వివేకా హత్యపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Publish Date:May 30, 2026

Advertisement

 

గొడ్డలి పార్టీ అని ప్రజల్లోకి వెళ్లే కొద్ది సైకోలో ఫ్రస్ట్రేషన్‌ పెరుగుతోంది...

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రిని ఎవరు చంపారో తెలుసుకునే హక్కు వివేకా కుమార్తె సునీతకు ఉందన్నారు. ఆమె పోరాటం కారణంగానే ఇప్పటికీ వివేకా హత్య కేసు సజీవంగా ఉందన్నారు. సునీత పోరాటంలో న్యాయం, ధర్మం ఉన్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.  మీడియాతో చిట్‌చాట్ నిర్వహించి పలు కీలక అంశాలను సీఎం చంద్రబాబు వెల్లడించారు.

జగన్  కుటుంబ చరిత్ర, హత్యా రాజకీయాల గురించి ప్రస్తుత తరానికి తెలుస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. వైఎస్ కుటుంబం అరాచకాల గురించి తనకు కూడా కొన్ని విషయాలు తెలియవని.. ఇప్పుడు అవన్నీ బయటకు వస్తున్నాయని పేర్కొన్నారు. 30 ఏళ్ల క్రితం వచ్చిన 'కడప జిల్లాలో పాలెగాళ్ల రాజ్యం' పుస్తకాన్ని ఇప్పుడు అందరూ చదువుతున్నారని తెలిపారు. సైకో కంటే 'గొడ్డలి పార్టీ' అనే పేరును ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా గుర్తించారని అన్నారు. గొడ్డలి పార్టీ అనే ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లే కొద్దీ జగన్‌లో అసహనం పెరుగుతోందని ఎద్దేవా చేశారు.

హత్యా రాజకీయాలు చేసిన వారు రాష్ట్రాన్ని పరిపాలించవచ్చు కానీ, బాధితులు మాత్రం జిల్లా రాజకీయాలు చేయకూడదా? అంటూ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. నక్సలైట్లు తుపాకులతో రాజ్యాధికారాన్ని సాధించలేకపోయారని.. అలాగే గొడ్డలి పార్టీతో వీళ్లు రాజకీయాలు ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు. అసలు ప్రజాస్వామ్యానికి వీళ్లు ఎలా సరిపోతారంటూ వైసీపీ, జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై  చంద్రబాబు మాట్లాడారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ని టీడీపీ ప్రకటించడం దేశ రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందన్నారు. 

డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ని టీడీపీ ప్రకటించడం దేశ రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందన్నారు. మహిళా రిజర్వేషన్లను అన్ని పార్టీలు స్వాగతించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆయన పేర్కొన్నారు. మొదటి నుంచీ మహిళలకు టీడీపీ అండగా ఉందని సీఎం  చెప్పుకొచ్చారు. డీలిమిటేషన్ విషయంలో 2011 జనాభా లెక్కలైనా, తాజా లెక్కలైనా మనకు నష్టం కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

 అందుకే ఉన్న స్థానాలను 50 శాతం పెంచితే అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు. పెంచిన స్థానాలను మహిళలకు కేటాయించవచ్చని అభిప్రాయపడ్డారు. దీంతో గతంలో ఈ బిల్లును వ్యతిరేకించిన వారి ఆలోచన కూడా మారవచ్చని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లుల విషయంలో కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉందన్నారు. రెండు బిల్లులను తీసుకురావడానికి కేంద్రం సిద్ధమవుతోందని, ఆ రెండింటినీ విడదీసి చూడాల్సిన అవసరం ఏముందని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. రెండు బిల్లులు కలిపి వస్తేనే మహిళలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్, పునర్విభజన బిల్లులు తప్పనిసరిగా తీసుకురావాలని, ఇవి దేశ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొస్తాయని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

