లోకేష్‌కు క్లీన్ చిట్.. జగన్ బండారం బైటపడిపోయిందిగా?

Publish Date:Oct 12, 2023

Advertisement

వైసీపీ ప్రభుత్వం అక్రమంగా ఇరికించిన స్కిల్  కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టై   నెల రోజులు దాటింది.   ఇదే కేసులో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా  అరెస్ట్ కాబోతున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతూ వస్తున్నది. స్వయంగా సీఐడీ చీఫ్ మీడియా సమావేశంలోనే లోకేష్ ను అరెస్టు చేస్తామని ప్రకటించారు.  లోకేష్ కూడా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసుకున్నారు.   ఈ కేసులో నారా లోకేష్‌కు క్లీన్ చిట్ లభించింది. స్వయంగా సీఐడీయే లోకేష్ ఈ కేసులో నిందితుడు కాదని కోర్టుకు తెలిపింది. గురువారం ఉదయం నుంచి హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరగ్గా మధ్యాహ్నానికి లోకేష్‌పై ఉన్న స్కిల్ కేసును హైకోర్టు క్లోజ్ చేసింది. విచారణ సందర్భంగా సీఐడీ లోకేష్‌ను స్కిల్ కేసులో నిందితుడిగా తాము చేర్చలేదని చెప్పింది. అసలు లోకేష్ ను ముద్దాయిగా చూపని కారణంగా ఆయన్ను అరెస్ట్ చేయబోమని కోర్టుకు సీఐడీ తెలిపింది. ఒకవేళ ఈ కేసులో నిందితుడిగా చేరిస్తే 41-ఏ కింద నోటీసులు ఇస్తామని న్యాయస్థానానికి సీఐడీ అధికారులు వెల్లడించారు. 

నిజానికి చంద్రబాబు అక్రమ అరెస్ట్ అయిన వారానికే నారా లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తారని అధికార వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేసిన తెలిసిందే.  వైసీపీ మంత్రుల నుండి సలహాదారుల వరకూ అంతా మీడియా ముందుకొచ్చి లోకేష్ కూడా అరెస్ట్ కానున్నట్లు చెప్పారు.  ఒక కేసులో బెయిల్ దక్కినా ఎన్ని కేసులైనా పెట్టి ఆయనను కూడా జైలుకు పంపిస్తామని వైసీపీ నేతలు శపథాలు కూడా చేశారు. అప్పటికి నారా లోకేష్ ఢిల్లీలో ఉన్నారు.  లోకేష్ ఢిల్లీ నుండి రాగానే అరెస్ట్ చేయాలని భావించారు. కానీ లోకేష్ ఢిల్లీ నుండి వచ్చినా అరెస్ట్ చేయలేదు. మళ్ళీ లోకేష్ ఢిల్లీ వెళ్లినా వైసీపీ నేతల నుండి కానీ, సీఐడీ నుండి కానీ లోకేష్ అరెస్ట్ మీద ప్రకటనలు లేవు. ఇంకా చెప్పాలంటే అసలు ఏమైందో ఏమో కానీ తర్వాత అరెస్ట్ ఊసే లేకుండా పోయింది.

కానీ, అప్పటికే లోకేష్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్ పైన ఈ నెల 4న విచారణ జరగగా.. అప్పుడు  గురువారం(అక్టోబర్ 12) వరకూ అరెస్ట్ చేయవద్దని సీఐడీని న్యాయస్థానం ఆదేశించింది. నేడు మరోసారి విచారణ జరగగా సీఐడీ తరపు లాయర్లు కోర్టుకు తమ వివరణ ఇచ్చారు. అసలు స్కిల్ కేసులో లోకేష్ నిందితుడే కాదని, ఆయనకు ఈ కేసుకు ఎలాంటి సంబంధంలేదని న్యాయస్థానం ముందే సీఐడీ క్లియర్ కట్ గా చెప్పింది. లోకేష్‌ను స్కిల్ కేసులో నిందితుడిగా తాము చేర్చలేదని, ముద్దాయిగా చూపని కారణంగా ఆయన్ను అరెస్ట్ చేయబోమని కోర్టుకు సీఐడీ తెలిపింది. దీంతో ఈ కేసులో లోకేష్ కు కంప్లీట్ రిలీఫ్ లభించింది.  గతంలో ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేష్ నిందితుడు కాదని చెప్పగా.. ఇప్పుడు స్కిల్ కేసులో కూడా క్లీన్ చిట్ ఇచ్చారు.

స్కిల్   కేసు విషయంలో మొదట్నుంచీ అన్నీ అనుమానాలే. అసలు ఈ కేసు చంద్రబాబు, లోకేష్ పేర్లు లేవు. కానీ, ఉద్దేశ్యపూర్వకంగానే  చంద్రబాబును అరెస్టు చేసి.. ఆ తరువాత ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు చేర్చారు. ఇప్పుడు ఆధారాలు చూపలేక నానా తిప్పలూ పడుతున్నారు. నెల రోజులుగా ఈ కేసును నిరూపించుకునేందుకు న్యాయనిపుణులు, సీనియర్ న్యాయమూర్తుల సలహాలతో సీఐడీ మల్లగుల్లాలు పడుతుంది. ఇది అక్రమ కేసని ఇప్పటికే ప్రజలకు క్లియర్ కట్ గా అర్ధమైపోయింది. అలాంటిది ఇప్పుడు ఈ కేసులో లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తే సమస్య మరింత ముదురుతుందని భావించే వెనక్కు తగ్గినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు అరెస్టుతో  వైసీపీ తన పతనాన్ని తనే శాశించుకుందనీ, ఇక లోకేష్ ను కూడా అరెస్టు చేస్తే ఉనికే లేకుండా పోతుందన్న తత్వం బోధపడటంతోనే జగన్ సర్కార్ వెనక్కు తగ్గిందని అంటున్నారు. స్కిల్ కేసులో లోకేష్ కు క్లీన్ చిట్ ఇస్తూ సీఐడీయే కార్టుకు తెలియజేయడంతోనే జగన్ బండారం బైటపడిపోయిందనీ, కేవలం కక్ష సాధింపు కోసమే చంద్రబాబును అరెస్టు చేశారనీ మరో  నిర్ద్వంద్వంగా తేలిపోయిందనీ అంటున్నారు. 

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.