ఏటా జూన్ 21న జరుపుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్నిఈ ఏడాది ఎపిలో నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజల నుంచి వస్తున్న స్పందన ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగిన రిజస్ట్రేషన్లు, జిల్లాల్లో జరుగుతున్న యోగా సాధన కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం అద్భుతంగా ఉందన్నారు. పూర్తి స్థాయి సన్నద్ధతతో, ప్రజల భాగస్వామ్యంతో అత్యధిక మందితో యోగా నిర్వహించి గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించాలనే లక్ష్యాన్ని పూర్తి చేయాలన్న చంద్రబాబు, జూన్ 21న విశాఖలో 5 లక్షల మంది పాల్గొనేందుకు అవసరమైన ఏర్పాట్లు పక్కాగా జరగాలని అధికారులను ఆదేశించారు.
జూన్ 21న ప్రధాని నరేంద్రమోడీ రాక సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయనీ, వీటిని దృష్టిలో పెట్టుకుని ఎవరికీ ఎటువంటి ఇబ్బందీ కలగకుండా పక్కా ఏర్పాట్లు చేయాలన్నారు. యోగాడైపై మంగళవారం (జూన్ 3) నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. యోగా డే కంటే ముందు రెండు సార్లు రాష్ట్ర స్థాయిలో భారీగా ప్రీ ఈవెంట్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 7వ తేదీ ప్రతి గ్రామంలో, ప్రతి ప్రాంతంలో యోగా డే అవగాహనా ర్యాలీలు, 14 వతేదీ రాష్ట్రంలో లక్ష ప్రాంతాల్లో యోగా సాధన ఉంటుందన్నారు. చేస్తారు. ప్రతి విద్యా సంస్థతో పాటు అవకాశం ఉన్న అన్ని సంస్థలు, ప్రాంతాల్లో 14వ తేదీ యోగా నిర్వహించి యోగా డేకు ప్రజలను సిద్దం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్, వంగలపూడి అనిత, డోలా బాలవీరాంజనేయస్వామి, సత్యకుమార్, సీఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హాజరయ్యారు.
యోగా మాసంలో భాగంగా ఇప్పటి వరకు వివిధ స్థాయిల్లో జరిగిన కార్యక్రమాలను, యోగా డే నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 21వ తేదీన విశాఖలో వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా చేసేందుకు జర్మన్ హ్యాంగర్లతో మరో వేదిక సిద్ద చేసినట్లు అధికారులు తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cm-chandrababu-review-on-yoga-day-25-199265.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.