Publish Date:Jun 13, 2025
తల్లికి వందనంపై తప్పుడు ప్రచారం చేస్తే వైసీపీ నేతలకు తీవ్ర పరిణామాలు తప్పవు అని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. తల్లికి వందనంలో రూ. 13 వేలు ఇచ్చి రూ. 2 వేలు నా ఖాతాలో పడ్డాయన్న ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులు రుజువు చేయాలి, లేకుంటే క్షమాపణ చెప్పి ప్రకటన ఉపసంహరించుకోవాలి. అలా చేయకుంటే వారిపై చట్ట ప్రకారం ముందుకెళ్తా లోకేష్ హెచ్చరించారు. వైసీపీ ఆరోపణలని గతంలో మాదిరి భరించేది లేదు. నిరాధార ఆరోపణలు చేసేవారు మూల్యం చెల్లించుకోక తప్పదు'. అని లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. అటు, ఉపాధ్యాయుల బదిలీలు జూన్ 16 కల్లా పూర్తి చేస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఆంధ్రా మోడల్ ఎడ్యుకేషన్' దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలువుతాం. ప్రజలందరూ పిల్లలని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని విజ్ఞప్తి.
తల్లికి వందనం అర్హులు ఎంత మంది ఉంటే అంత మందికీ లబ్ది చేకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 42 లక్షల మందికి మాత్రమే అమ్మ ఒడి ఇచ్చింది. కూటమి ప్రభుత్వం 67.27 లక్షల మంది విద్యార్ధులకు పథకాన్ని వర్తింప చేస్తున్నాం. అర్హులు ఇంకా ఉన్నా ఇస్తాం'. అని లోకేష్ తెలిపారు. ఏపీలో కూటమి సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'తల్లికి వందనం' పథకం కింద అర్హులైన తల్లుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు, సూపర్ సిక్స్‌లో భాగంగా ఈ పథకాన్ని అమలు చేస్తుండటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పిల్లల తల్లులు తమ ఆనందాన్ని వివిధ రూపాల్లో వ్యక్తం చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cm-chandrababu-25-199882.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.