సిఏం చెక్ పెట్టేందుకే ధర్మపురి తెరపైకి..!

Publish Date:Oct 26, 2011

Advertisement

హైదరాబాద్: ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఒంటెద్దు పోకడలకు చెక్ పెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగానే పీసీసీ మాజీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్‌‌కు ఎమ్మెల్సీ టిక్కెట్ కట్టబెట్టింది. అధిష్టానానికి నమ్మినబంటుగా ఉన్న డీఎస్  తెలంగాణ అంశంపై అధిష్టానం గీచిన గీతను ఏనాడూ దాటలేదు. వ్యక్తిగతంగా తెలంగాణ కోరుకుంటున్నానని,అయితే,ఈ విషయంలో అధిష్టానం మాటే తనకు వేదమంటూ అందరి మన్నలను అందుకున్నారు.మరోవైపు  ముఖ్యమంత్రి పీఠం నుంచి రోశయ్యను తప్పించిన తర్వాత యువకుడైన కిరణ్ కుమార్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు. ఆయనపై ఎన్నో అంచనాలు,ఎంతో నమ్మకం పెట్టుకున్నారు.అయితే,కిరణ్ అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడలు, అంతా తనకే తెలుసన్న ధోరణి కాంగ్రెస్ పెద్దలకు ఏమాత్రం రుచించలేదు. దీంతో పీసీసీ చీఫ్‌గా బొత్త సత్యనారాయణను, ఉప ముఖ్యమంత్రిగా దామోదర రాజనర్శిహంను ఎంపిక చేసింది.వీరిద్దరి నియామకంతో కిరణ్ కుమార్ రెడ్డి కాస్త వెనుకంజ వేసినట్టు కనిపించినప్పటికీ  పాలనా పరమైన నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు సహచర మంత్రివర్గ సభ్యుల నుంచే వచ్చాయి. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్సీ టిక్కెట్‌ను డి.శ్రీనివాస్‌కు కట్టబెట్టి కిరణ్‌కు పోటీగా తెరపైకి తెచ్చింది.

ఒక విధంగా చెప్పాలంటే ఎమ్మెల్సీగా డీఎస్‌ను ఎంపిక చేయడం ద్వారా కిరణ్‌ ముందరి కాళ్లకు అధిష్టానం బంధం వేసినట్టేనని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.డి.శ్రీనివాస్ ఎంపికతో తన జట్టును ఎంపిక చేసుకుందామని అనుకున్న కిరణ్ కుమార్ రెడ్డి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. మంత్రి వర్గ విస్తరణ చేపట్టి తనకు ఇష్టమైనవారితో పాలన సాగించాలని అనుకున్నారు.ఆయన మంత్రి వర్గ విస్తరణకు తెలంగాణ సకల జనుల సమ్మె అడ్డు వచ్చింది. ఈలోగా పరిస్థితులు మారి డి.శ్రీనివాస్ మళ్లీ తెర మీదికి వచ్చారు. ఇప్పుడు మంత్రి వర్గ విస్తరణ చేపడితే డి.శ్రీనివాస్‌ను అనివార్యంగా మంత్రివర్గంలో చేర్చుకోవాల్సి ఉంటుంది. దానివల్ల తనకు వచ్చే ఇబ్బందులేమిటో కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికే గ్రహించి ఉంటారని వారు చెపుతున్నారు.అంతేకాకుండా,ఇప్పటికే చిరంజీవితో కలిసి పీసీసీ చీఫ్ బొత్స దూకుడుగా ముందుకు దూసుకెళుతున్నారు. ఇప్పుడు వారికి ధర్మపురి తోడయ్యారు. ఈ త్రిమూర్తులతో వేగడం కిరణ్ కుమార్ రెడ్డికి అంత సులభమేమీ కాదు. ఏ పని చేయాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఈ ముగ్గురికీ చెప్పి తీరాల్సిన పరిస్థితి. ఈ ముగ్గురు తలాడిస్తేగానీ, ముందుకు సాగే పరిస్థితి ఉండదు. దీంతో కిరణ్ అధికారం నామమాత్రం కానుంది. ఇప్పటికే చిరంజీవి, బొత్సల రూపాల్లో రెండు అధికార కేంద్రాలు ఉండగా, తాజాగా డిఎస్‌తో మరో అధికార కేంద్రం ఏర్పాటు కావడం తథ్యమని చెప్పొచ్చు.

By
en-us Political News

  

సుబ్రతో రాయ్ అరెస్ట్ ...

ఖరారైన రాష్ట్రపతి పాలన ...

రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...

విఫలమైన 'టి' కాంగ్రెస్

చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.

తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.

జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.

వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.

చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.

రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను

నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.

తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.

 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.