కిరణ్ -బొత్సల మధ్య తారస్థాయికి ఆధిపత్య పోరు

Publish Date:Feb 22, 2012

Advertisement

హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు మధ్య ఆధిపపత్య పోరు తారస్థాయికి చేరింది. అవకాశం లభించినపుడల్లా ఇద్దరు నేతలు అధిష్ఠానవర్గానికి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటుండగా వారి అనుకూలురు కూడా ఆదే బాట పడుతున్నారు. పార్టీపరంగా బొత్స తీసుకునే నిర్ణయాలను ముఖ్యమంత్రి అధిష్ఠానం వద్ద అడ్డుకుంటుండగా ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలకు అధిష్ఠానం వద్ద బొత్స అడ్డుకుంటున్నారన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. రెండు రోజులుగా శాసనసభ లాబీల్లో ఇద్దరు నేతల అనుకూలురు తమ ప్రచార స్థాయిని పెంచారు. పిసిసి అధ్యక్షుడుగా బొత్సను తొలగించి తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికి ఆ పదవిని ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి అనుకూలురు ప్రచారం చేస్తున్నారు. దీనికి ప్రతిగా అసెంబ్లీ సమావేశాల తర్వాతనో, ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతనో ముఖ్యమంత్రిని మార్చడం ఖాయమని బొత్స అనుకూలురు ప్రచారం చేస్తున్నారు.


సమాచార హక్కు కమిషనర్ల జాబితాలో సగం మందిని గవర్నర్ తిరస్కరించడంతో ముఖ్యమంత్రి, పిసిసి నేత మధ్య నెలకొన్న విభేదాలు భగ్గుమన్నాయి. ఉప ఎన్నికల అభ్యర్థుల మార్పు విషయంలో కూడా బొత్స ప్రమేయం ఉండి ఉండవచ్చన్న అనుమానాన్ని ముఖ్యమంత్రి సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు. ఉప ఎన్నికలు జరగనున్న ఏడు స్థానాలకుగాను ఆరు స్థానాల్లో ఎదురీదే పరిస్థితి ఉందని, మహబూబ్‌నగర్ టిక్కెట్టును దివంగత ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి భార్య విజయలక్ష్మికి ఇచ్చినట్లయితే సానుభూతి ఓట్లతో కొద్దిగా గట్టెక్కే పరిస్థితి ఉంటుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడినట్లు సమాచారం, అయితే అధిష్ఠానవర్గం మాత్రం ముఖ్యమంత్రి సిఫార్సు చేసిన విజయలక్ష్మికి కాకుండా ప్రకాశ్‌కు ఇచ్చింది. మహబూబ్‌నగర్ అభ్యర్థి మార్పు విషయంలో బొత్స హస్తం ఉండి ఉండవచ్చని ముఖ్యమంత్రి సన్నిహితులు అనుమానిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మహబూబ్‌నగర్ టిక్కెట్టు విజయలక్ష్మికే దక్కేలా ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.


కాగా, పిసిసి కార్యవర్గాన్ని, డిసిసి అధ్యక్షుల్ని నియమించేందుకు బొత్స నిర్ణయించగా ముఖ్యమంత్రి అడ్డుకున్నారని పిసిసి నేత సన్నిహితులు చెబుతున్నారు. సగం మంది డిసిసి అధ్యక్షుల్ని ఎంపిక చేసి అధిష్ఠానవర్గం ఆమోదంతో ప్రకటించేందుకు బొత్స సిద్ధపడగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని అధిష్ఠానంతో చెప్పి అడ్డుకున్నారని బొత్స సన్నిహితులు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి, పిసిసి నేతల వైఖరి పట్ల కేంద్రమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి గులాం నబీ ఆజాద్ కూడా అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. ఇద్దరి వ్యవహార శైలి పట్ల ఆయన ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది.

By
en-us Political News

  
సాయంత్రాలు ఒకింత సేదదీరుదామని పార్కులకు వెడదామనుకునే మధ్య తరగతి వేతన జీవులు, కష్ట జీవులకు ఇక పార్కులలో ప్రవేశం భారంగా మారనుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని పార్కులలో ప్రవేశ రుసుము ఇక దాదాపు రెట్టింపు కానుంది.
రాష్ట్రంలో ఆన్‌లైన్ ఫార్మసీ వేదికల ద్వారా జరుగుతున్న మందుల విక్రయాలపై తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (టీజీ సేఫ్)  దాడులు నిర్వహించారు.  ఔషధ విక్రయాలకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలను  ఉల్లంఘించినట్లు తేలడంతో, ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లతో భాగస్వామ్యం కలిగి ఉన్న మొత్తం 23 మెడికల్ షాపుల లైసెన్సులను అధికారులు సస్పెండ్ చేశారు. 
ప్రభుత్వ ఉద్యోగం.. అందులోనూ కీలకమైన టౌన్ ప్లానింగ్ అధికారి బాధ్యతలు.
హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ యూనివర్సిటీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
క్రీడా రంగానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఖేలో ఇండియా క్రీడలు యువతలో ఉత్సాహాన్ని నింపుతాయని ప్రధాని రేవంత్ తో అన్నట్లు సమాచారం. ప్రధాని మోదీతో జరిగిన ఈ సమావేశం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా  ప్రాధాన్యత సంతరించుకుంది.
అలాగే మాజీ సీబీఐ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు, సజ్జనార్‌పై  బహిరంగంగా పలు ఆరోపణలు, తీవ్ర వ్యాఖ్యలు చేశారనీ,   పోలీసు యూనిఫాం వెనుక దాక్కున్న నేరస్థుడిగా ఆయన సజ్జనార్ ను అభివర్ణించారనీ తన లేఖలో పేర్కొన్న రాజాసింగ్, అటువంటి ఆరోపణలను ఎదుర్కొంటున్న సజ్జనార్ పై చర్యలు తీసుకోకుండా కేవలం బదలీతో సరిపెట్టడమేంటని నిలదీశారు.
అక్వాన్ ప్రభావం ప్రధానంగా తెలంగాణలోని తూర్పు దక్షిణ జిల్లాలపై అధికంగా ఉంటుంది. ఈ నెల 20 నుంచి 22 వరకూ అక్వాన్ ప్రభావంతో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.  
ఐదు తులాల బంగారం ఆశ.. రెండున్నర తులాల గొలుసు స్వాహా.!
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
భారత రాజకీయాల్లో దేశంలోనే అత్యంత సంపన్నుల ఎదుగుదలపై, ముఖ్యంగా పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ అసాధారణ ప్రగతిపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ సంక్షేమ కానుకను అందించేందుకు సిద్ధమైంది.
women cricketer Nandini suicide,BCCI Under 19 cricket, Vikarabad crickete, rFemale cricketer suicide
బీసీ రాజ్యాధికార పాదయాత్రలో తన వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.