చార్మినార్ ఏసీపీ చంద్ర శేఖర్ భార్య ఆత్మహత్య
Publish Date:Jul 13, 2026
Advertisement
ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బృందావన కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. చార్మినార్ డివిజన్‌లో ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ భార్య హేమలత ఆదివారం తమ నివాసంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసు కుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న ఆల్వాల్ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. చంద్రశేఖర్–హేమలత దంపతులు బృందావన కాలనీలో నివాసం ఉంటు న్నారు. హేమలత ఆత్మ హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై ఆల్వాల్ పోలీ సులు కేసు నమోదు చేసుకొని వ్యక్తిగత కారణాల వల్లే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదికతో పాటు దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
http://www.teluguone.com/news/content/charminar-acps-wife-commits-suicide-36-225827.html





