కర్నాటకంలో పీసీసీ చీఫ్ ఓటమికి ఉమ్మడివ్యూహం ?

Publish Date:Apr 27, 2023

Advertisement

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్కటి  మినహా మిగిలిన 223 నియోజక వర్గాల్లో పోటీ చేస్తోంది. బీజేపీ మొత్తం 224 స్థానాల్లోనూ అభ్యర్ధులను బరిలో నిలిపింది. జేడీఎస్  కూడా ఈసారి మూడొంతులకు పైగా  పైగా స్థానాల్లో ఒంటిరిగా పోటీచేస్తోంది. అయితే, 10న జరిగే ఎన్నికల్లో ఎవరు ఎన్ని సీట్లు గెలుచుకుంటారు?  ఎవరు అధికారంలోకి  వస్తారు?  కింగ్ ఎవరు? కింగ్ మేకర్ ఎవరు? అనే చర్చ రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తంలో జోరుగా సాగుతోంది. సర్వేలు చెప్పే జోస్యాలు సర్వేలు చెపుతున్నాయి.  ఒక సర్వే బీజేపీకి ఎడ్జి ఉందంటే మరో సర్వే కాంగ్రెస్ దే పై చేయి అంటోంది. అయితే  ఎక్కువ సర్వేలు  హంగ్ అనివార్యమని అంటున్నాయి. చివరకు ఏమి జరుగుతుంది? కర్ణాటక ఓటరు తీర్పు ఏ విధంగా ఉంటుంది? అనేది మే 13 న తేలిపోతుంది. 

అదలా ఉంటే... ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ ప్రత్యర్ధి పార్టీలను ఓడించడంతో పాటుగా, కొందరు కీలక నేతలు సొంత పార్టీలోని ప్రత్యర్ధులను ఓడిచడం పైనా కన్నేశారు. అలాగే  ప్రత్యర్ధి పార్టీలలో బలమైన నాయకులను ఓడించేందుకు అదే పార్టీలోని కీలక నేతలు ఉమ్మడి శత్రువును ఓడించేందుకు ఉమ్మడి వ్యూహాలతో పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ను ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు బీజేపీతో చేతులు కలిపినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ వ్యూహంలో భాగంగానే   బీజేపీ అధికారాన్ని నిలుపుకోవడంతో పాటుగా, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ను ఓడించడంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించిందని ఆపార్టీ నాయకులు బహిరంగంగానే చెపుతున్నారు. డీకేకు సవాలు విసురుతున్నారు. 

అమేథిలో రాహుల్ గాంధీని వదలని మేము నిన్ను వదిలేస్తామని అనుకుంటున్నావా అంటూ కేపీసీసీ అధ్యక్షుడిని ఓ బీజేపీ సీనియర్ నేత హెచ్చరించడం కర్ణాటక పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి, డీకే శివకుమార్ పోటీలో లేకుండా చేసేందుకు కూడా బీజేపీ కొన్ని చట్టబద్ధ  ప్రయత్నాలు చేసిందనే ప్రచారం జరిగింది.  ఆయనపై ఉన్న అవినీతి కేసులను సాకుగా చూపించి, కనకపుర రిటర్నింగ్ ఆఫీసర్ ఆయన నామినేషన్ తిరస్కరించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అందుకే ముందు జాగ్రత్తగా డీకే సోదరుడు  బెంగళూరు రూరల్‌ ఎంపీ డీకే సురేష్‌ కూడా ఆఖరి క్షణంలో  నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే  డీకే నామినేషన్ ఆమోదం పొందడంతో ఆయన బరిలో నిలిచారు.అయితే బీజేపీ మాత్రం కనకపురా నియోజకవర్గంలో డీకేను ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో ఉందని, అందుకే డీకే మీద పోటీకి  ఆయనకు అన్ని విధాల సమ ఉజ్జీగా నిలిచే  మంత్రి ఆర్.అశోక్ ను బరిలో దించిందని అంటున్నారు.  

నిజానికి, బెంగళూరు నగర శివార్లలో ఉన్న కనకపుర అసెంబ్లీ నియోజక వర్గం డీకే కంచుకోట. ఇప్పటికే వరసగా  మూడు సార్లు గెలిచిన ఈ నియోజక వర్గలో నాలుగో సారి గెలవడం డీకేకు నల్లెరుమీద నడక అనే విషయంలో ఎవరికీ అనుమానం లేదు. అయితే, ముఖ్యమంత్రి రేసులో ఉన్నశివకుమార్ ను ఓడించేందుకు కాంగ్రెస్ లోనే ఒక వర్గం గట్టిగా ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య వర్గం డీకే ను ఓడిస్తే, ఇక తమ నేతకు తిరుగుండదని  ఆ దిశగా పావులు కదుపుతోందని డీకే అనుచర వర్గంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నిజానికి సిద్దరామయ్యకు బీజేపీ ముఖ్యనేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. గతంలో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలి, బీజేపీ అధికారంలోకి రావడం వెనక ‘సిద్ద’ హస్తం ఉందని అంటారు.  సరే అదలా ఉంటే కారణాలు ఏవైనా కనకపురాలో డీకే ఓడించేందుకు బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. మంత్రి ఆర్. అశోక్ ను గెలిపించాలని బీజేపీ నాయకులు ఇప్పటికే కనకపురలో   ప్రచారం ముమ్మరం చేశారు. కర్ణాటక మాజీ మంత్రి సీటీ. రవి కనకపురలో ఆర్. అశోక్ ను గెలిపించాలని ఎన్నికల ప్రచారం చేశారు. సీటీ. రవితో పాటు స్థానిక బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 

ఈ సందర్బంగా బీజేపీ నేత సీటీ. రవి మాట్లాడుతూ అమేథిలో వరుసగా ఎంపీగా విజయం సాధిస్తున్న రాహుల్ గాంధీకి 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మేము సినిమా చూపించామని అన్నారు. అమేథి నియోజక వర్గంలో మీ నాయకుడు రాహుల్ గాంధీనే మేము వదల్లేదు. కనకపురలో నిన్ను వదిలేస్తామా అంటూ. రవి కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ కు నేరుగానే సవాల్ విసిరారు. అయితే ఇది ఒక విధంగా శివకుమార్ పై మానసిక వత్తిడి పెంచి ఆయన్ని నియోజక వర్గంనికి పరిమిత చేసేందుకు బీజేపీ రవి ప్లే చేసిన  ట్రిక్ అయినా కావచ్చని, అయినా, ఇప్పటికే మొత్తం ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మూడు సార్లు మంత్రిగా పనిచేసిన పీసీసీ చీఫ్ ను ఓడించడం అంత ఈజీ వ్యవహారం కాదని, అలాగే,ఆయన నియోజకవర్గానికి పరిమితం చేయాలనుకోడం కూడా అయ్యేపనికాదని పరిశీలకులు అంటున్నారు. అయితే, కాంగ్రెస్ లోని డీకే వ్యతిరేక వర్గం బీజేపీతో నేరుగా చేతులు కలిపితే మాత్రం డీకే గెలుపు నల్లేరుమీద బండి నడక కాకపోవచ్చనీ పరిశీలకులు అంటున్నారు.

By
en-us Political News

  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.