కొబ్బరి నీళ్లతొ వచ్చే ప్రయోజనాలు తెలిస్తే రోజూ తాగుతారు..

Publish Date:Jun 1, 2019

Advertisement

ఒంట్లో నీరసంగా ఉన్నా.. జ్వరం వచ్చినా కొబ్బరి నీళ్లు తాగితే చాలు. కొబ్బరి నీళల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతికాలంలో మనకి కొబ్బరి నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. ప్రతి జబ్బుకూ ఇది సర్వ రోగ నివారిణి. ఎలాంటి కల్తీ లేకుండా మనకు స్వచ్ఛంగా లభించే పానీయం ఇదొక్కటే ఉంటుంది.

కొబ్బరి నీళల్లో చాలా పౌష్టిక గుణాలుంటాయి. ఇందులో ఉండే చాలా మినరల్స్ శరీరానికి మేలు చేస్తాయి. అందువల్ల రెగ్యులర్ కొబ్బరి నీళ్లను తాగడం చాలా మంచిది. అలాగే కొబ్బరి నీళ్ల వల్ల కలిగి ఉపయోగాలు ఏమిటో మీరూ చూడండి.


గుండెకు చాలా మంచిది:

కొబ్బరి నీళ్లు తాగడం గుండెకు చాలా మంచిది. హార్ట్ అటాక్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అధిక రక్తపోటు సమస్య కూడా ఉండదు. గుండె సంబంధిత వ్యాధులన్నింటినీ దూరం చేయగలదు.

 

జీవక్రియను పెంచుతుంది :

రోజూ కొబ్బరినీరు తాగడం వల్ల మీ జీవక్రియ రేట్ కూడా పెరుగుతుంది. అలాగే మీరు త్వరగా బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇందులోని ఎలెక్ట్రోలైటీ అనేది అధికంగా ఉంటుంది. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే ఇందులో మాంగనీస్ ఎక్కువగా ఉంటుంది. దీంతో జీవక్రియ పెరిగి ఫ్యాట్ మొత్తం కరిగిపోతుంది.

 

కిడ్నీలోని రాళ్లను కరిగించుకోవొచ్చు :

తక్కువగా నీరు తాగితే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతుంటాయి. అయితే కొబ్బరి నీళ్లను తాగడం వల్ల కిడ్నిలోని చిన్నసైజ్ రాళ్లు త్వరగా కరిగించుకోవొచ్చు. అలాగే కిడ్నీల్లోని వ్యర్థ పదార్థాలు మొత్తం కూడా బయటకు వెళ్లడానికి కొబ్బరి నీళ్లు బాగా ఉపయోగపడతాయి.


డీ హైడ్రేషన్ ఉండదు :

కొబ్బరి నీళ్లను రెగ్యులర్ గా తాగడం వల్ల మీలో డీ హైడ్రేషన్ సమస్య అనేది ఏర్పడదు. నీళ్ల కంటే ఎక్కువగా కొబ్బరి నీళ్లు పని చేస్తాయి. అథ్లెట్లు, వ్యాయామాలు చేసేవారు ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగడం చాలా మంచిది.

 

జీర్ణశక్తిని పెంచుతుంది:

కొబ్బరి నీరు కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే ఇందులో మినరల్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ మీలో మీలో జీర్ణశక్తిని పెంచుతాయి.

