సీఎం రేవంత్‌రెడ్డికి ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు..ప్రత్యేక లేఖ రాసిన ప్రధాని మోదీ.!

Publish Date:Nov 8, 2026

Advertisement

కొడంగల్ నివాసంలో సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్.!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కొడంగల్‌లోని తన నివాసంలో ముఖ్యమంత్రిని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు సీతక్క, వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా లేఖ రాశారు. భగవంతుడు రేవంత్‌రెడ్డికి ఆయురారోగ్యాలు, సుదీర్ఘ జీవితాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.

దేశం అభివృద్ధి, ప్రగతి, సమ్మిళిత వృద్ధి దిశగా వేగంగా ముందుకెళ్తున్న తరుణంలో.. తెలంగాణ అభివృద్ధికి రేవంత్‌రెడ్డి చేస్తున్న కృషి రాష్ట్రాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు దోహదపడుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన జీవితం సంతోషం, ప్రశాంతత, సౌభాగ్యాలతో సాగాలని ఆకాంక్షించారు.

ప్రధాని పంపిన లేఖను రేవంత్‌రెడ్డి తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. మీ ఆప్యాయతతో కూడిన సందేశానికి ధన్యవాదాలని పేర్కొన్నారు.

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా కూడా ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు చెబుతూ.. ఆయనకు ఆరోగ్యం, ఆనందం, విజయాలు కలగాలని ఆకాంక్షించారు.

ఏపీ మంత్రి నారా లోకేశ్ సైతం రేవంత్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో మరెన్నో ఏళ్లు కొనసాగాలని ఆకాంక్షించారు. ఎన్సీపీ ఉపాధ్యక్షురాలు సుప్రియా సూలే సహా పలువురు జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు ముఖ్యమంత్రికి జన్మదిన సందేశాలు పంపారు.

1969 నవంబర్ 8న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కొండారెడ్డిపల్లిలో రేవంత్‌రెడ్డి జన్మించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన జన్మదినం సందర్భంగా రాజకీయ ప్రముఖులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు.

 

ఇది కూడా చదవండి: పరిషత్ ఎన్నికల్లో వైసీపీకి షాక్.. మాజీ ఎంపీలు అనురాధ, గొడ్డేటి మాధవి ఓటమి.!

 

[ CM Revanth Reddy Birthday Wishes, PM Narendra Modi, CM Chandrababu Naidu, Nara Lokesh, Gaddam Prasad Kumar, Minister seethakka, Telugu One, Telugu News ]

By
en-us Political News

  
అలాగే మాజీ సీబీఐ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు, సజ్జనార్‌పై  బహిరంగంగా పలు ఆరోపణలు, తీవ్ర వ్యాఖ్యలు చేశారనీ,   పోలీసు యూనిఫాం వెనుక దాక్కున్న నేరస్థుడిగా ఆయన సజ్జనార్ ను అభివర్ణించారనీ తన లేఖలో పేర్కొన్న రాజాసింగ్, అటువంటి ఆరోపణలను ఎదుర్కొంటున్న సజ్జనార్ పై చర్యలు తీసుకోకుండా కేవలం బదలీతో సరిపెట్టడమేంటని నిలదీశారు.
అక్వాన్ ప్రభావం ప్రధానంగా తెలంగాణలోని తూర్పు దక్షిణ జిల్లాలపై అధికంగా ఉంటుంది. ఈ నెల 20 నుంచి 22 వరకూ అక్వాన్ ప్రభావంతో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.  
ఐదు తులాల బంగారం ఆశ.. రెండున్నర తులాల గొలుసు స్వాహా.!
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
భారత రాజకీయాల్లో దేశంలోనే అత్యంత సంపన్నుల ఎదుగుదలపై, ముఖ్యంగా పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ అసాధారణ ప్రగతిపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ సంక్షేమ కానుకను అందించేందుకు సిద్ధమైంది.
women cricketer Nandini suicide,BCCI Under 19 cricket, Vikarabad crickete, rFemale cricketer suicide
బీసీ రాజ్యాధికార పాదయాత్రలో తన వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు.
అక్రమ రవాణా ముఠాలకు సింహస్వప్నం.. వేలాది మంది బాధితులకు విముక్తి.. 2 వేల మందికి పైగా సివిల్ సర్వెంట్లకు మార్గదర్శకత్వం.
రాష్ట్రంలో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే అంశాలపై ప్రముఖులు స్పందిస్తుండడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
తెలంగాణ విద్యా వ్యవస్థలో కీలక సంస్కరణలు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఇటీవలి కాలంలో ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో తగిన భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిర్వహించిన దాండియా వేడుకలో దురదృష్టవశాత్తు ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. అలాగే ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా సినిమా ప్రమోషన్ ఈవెంట్  నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.  
కూల్‌డ్రింక్‌లో విషం కలిపి 10వ తరగతి విద్యార్థి హత్య.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.