Publish Date:Jan 11, 2025
భద్రపరచాలంటున్న శివనాగిరెడ్డి
హైదరాబాద్ శివారు శామీర్ పేట మండలం, మందాయిపల్లి శివాలయం దగ్గర రోడ్డు పక్కన నిర్లక్ష్యంగా పడి ఉన్న గణేష్ శిల్పం బాదామి చాళుక్యుల కాలం నాటిదని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సీఈవో, డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. వారసత్వ సంపదను గుర్తించి, కాపాడుకోవడం పట్ల గ్రామస్తులకు అవగాహన కల్పించే 'ప్రిజర్వ్ హెరిటేజ్ ఫర్ పోస్టేరిటీ' కార్యక్రమంలో భాగంగా ఆయన మందాయిపల్లి గ్రామ పరిసరాల్లో ఉన్న పాత శివాలయం వద్ద ఈ విగ్రహాన్ని గుర్తించారు.
ఒక అడుగు మూడు అంగుళాల ఎత్తు, పది అంగుళాల వెడల్పు, అంతే మందం గల గ్రానైట్ రాతిలో మలచిన గణేష ప్రతిమ, నాలుగు చేతులు, తొండం కలిగి, తలపై చిన్న కిరీటంతో, లలితాసనంలో కూర్చొని, నాగ యజ్ఞోపవీతాన్ని ధరించి ఉన్నాడన్నారు. ప్రతిమా లక్షణం, శిల్ప శైలిని అనుసరించి ఈ గణేశ శిల్పం క్రీ.శ. 8వ శతాబ్దికి చెందినదన్నారు. చారిత్రక ప్రాధాన్యత గల ఈ శిల్పాన్ని భద్రపరచాలని మందాయపల్లి గ్రామస్తులకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chalukya-ganesh-scupture-in-mandayipalli-25-191220.html
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.