ప్రస్తుత పరిస్థితుల్లో బెస్ట్ బడ్జెట్‌...సీఎం చంద్రబాబు హర్షం

Publish Date:Feb 14, 2026

Advertisement

 

ఏపీ బడ్జెట్‌పై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్ధితుల్లో మెరుగైన బడ్జెట్‌ పెట్టామని ముఖ్యమంత్రి  అసెంబ్లీలో తెలిపారు. వైసీపీ విధ్వంసం నుంచి కోలుకోవాలంటే ఇంకా సమయం పడుతుందని ముఖ్యమంత్రి అన్నారు. ఆదాయం తక్కువ-ఖర్చులు ఎక్కువ అనేది వారసత్వంగా వచ్చిందని ఇబ్బందులను అధికగమించి ఇప్పుడిప్పుడే ట్రాక్‌లో పడుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మేనేజ్ చేసుకుంటా వస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.

 వ్యవసాయం, సేవారంగాల నుంచి ఆదాయం పెరగాలి. రెండుమూడేళ్లలో అమరావతికి స్పష్టమైన రూపు వస్తుంది. అక్కడి రోడ్లను జాతీయ రహదారులతో అనుసంధానిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.  దీంతో రాకపోకలు పెరిగి ఆదాయం కూడా పెరుగుతుంది. పశ్చిమ బైపాస్‌తో అమరావతికి యాక్సెస్‌ మెరుగుపడింది. ఇన్నర్‌, ఔటర్‌ రింగ్‌ రోడ్లు పూర్తయ్యాక మరింత అభివృద్ధి జరుగుతుంది’’ అని చంద్రబాబు వివరించారు. రాయలసీమ అభివృద్ధిపై మాట్లాడుతూ… ‘‘హార్టీకల్చర్‌ హబ్‌కు రూ.30 వేల కోట్లు కేటాయించడం మంచి నిర్ణయమన్నారు.

ఒకప్పుడు రాయలసీమలో పశువులకు కూడా నీరు దొరకని పరిస్థితి ఉండేది. 2014-19 కాలంలో రెయిన్‌ గన్స్‌తో పంటలను కాపాడాల్సి వచ్చింది. అప్పుడే హంద్రీనీవా ప్రాజెక్ట్‌ను సీరియస్‌గా తీసుకున్నాం. రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చింది మా ప్రభుత్వమే. దేశంలోనే నాణ్యమైన పండ్లు ఇప్పుడు రాయలసీమ నుంచే వస్తున్నాయి. ఇక్కడ పండే దానిమ్మకు మంచి డిమాండ్‌ ఉంది’’ అని సీఎం అన్నారు.

ఎమ్మెల్యేలు గతంలో ఉన్నట్లు ఉంటానని ఎమ్మెల్యేలు మారకపోతే వాళ్లకే ముఖ్యమంత్రి హెచ్చరించారు.  9 పారామీటర్లపై సర్వే చేయించి నివేదిక ఇస్తున్నాం..అది ఎమ్మెల్యేల పనితీరుకు నిలువుటద్దం..వారికి తెలియని ఇంకొన్ని పారామీటర్లు కూడా నా వద్ద ఉన్నాయని తెలిపారు. మంగళగిరి చీరలకు లోకేశ్‌ మంచి బ్రాండింగ్‌ తీసుకొస్తున్నారు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఇవాళ మహిళా సభ్యులు ఒకేరకమైన చీరలతో సభకు రావడం వారి ఐక్యతకు నిదర్శనమని తెలిపారు.
 

By
en-us Political News

  
అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం గండబోయినపల్లె టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతుండగా, తాజాగా జరిగిన మ్యాచ్‌లో ఊహించని విషాదం చోటుచేసుకుంది.
తెలంగాణలో మావోయిస్టుల భారీ లొంగుబాటు సంచలనంగా మారింది.
400 అడుగుల బీఎస్ఎన్ఎల్ టవర్‌పై.. 560 రోజులుగా నిరసన.. పంజాబ్‌కు చెందిన పాడి రైతు
రాజేంద్రనగర్ లో విద్యార్థుల ఆందోళన చేస్తూ ఉండడంతో అక్కడ కొంత ఉధృత వాతావరణం నెలకొంది.
ముంబై ఇండియన్స్ అభిమానులకు ఐపీఎల్ వర్గాలు ఓ గుడ్ న్యూస్ చెప్పింది.
మరో వైపు చర్చలలో పాల్గొనేందుకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చీ నేతృత్వంలో ఉన్నత స్థాయి బృందం ఇస్లామాబాద్ చేరుకుంది. అయితే అమెరికా ప్రతినిథులతో ముఖాముఖీ చర్చలకు మాత్రం నో చెప్పింది. తాము చెప్పదలచుకున్న విషయాలను పాకిస్థాన్ అధికారుల ద్వారానే అమెరికాకు చేరవేస్తామని.. అంటే పరోక్ష చర్చలకు మాత్రమే తాము సిద్ధమని ఇరాన్ చెప్పకనే చెప్పింది.
ప్రజాదరణపై ఏ స్థాయిలో ఉంటుందో రాఘవ్ చద్దా ఉదంతం మరోసారి నిరూపించింది.
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ పక్షం నిలువునా చీలిపోయింది.
వీసా నిబంధనల ఉల్లంఘన జరుగుతోందనే నెపంతో.. ప్రైవేట్ వ్యక్తులు కెమెరాలతో భారత హఎచ్ 1బి వీసా ఉద్యోగులు పని చేస్తున్న కార్యాలయాలకు, వారి నివాసాలకూ కూడా వెళ్లి హల్‌చల్ చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఉద్యోగులను కలవరానికి గురి చేస్తున్నది.
ఎమ్మెల్సీ అనంతబాబు సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నాలను తీవ్రంగా పరిగణించిన కాకినాడలోని మొబైల్ కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది.
తమకు ఇష్టం లేని గర్భాన్ని కొనసాగించమని బలవంతం చేయడం వారి ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
భారతదేశంలోని కోట్లాది మంది ఉద్యోగులకు అత్యంత కీలమైన పెన్షన్ విధానంలో భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.