Publish Date:Apr 16, 2024
చిరంజీవి మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ అవుతున్నారా? ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తరువాత కొంత ఇన్ యాక్టివ్ గా కనిపించిన ఆయన రాష్ట్ర విభజన తరువాత రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వచ్చారు. మధ్యమధ్యలో ఏదో సినిమా డైలాగుల్లో మాత్రమే ఆయన రాజకీయంపై వ్యాఖ్యలు చేశారు తప్ప క్రియాశీలంగా పొలిటికల్ యాక్టివిటీలో పాల్గొన్నది లేదు. పలు సందర్భాలలో ఆయన తాను రాజకీయంగా తటస్థంగా ఉంటానని స్వయంగా చెప్పారు కూడా.
అందుకు అనుగుణంగానే తన సోదరుడు పవన్ కల్యాణ్ 2014లో జనసేన పార్టీ స్థాపించిన సమయంలో కానీ, 2019 ఎన్నికలలో జనసేన పోటీ చేసిన సమయంలో కానీ ఎన్నడూ పవన్ కల్యాణ్ కుమద్దతుగా మాట్లాడింది లేదు. ఆయన పార్టీ కోసం ప్రచారం చేసిందీ లేదు. అయితే ఆశ్చర్యకరంగా ఇటీవల ఆయన రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. జనసేన పార్టీకి ఐదు కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. అలాగే అనకాపల్లి నియోజకవర్గం నుంచి కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా బీజేపీ తరఫున లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ కు మద్దతు పలికారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
అయితే చిరంజీవి ఇప్పుడు రాజకీయంగా వార్తలలో నిలవడానికి, ఆసక్తిని దాచుకోకుండా బహిర్గతం చేయడానికి ఏపీ సీఎం జగనే కారణమా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చిరంజీవి సన్నిహితులు అలాగే పరిశీలకులు సైతం ఏపీలోని జగన్ సర్కార్ కారణంగా తెలుగుసినీ పరిశ్రమ ఇబ్బందుల్లో పడటమే కాకుండా స్వయంగా చిరంజీవి స్థాయిని తగ్గించేలా సీఎం వ్యవహరించిన తీరే చిరు మళ్లీ రాజకీయంగా యాక్టివ్ కావడానికి కారణమని అంటున్నారు.
చిరంజీవి నేతృత్వంలో పరిశ్రమకు చెందిన ప్రముఖులు జగన్ ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసిన నాటి ఘటనను గుర్తు చేస్తూ ఇప్పుడు చిరంజీవి పొలిటికల్ యాక్టవిటీకి లింకు పెట్టి విశ్లేషణలు చేస్తున్నారు. అప్పట్లో జగన్ క్యాంపు కార్యాలయానికి కొద్ది దూరంలోనే తన కారును నిలిపివేసి నడిపించడం, ఆ తర్వాత సమావేశంలో కూడా జ జోడించిన సమయంలో జగన్ ప్రత్యభివాదం చేయకపోవడం గుర్తు చేస్తూ.. ఆ అవమానాన్ని ఇంత వరకూ పంటి బిగువున భరించిన చిరంజీవి ఇప్పుడు మరో సారి జగన్ అధికారంలోకి రాకూడదన్న బలమైన ఆకాంక్షతోనే చిరు రాజకీయ కార్యకలాపాల ద్వారా తన మద్దతు ఎవరికో సంకేతాలు ఇస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chiranjeevi-active-politicall-39-173917.html
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్‌తో పునాదులు పడ్డాయి. అక్కడి నుంచి ఈ పార్టీ అంచలంచలుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గతంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాసన రుచి చూపడంతో.. ఇప్పుడు వరుసగా మూడు పర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్రస్తుతం అప్రతిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.