్చివేసేందుకు పాక్ అగీకరించిందా, అని ప్రశ్నించారు. ఒక విధంగా చూస్తే  ప్రభుతాన్ని గట్టిగానే కార్నర్  చేశారు. ఇరకాటంలోకి నెట్టారు. అయితే..  ఓ వంక పార్టీలోని ఒక వర్గం, మోదీ ప్రభుత్వం పై ప్రశ్నలతో విరుచుకు పడుతున్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీలోని మరో వర్గం మోదీ ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తుతోంది. అలాగే  మరోవంక ముఖ్యనాయకులు కొందరు కాంగ్రెస్ పార్టీ తప్పులో కాలేసిందని ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యంగా కాల్పుల విరమణ అనంతరం మోదీ  ప్రభుత్వం ఒక దాని వెంట  ఒకటిగా తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్నచర్యలు కాంగ్రెస్ పార్టీని కలవరపాటుకు గురిచేస్తున్నాయని అంటున్నారు. అలాగే..  కాల్పుల విరమణ విషయంలో మోదీ ప్రభుత్వం అమెరికా మధ్యవర్తిత్వాన్ని తప్పు పట్టడం కూడా,తప్పే అవుతుందని కాంగ్రెస్ లోని ఒక వర్గం నాయకులు పార్టీలోని కొందరు ముఖ్యనాయకులు పార్టీ స్టాండ్ ను తప్పు పడుతున్నారు. ఉభయ దేశాలూ అణ్వాయుధ దేశాలు అయినప్పుడు పట్టువిడుపులు అనివార్యమవుతాయని, అందుకే మోదీ ప్రభుత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందని సీనియర్ నాయకులు అంటున్నారు.  

అలాగే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మంగళవారం(మే12) ఆపరేషన్ సిందూర్  పై  జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం ద్వారా  పాక్   ప్రేరేపిత ఉగ్రవాదానికి, ఆపరేషన్ సిందూర్  ద్వారా కొత్త లక్ష్మణ గీతను గీయడంతో పాటుగా, ఆ వెంటనే బుధవారం ( మే 13) అదంపూర్ ఎయిర్ ఫోర్సు బేస్ సందర్శన ద్వారా    కొత్త సాధారణ స్థితి ని అండర్లైన్ చేయడం జరిగింది.  మరోవంక ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ కు సంబంధించి  ఉన్నత స్థాయి సైనిక అధికారులు, వివిధ దేశాల సైనిక అధికారులకు వివరించడం, బీజేపీ దేశ వ్యాప్తంగా చేపట్టిన తిరంగా యాత్ర, ఇప్పడు తాజాగా  మే 24 న ముఖ్యమంత్రులు అందరూ పాల్గొనే  జాతీయ భద్రతా మండలి సమావేశం, ఆవెంటనే మే 25 న ఎన్డీఎ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం.. ఇలా ఒకదాని వెంట ఒకటిగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ చేపడుతున్న కార్యక్రమాల ద్వారా ప్రధాని మోదీ, దేశంలో రాజకీయ చర్చను చాకచక్యంగా  జాతీయ వాదం వైపుకు తీసుకు పోతున్నారని కాంగ్రెస్ నాయకులు అనుమానిస్తున్నారు. ఆందోళన చెందుతున్నారు. అలాగే  ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణలో అమెరికా పాత్ర తదితర   అంశాలను చర్చించేందుకు అఖిల పక్ష సమావేశం, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు  చేయాలని  కాంగెస్ పార్టీ చేస్తున్న  డిమాండ్ లో హేతుబద్దత ఉన్నా, మోదీ వాక్ ధాటికి తట్టుకోవడం కష్టమవుతుందనీ.. ఒక విధంగా కాంగ్రెస్ డిమాండ్ బూమరాంగ్ అయ్యే ప్రమాదం ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంటున్నారు.  

ఈ అన్నిటినీ మించి కాంగ్రెస్  పార్టీలో ఆపరేషన్ సిందూర్ విషయంలోనే కాదు..  అందుకు సంబందించిన ఏ ఒక్క వివిషయంలోనూ ఏకాభిప్రాయం లేదు. మల్లికార్జున ఖర్గే మొదలు శశి  థరూర్ వరకు ఎవరికి తోచిన దారిలో వారు వ్యాఖ్యలు, విమర్శలు చేస్తున్నారు.  దీంతో కాంగ్రెస్ పార్టీ మరో మారు తప్పులో కాలేసిందనే అనుమానాలు పార్టీ వర్గాల్లోనే వ్యక్త మవుతున్నాయి.

By
en-us Political News

  
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కడప జిల్లా నేతలలైన పుట్టా సుధాకర్, వరదరాజులు రెడ్డి, మాధవి రెడ్డిపై లోకేష్ ఫైరయ్యారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన సమీక్షలో, నారా లోకేష్ కడప జిల్లా నేతలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల విన్నపం కార్యక్రమాలకు ఈ నేతలు హాజరుకాకపోవడంపై నిలదీసినట్లు చెబుతున్నారు.
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు రేపు ఒకేసారి ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే అస్సాంలో 126 స్థానాలకూ కూడా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గతంలో బహుళ విడతల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా(సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆ డిపో సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్(గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేదా డోర్నకల్ కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కిద్వాయ్, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందారు. మోహ్సినా కిద్వాయ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిజాముద్దీన్ స్మశాన వాటికలో బుధవారం (ఏప్రిల్ 8) సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్‌లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.