By
en-us Political News

  
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం బాగుంటే ఏ పనులైనా చేయవచ్చు, ఎంత డబ్బు అయినా సంపాదించుకోవచ్చు. కానీ నేటికాలంలో డబ్బు...
వేసవి కాలంలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం పెరుగుతుంది. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీటి శాతం తగ్గడం అనే ప్రమాదం పెరుగుతుంది. దీనివల్ల కాల్షియం..
పంచదార.. నేటికాలంలో చాలా విరివిగా వాడుతున్నారు. కాఫీ, టీ,  స్వీట్లు,  ఇంట్లో చేసే తీపి పదార్థాలు, డిజర్ట్ లు.. ఇలా చాలా తీపి పదార్థాల తయారీలో పంచదారది అగ్రస్థానం.  కాఫీ, టీ ల విషయాని వస్తే.. రోజులో కప్పుల..
వేసవి కాలం వచ్చిందంటే చల్లదనాన్ని వెతుక్కోవడానికి చాలా ప్రయత్నిస్తుంటారు. అందులో భాగమే ఈత కూడా.. ఇప్పట్లో చిన్న పట్టణాల నుండి పెద్ద నగరాల వరకు చాలా చోట్ల స్విమ్మింగ్ ఫూల్ లు కూడా ఏర్పాటు చేస్తున్నారు...
ఆరోగ్యంగా ఉండటానికి నీరు త్రాగడం మంచిదని చెబుతారు.  నీకు ఎంత తాగితే ఆరోగ్యం అంత బాగుంటుందని కూడా చెబుతారు. ఆరోగ్య  నిపుణులు రోజుకు  8 నుండి 9 గ్లాసుల నీరు త్రాగాలని సిఫార్సు చేస్తున్నారు...
కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఒక్కోరకం కూరగాయలలో ఒకో రకం పోషకాలు ఉంటాయి.  కొన్ని రకాల కూరగాయలు ఆరోగ్యానికి ఔషధంలా పనిచేస్తాయి.  అలాంటి కూరగాయలలో బ్రోకలీ కూడా ఒకటి.  చూడటానికి ఆకుపచ్చ రంగులో..
మండే వేసవి ఎండ నుండి తప్పించుకోవడానికి గంటల తరబడి ఏసీ ముందు కూర్చోవడం ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. ఇది సౌకర్యవంతంగా అనిపించినప్పటికీ, ఈ అలవాటు  శరీరంపై రహస్యంగా..
భారతీయులు చాలామంది రాత్రి పడుకునే ముందు పసుపు కలిపిన పాలు తాగుతూ ఉంటారు. ఆయుర్వేదపరంగా పసుపు పాలు ఎంతో ఆరోగ్యకరమైనవి.  పసుపు పాలలో ఉన్న ప్రయోజనాల కారణంగా వీటిని గోల్డెన్ మిల్క్ అని పిలుస్తారు...
గుండె శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. దానిని సరిగ్గా జాగ్రత్తగా చూసుకోకపోతే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలామంది తమకు తెలియకుండానే కొన్ని అలవాట్లు అలా కంటిన్యూ చేస్తుంటారు...
భారతీయ వంటగదిలో వెల్లుల్లి ఒక ముఖ్యమైన పదార్థం. వెల్లుల్లి లేకుండా చాలా కూరలకు ఆ రుచి ఉండదు. కానీ వెల్లుల్లి కేవలం రుచిని పెంచేది మాత్రమే కాదు, చాలా వ్యాధులకు ఔషధం కూడా. ఆయుర్వేదం వెల్లుల్లిని వైద్య చికిత్సలో ఉపయోగిస్తుంది.
మానవ శరీరంలో మూత్రపిండాలు అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. శరీరంలో కనిపించే చాలా లక్షణాలను చాలా సార్లు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఇలా శరీరంలో కనిపించే లక్షణాలను నిర్లక్ష్యం చేయడం అనేది  కొన్నిసార్లు మూత్రపిండాల వైఫల్యానికి సంకేతాలు కావచ్చని వైద్యులు..
నేటికాలంలో చాలామంది ఆరోగ్య స్పృహతో ఉంటున్నారు.  ఎంత బిజీగా ఉన్నా సరే.. తీసుకునే పండ్ల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు...
వేసవి కాలం రాగానే చాలామంది లైఫ్ స్టైల్ మారుతుంది. ముఖ్యంగా ఆహారం విషయంలో, పానీయాల విషయంలో చాలా మార్పులు వచ్చేస్తాయి. బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల పేమస్ పానీయం ఇది. అయితే దీని ప్రయోజనాల దృష్ట్యా దేశ వ్యాప్తంగా ఇష్టంగా ఉపయోగిస్తారు....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.