ఈ సారి మంగళగిరి చినబాబుదే!

Publish Date:Aug 25, 2023

Advertisement

తెలుగుదేశం జాతీయ కార్యదర్శి  నారా లోకేష్ విజయం ఈ సారి నల్లేరుమీద బండినడకే అంటున్నాయి తెలుగుదేశం వర్గాలు.  నారా లోకేష్ కూడా మరోసారి మంగళగిరి నుండే పోటీ చేస్తా.. గెలిచి తీరుతా కావాలంటే రాసి పెట్టుకోండి అంటూ సవాల్ విసురుతున్నారు. అయితే అదే సమయంలో వైసీపీ నుండి మాత్రం తమ పార్టీ విజయంపై ఇసుమంతైనా  ధీమా వ్యక్తం కావడం లేదు.

మరోసారి లోకేష్ ను ఓడిస్తాం అని ఎమ్మెల్యే ఆళ్లగడ్డ రామకృష్ణారెడ్డి నుండి ఒక్క మాట కూడా రావడం లేదు. మరోసారి మంగళగిరిలో విజయం మాదే అంటూ వైసీపీ నుండి ప్రకటనలు లేవు. దీంతో అసలేం జరుగుతోంది? మంగళగిరిలో ఈసారి ప్రజల మూడ్ ఎలా ఉండబోతుంది? టీడీపీ ధీమాకి కారణం ఏంటి? వైసీపీ మౌనం వెనుక ఉన్న భయం ఏమిటి?  అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.   వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి 2014, 2019లలో రెండు సార్లు మంగళగిరి నుంచి గెలిచారు. 2014లో జస్ట్ 12 ఓట్ల తేడాతో బయటపడిన ఆర్కే 2019లో నారా లోకేష్ పై 5 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. నిజానికి ఈ మెజారిటీ కూడా అంత గొప్పదేమీ కాదు. ఎందుకంటే రాష్ట్రమంతా చంద్రబాబు వేవ్ కనిపిస్తున్న 2014 ఎన్నికలలో గెలిచిన ఆర్కే.. 2019 జగన్ వేవ్ లో కూడా జస్ట్ 5 వేల మెజార్టీ అంటే అది అతిపెద్ద గెలుపేమీ కాదు. మరి ఈసారి ప్రజలలో ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి నెలకొన్న నేపథ్యంలో ఆర్కే అక్కడ విజయం సాధించడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఒకవైపు ప్రభుత్వంపై అసంతృప్తితో పాటు ఆర్కేకు  కూడా ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ మరోసారి ఆర్కేకు మంగళగిరిలో అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా లేదని రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. మంగళగిరి నుండి ఈసారి ఆర్కేను తప్పించడం ఖాయమని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.

మరి ఆర్కేను తప్పిస్తే ఇక్కడ నుండి లోకేష్ మీద పోటీ చేసే నాయకులెవరు? దీనికి వైసీపీ వర్గాల నుండి రెండు మూడు అప్షన్లు వినిపిస్తున్నాయి. 2014లో టీడీపీ నుంచి ఆర్కేపై పోటీ చేసి.. ఆ తర్వాత వైసీపీలో చేరిన గంజి చిరంజీవి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావుల్లో ఒకరిని మంగళగిరి  బరిలో దించేందుకు జగన్ ఆలోచిస్తున్నట్లు చెప్తున్నారు. ఈ ముగ్గురిలో గంజి చిరంజీవికే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2014లో తెలుగుదేశం తరఫున పోటీ చేసిన గంజి చిరంజీవి కేవలం 12 ఓట్ల తేడాతో ఒడి పోయడం అంటే అంతో ఇంతో ప్రజలలో చిరంజీవికి పట్టు ఉన్నట్లునని వైసీపీ లెక్కలు వేసుకుంటోంది. కనుక చిరంజీవినే నారా లోకేష్ పై పోటీకి దింపడం ఖాయంగా కనిపిస్తున్నది. అదే జరిగితే లోకేష్ కు గెలుపు అవకాశాలు ఎక్కువ.

 ప్రజలలో ప్రభుత్వంపై అసంతృప్తి తీవ్రంగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు అమరావతి నాశనం ప్రభావం ఈసారి ఎన్నికలలో స్పష్టంగా కనిపించే ఛాన్స్ ఉంది. దీనికి తోడు మంగళగిరిలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన కక్ష పూరిత పాలన కూడా ఇక్కడ ప్రజలకు విరక్తి పుట్టించింది. ఆర్కే పుణ్యమా అని సీఎం సొంత సామాజిక వర్గం కూడా ఇక్కడ గుర్రుగా ఉందని తెలిసింది. సర్వేల్లోనూ వైసీపీకి ఇక్కడ ప్రతికూల ఫలితాలే వస్తున్నాయి. ఇప్పటికిప్పుడు గంజి చిరంజీవిని తీసుకొచ్చినా పార్టీ ఆయన్ని అభ్యర్థిగా ఎంత వరకు యాక్సెప్ట్ చేస్తుందన్నది అనుమానమే. ఆర్కేను   పక్కకి పెడితే ఆయన వర్గం చిరంజీవికి మద్దతు ఇవ్వడం కూడా అనుమానమే. 

మరో వైపు ఇక్కడ లోకేష్ గతాన్ని మించి బలోపేతం అయ్యారు. ఆయన నడత నుండి రాజకీయం వరకూ అన్నీ మారాయి. సొంత నియోజకవర్గంపై ఈసారి లోకేష్ మరింత గురి పెట్టనున్నారు. టీడీపీ అధిష్టానం కూడా ఈసారి మంగళగిరిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. ఇప్పటికే ఇక్కడ పార్టీని పటిష్ఠం చేసే బాధ్యతలను చంద్రబాబు ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధకు అప్పగించారు. త్వరలోనే గ్రామా స్థాయి నుండి మండల స్థాయి వరకూ ప్రతి ఒక్క నాయకుడితో లోకేష్ వ్యక్తిగతంగా కలిసే ప్రణాళిక రచించనున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఈసారి లోకేష్ గెలుపు నల్లేరు మీద నడకే అనే అభిప్రాయమే సర్వత్రా వ్యక్తం అవుతోంది.  

By
en-us Political News

  
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.