By
en-us Political News

  
ఏపీ రాజధాని ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం అత్యంత ఆధునిక నివాస సముదాయాల నిర్మాణానికి ఏకంగా 1,234.91 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌ను కేటాయిస్తూ కేంద్రం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, ఈ ప్రాజెక్టుకు అయ్యే మొత్తం వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించనుంది.
రాష్ట్రంలో మహిళల భద్రతను నిరంతరం పర్యవేక్షించేందుకు తమిళనాడు వ్యాప్తంగా హైటెక్ డ్రోన్ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు విజయ్ ప్రకటించారు. తమిళనాడు చరిత్రలోనే ఇటువంటి ఒక అధునాతన సాంకేతిక నిఘా వ్యవస్థను మహిళా రక్షణ కోసం ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి.
వర్షం పడే సమయంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇక ఏపీలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయనీ, పలు చోట్ల పాటు పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది.
మహిళల టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాతో మహా సమరానికి ముందు సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ తమ జట్టును హెచ్చరించింది. న్యూజిలాండ్ చేతిలో ఓటమి తర్వాత వ్యూహాలు మార్చాలని డిమాండ్ చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
అశేష జనానికి ఆపన్నహస్తం అందిస్తూ, హిందూపురం ప్రజలకు అండగా నిలుస్తూ మీరు సాగిస్తున్న జీవనయానం నిరంతరంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.
భారతీ రాజా మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం విజయ్.. తమిళ చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన అసమాన సేవలకు, ఆయన స్థాయికి గుర్తింపుగా ఆయన అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అంతకుముందు భారతీరాజా భౌతిక కాయానికి సీఎం విజయ్ ఘన నివాళులర్పించారు.
bengaluru new eleven km flyover plan,Bengaluru new flyover, Indiranagar traffic updates, Madiwala rotary flyover, Silk Board double decker flyover, Bengaluru elevated corridor, B SMILE project DPR,teluguone,teluguone news.
ఆసియా గేమ్స్ 2026 కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు 15 మందితో కూడిన యువ జట్టును ప్రకటించింది. బాబర్ అజామ్, షాహీన్ అఫ్రిదిలను పక్కన పెట్టి సాహిబ్జాదా ఫర్హాన్‌కు కెప్టెన్సీ అప్పగించింది. ఆ పూర్తి షెడ్యూల్, టీమ్ వివరాలు ఇక్కడ చూడండి.
చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్ ను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు మోహన్ నాయక్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు.
భారత యువ చెస్ గ్రాండ్‌మాస్టర్ ప్రణేష్ మునిరత్నం హాంకాంగ్ వీసా సమస్యల్లో చిక్కుకున్నారు. జూన్ 16 నుండి జరిగే వరల్డ్ టీమ్ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌కు ముందు కోచ్ ఆర్‌.బి. రమేష్ అధికారుల సహాయాన్ని కోరుతూ చేసిన విజ్ఞప్తి వివరాలు ఇక్కడ చదవండి.
LegalZoom ద్వారా సులభంగా మరియు తక్కువ ఖర్చుతో LLC, ఎస్టేట్ ప్లాన్, మరియు ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో తెలుసుకోండి. తాజా ప్రోమో కోడ్స్ మరియు సేవింగ్స్ టిప్స్‌తో మీ వ్యాపార ఖర్చులను తగ్గించుకోండి!
సైబర్ దాడులను తిప్పికొట్టడానికి ఆంత్రోపిక్ సంస్థ ప్రారంభించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గ్లాస్‌వింగ్ లో బ్రిటన్ టెలికాం దిగ్గజం బిటి చేరింది. రోజుకు 40 లక్షల దాడులను అడ్డుకునే బిటి, క్లాడ్ మైథోస్ ఏఐ మోడల్ ద్వారా భద్రతను మరింత పెంచుతోంది. భారత్ సహా 15 దేశాలకు విస్తరించిన ఈ ఏఐ సెక్యూరిటీ విశేషాలు ఇక్కడ తెలుసుకోండి.
దక్షిణ కొరియా మార్కెట్లో ఐదేళ్ల గరిష్టానికి చేరిన పుట్-కాల్ రేషియో గ్లోబల్ స్టాక్ మార్కెట్ల పతనానికి సంకేతంగా మారుతోంది. గతంలో 17 శాతం కుప్పకూలిన చరిత్ర మళ్లీ రిపీట్ కానుందా? పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.