ఐటీ నుంచి పెద్దల సభ వరకూ చింతకాలయ విజయ్ ప్రస్థానం

Publish Date:Jun 7, 2026

Advertisement

చింతకాయల విజయ్ అంటే కేవలం చింతకాలయ అయ్యన్న పాత్రుడు రాజకీయ వారసుడు మాత్రమే కాదు.  ఉన్నత విద్యావంతుడు.  విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించి, రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో రాకముందు కార్పొరేట్ రంగంలో పనిచేశారు. ఐటీ, బిజినెస్ మేనేజ్‌మెంట్ రంగాలపై ఆయనకున్న అవగాహన  టెక్నాలజీని రాజకీయ వ్యూహాల్లోకి ఎలా అమలు చేయాలో  నేర్పింది. ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్,  కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా  రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత   టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో..  సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది. ఆ సమయంలో టీడీపీ ఐటీ వింగ్,  సోషల్ మీడియా విభాగాల బాధ్యతలను విజయ్ భుజానికెత్తుకున్నారు.  పార్టీ కోసం ఒక పటిష్టమైన సోషల్ మీడియా ఆర్మీని అంటే టీడీపీ డిజిటల్ వింగ్ ను నిర్మించారు.   కేవలం అమరావతి, హైదరాబాద్‌కే పరిమితం కాకుండా గ్రామ స్థాయి వరకు వాట్సాప్, ఎక్స్), ఫేస్‌బుక్ గ్రూపుల ద్వారా పార్టీ లూప్‌ను కనెక్ట్ చేశారు.

  అప్పటి అధికార వైసీపీ  ఐప్యాక్   టీమ్ సోషల్ మీడియాలో సంధించే విమర్శలను, ట్రోల్స్‌ను అంతే వేగంగా డిజిటల్ వేదికలపై తిప్పికొట్టడంలో విజయ్ వ్యూహాలు కీలకంగా పనిచేశాయి.  2019, 2024 మధ్య కాలంలో ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసినందుకు, పార్టీ వాయిస్‌ను గట్టిగా వినిపించినందుకు విజయ్ తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్లను, న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు.  సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో జగన్ సర్కార్  విజయ్‌పై పలు కేసులు నమోదు చేసింది. హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి ఏపీ సీఐడీ పోలీసులు వచ్చి నోటీసులు ఇవ్వడం, విచారణల పేరుతో ఇబ్బంది పెట్టడం వంటి పరిణామాలు జరిగాయి. ఈ ఒత్తిళ్లకు లొంగకుండా ఆయన నిలబడటం, న్యాయపోరాటం చేయడం ద్వారా పార్టీ క్యాడర్‌లో ఆయనపై గౌరవం పెరిగింది. కేవలం ఏసీ రూముల్లో కూర్చునే నేత కాదనీ.. , పార్టీ కోసం కేసులు ఎదుర్కొనే  ఫైటర్  అనీ తెలుగుదేశం క్యాడర్ గుర్తించింది. దీంతో యూత్ లో చింతకాలయ విజయ్ కు ఫాలోయింగ్ పెరిగింది. 

ఇక విజయ్ తండ్రి చింతకాలయ అయ్యన్నపాత్రుడు సుదీర్ఘ కాలంగా ఉత్తరాంధ్ర   రాజకీయాల్లో బలమైన బీసీ  సామాజికవర్గ నేతగా ఉన్నారు. అయ్యన్నపాత్రుడు ప్రస్తుతం స్పీకర్ హోదాలో ఉండటంతో ప్రత్యక్ష రాజకీయ విమర్శలకు దూరంగా ఉండాల్సి వస్తోంది. ఈ తరుణంలో ఆయన రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ..  ఉత్తరాంధ్రలో పార్టీ యువతను సమూహపరచడంలో విజయ్ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. అన్నిటికీ మించి చింతకాయల విజయ్ కేవలం ఒక నియోజకవర్గానికో లేదా జిల్లాకో పరిమితమైన నాయకుడు కాదు. సాంకేతికతను, సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీడీపీ డిజిటల్ క్యాడర్‌ను లీడ్ చేసిన అనుభవం ఆయనకుంది. అందువల్లే, నేటి ఆధునిక రాజకీయాల్లో, మారుతున్న ఢిల్లీ సమీకరణాలకు అనుగుణంగా ఇలాంటి  టెక్-సావీ, అలాగే దూకుడుగా వ్యవహరించే యువనాయకుడిగా గుర్తించిన తెలుగుదేశం అధినాయత్వం చింతకాలయ విజయ్ ను రాజ్యసభకు పంపించాలని నిర్ణయించుకుంది.  

By
en-us Political News

  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.