ఇండియా కూటమి నేతలతో భేటీకి సీజేఐ నో: పిటిషన్ రూపంలో కోర్టును ఆశ్రయించాలని స్పష్టీకరణ.!
Publish Date:Oct 11, 2026
Advertisement
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు. ఇండయా కూటమి నేతలు తన సమస్యలను పిషిషన్ రూపంలో కోర్టు ముందుండాలని ఆయన పేర్కొన్నారు. దీంతో నేడు ఇండియా కూటమి నేతల చలో సుప్రీం కోర్టు మార్చ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా సీజేఐ ఇండియా కూటమి నేతల భేటీని తిరస్కరించడానికి వారు.. ఇప్పటికే విచారణలో ఉన్న అంశాలపై తనతో చర్చించాలని భావిస్తుండటమే కారణమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వారి అభ్యర్థనను సీజేఐ సూర్యకాంత్ తిరస్కరించారనీ, పిటిషన్లను విచారించి తీర్పులు ఇవ్వడమే న్యాయస్థానాల విధి అని ఆయన పేర్కొన్నారనీ తెలుస్తోంది. ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడేందుకు సుప్రీంకోర్టు కట్టుబడి ఉందని, న్యాయస్థానం తలుపులు అందరికీ ఎల్లవేళలా తెరిచే ఉంటాయనీ సీజేఐ పేర్కొన్నట్లు సమాచారం. ఎస్ఐఆర్లో అక్రమాలు జరిగాయని ఇండియా కూటమి ఆరోపిస్తోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపై సోమవారం (అక్టోబర్ 12) చలో సుప్రీంకోర్టు మార్చ్ చేపట్టాలని నిర్ణయించింది. ఈ నిరసన ఏ ఒక్క రాజకీయ పార్టీకి పరిమితం కాదని, భారతీయులందరిదీనని కాంగ్రస్ అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఎన్నికల సంస్కరణలపై ఇండియా కూటమి ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు వినతిపత్రం సమర్పించిన విషయం తెలిసిందే. సీఈసీ రాజీనామా, 2023 చట్టం రద్దు, ఎస్ఐఆర్ ప్రక్రియ నిలిపివేత, తొలగించినట్లు ఆరోపిస్తున్న 13.3 కోట్ల మంది ఓటర్ల పేర్ల పునరుద్ధరణ కోరుతూ ఆ వినతి పత్రం సమర్పించింది. [CJI Surya Kant Reject, INDIA Bloc Plea, Rahul Gandhi, Mallikarjun Kharge, Supreme Court, , Vote Theft Allegations, Election Commission, SIR, Telugu One]
http://www.teluguone.com/news/content/cji-surya-kant-reject-39-234069.html




