ఏపీ అభివృద్ధి చిరునామా చంద్రబాబు.!

Publish Date:Aug 12, 2026

Advertisement

ఏపీ సీఎం  నారా చంద్రబాబు నాయుడు పాలనా నైపుణ్యం, దార్శనికతను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు.  నిజమైన విజనరీ చంద్రబాబు అన్న ఆమె.. ఏపీలో రాష్ట్రంలో జరుగుతున్న   ప్రగతికి ఆయనే నిజమైన చిరునామాగా అభివర్ణించారు.  సాంకేతిక పరిజ్ఞానం, పాలనా సంస్కరణలు, మౌలిక వసతుల విస్తరణ వంటి కీలక రంగాల్లో చంద్రబాబు చూపుతున్న చొరవ, ఆయన దార్శనికత ఏపీని అభివృద్ధి పథం వైపు పరుగులు పెట్టిస్తోందన్నారు. 

విజయనగరం  ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇటీవల న్యూఢిల్లీ  రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ ప్రత్యేక సమావేశంలో   అప్పలనాయుడు  అమరావతి నగర ప్రణాళికలు, విశేషాలతో రూపొందించిన కాఫీ టేబుల్ పుస్తకాన్ని రాష్ట్రపతికి అందజేశారు. ఆ పుస్తకంలో  రాజధాని నమూనాలు, నిర్మాణాలు, అమరావతి నగర ప్రణాళికల వివరాలను రాష్ట్రపతి ఎంతో ఆసక్తితో తిలకించారు.

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం..  రాష్ట్రలో ఐటీ , పారిశ్రామిక పురోగతి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు పడుతున్న శ్రమను రాష్ట్రపతి ముర్ము ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రశంసించారు. తన దార్శనికతో  రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే శక్తిమంతమైన నాయకత్వం చంద్రబాబు సొంతమన్న ముర్ము..టెక్నాలజీని  పాలనకు అనుసంధానించడంలో   ఆయన చూపుతున్న చొరవ రాష్ట్ర భవిష్యత్తుకు  మేలు చేస్తుందన్నారు. 

Chandrababu Visionary Leader, President Draupadi Murmu, Kalisetty Appalanaidu, Amaravati Coffee Table Book, Andhra Pradesh Development

By
en-us Political News

  
గత విచారణల సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌కు పంపిన నోటీసులు ఆయనకు అందలేదని తేలడంపై న్యాయమూర్తి.. ఈసారి ఎలాంటి సాంకేతిక విఘాతాలు లేదా డెలివరీ సమస్యలు తలెత్తకుండా పక్కాగా నోటీసులు అందజేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
ఒకవైపు పార్టీ మొత్తం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తే.. మరొ వైపు అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంత బాబు మాత్రం ప్రజా సమస్యల సభలో గళమెత్తుతానంటూ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం నెట్టింట తెగ ట్రోల్ అవుతోంది.
13 మందిపై 20,000 పేజీల భారీ సీబీఐ ఛార్జ్‌షీట్..!
సిట్ కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం, ఏపీపీఎస్సీ ప్రాథమిక నియమావళికి  విరుద్ధంగా ఒకే జవాబు పత్రాలను  మూడు విడతలుగా మూల్యాంకనం చేసినట్లు అధికారులు శాస్త్రీయంగా నిర్ధారించారు. డిజిటల్ విధానం, హైలాండ్ రిసార్ట్, అలాగే  విజయవాడ కేంద్రంగా మూడు వేర్వేరు దశల్లో ఈ మూల్యాంకన   సాగిందని నివేదిక పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విధానంపై ప్రస్తుతం తీవ్రస్థాయిలో రాజకీయ చర్చ నడుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు పదవుల కంటే పార్టీ సిద్ధాంతాలకు, ప్రజాసేవకే ప్రాధాన్యమిచ్చే నాయకులు అరుదుగా కనిపిస్తారు
రాజకీయ విభేదాల నేపథ్యంలో తనను కులం పేరుతో దూషించి, అవమానించారని ఆరోపిస్తూ ఓ రాజకీయ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ నేత జక్కిడి ప్రభాకర్‌రెడ్డిపై ఎల్‌బీనగర్ పోలీసులు కేసు నమోదు
 భార్య బస్సు క్లీనర్‌తో వెళ్లిపోయిందని సీసీటీవీ ఫుటేజ్‌ను విడుదల చేశాడు ఇన్‌ఫ్లుయెన్సర్ అఖిల్ ..!
ఓటర్ల జాబితా పునఃపరిశీలన సమయంలో ఎన్నికల సిబ్బంది ఆయన పేర్కొన్న చిరునామాకు వెళ్లి విచారణ జరిపారు. ఆ సందర్భంగా సదరు అపార్ట్‌మెంట్‌లో ప్రకాష్ రాజ్ గడచిన నాలుగు సంవత్సరాలుగా నివసించడం తేలింది. నివాసం ఉండని వ్యక్తి పేరును ఆ ప్రాంత ఓటర్ల జాబితాలో కొనసాగించడం నిబంధనలకు విరుద్ధం కావడంతో.. అధికారులు ఆయన పేరును చిరునామా మారిన ఓటర్ల కేటగిరీ కింద వర్గీకరించారు.
అధికారుల వేధింపులు, పని ఒత్తిళ్లే కారణమంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ ఆశా వర్కర్ చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా తీవ్ర ఘర్షణలకు, ప్రెస్ మీట్ల విమర్శలు-ప్రతివిమర్శలకు వేదికగా మారిన ముఖ్యమైన అంశాల్లో మెగా డీఎస్సీ ఒకటి..
సూర్యగ్రహణం వేళ కరెంట్ వాడకం తగ్గించిన వినియోగదారులకు ఉచిత విద్యుత్ ఇస్తామని ఆక్టోపస్ ఎనర్జీ ఆఫర్ ప్రకటించింది. సోలార్ పవర్ కొరత, గ్రిడ్ భద్రత మరియు నిపుణుల విశ్లేషణల పూర్తి వివరాలు ఇవే!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.