సెంట్రల్ విస్తా.. ఒక వాస్తు తంత్రం

Publish Date:May 24, 2023

Advertisement

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అట్టహాసంగా ప్రారంభించిన సరికొత్త పార్లమెంట్ భవనం సెంట్రల్ విస్తా చుట్టూ వివాదాలు ముసురుతున్నాయి.  పాత పార్లమెంటు భవనం 1927లో ప్రారంభం కాగా, మరో వందేళ్లకు భారత పార్లమెంట్ తన అడ్రస్ మార్చుకోనుంది. సెంట్రల్ విస్తా విషయంలో దాదాపు ప్రతి అంశం వివాదాలకు కారణం అవుతోంది. సెంట్రల్ విస్తా మొత్తం ప్రాజెక్ట్ 2026 నాటికి పూర్తి కానుంది. ప్రస్తుతానికి పార్లమెంట్ సభ్యుల సమావేశాలు జరిగే లోక్ సభ, రాజ్య సభ సముదాయాలను పూర్తి చేశారు. ఈ భవనాలను ఈ నెల 28వ తేదీన ప్రారంభించాలని మోడీ భావిస్తున్నారు.

మే 28 సావర్కార్ జయంతి అయినందున ఆ రోజు  ప్రారంభోత్సవం జరపరాదన్న వాదన బలంగా వినబడుతోంది. బ్రిటిషర్ల కాలు మొక్కి శిక్ష నుంచి తప్పించుకున్న సావర్కార్ అసలు దేశ భక్తుడే కాదని వీరి వాదన. కానీ బీజేపీ మాత్రం సావర్కార్ ను మచ్చ లేని దేశ భక్తుడిగా గుర్తిస్తోంది.  ఇది ఒక అంశం అయితే, సెంట్రల్ విస్తాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత  ప్రారంభోత్సవం జరిపించాలంటూ 19 ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చాయి. ఇంకా కొన్ని రాజకీయ పక్షాలు స్పందించాల్సి ఉంది.  అయితే సెంట్రల్ విస్తాను ప్రధాని మోడీ మాత్రమే ప్రారంభిస్తారనని అది కూడా సావర్కార్ జన్మదినం రోజైన మే 28వ తేదీనే జరుగుతుందని బీజేపీ చెబుతోంది.  ఇదిలా ఉంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఇంత వరకూ ఆహ్వానం కూడా పంపించలేదని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి.

ప్రస్తుత పార్లమెంటు భవనం 1911 నుంచి 1932 వరకూ నిర్మాణం జరుపుకుంది.  కాగా 1927లో  నిర్మాణం కాకముందే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం హౌస్ ఆఫ్ పార్లమెంట్ ను ప్రారంభించింది. బ్రిటిష్ ఇంజనీర్లు ఎడ్వర్డ్  లూత్సాన్, హెర్బెర్ట్ బెకర్ లు భారత పార్లమెంట్ భవనాన్ని డిజైన్ చేసి నిర్మించారు. భారతదేశ ఆధినిక చరిత్ర ఈ పార్లమెంట్ భవనంతో ముడివేసుకుంది. అంబేడ్కర్, నెహ్రూ, ఇందిరాగాంధీ, పటేల్, వాజ్ పేయి, జగ్జీవన్ రామ్, పీవీ నరసింహారావు, నీలం సంజీవరెడ్డి, వీవీగిరి, అబ్దుల్ కలాం, సర్వేపల్లి , జాకీర్ హుస్సేన్, రాజీవ్ గాంధీ వంటి దిగ్గజాలు ఆధునిక భారతదేశానికి దిశానిర్దేశం చేశారు. అలాంటి ప్రపంచంలోనే అత్యద్బుతమైన పార్లమెంట్ భవనాలలో ఒకటిగా చెప్పుకునే భారత పార్లమెంట్ భవనం ఇక ముందు ఆ ఖ్యాతిని కోల్పోనుంది. ప్రస్తుత భవనం నిర్మించి శతాబ్దం కావస్తున్న నేపథ్యంలో మరో భవనాన్ని మోడీ సర్కార్ నిర్మిస్తోంది.  

ఖర్చు విషయం పక్కన పెడితే చారిత్రక ప్రాధాన్యతను మనం కోల్పోతున్నమన్నది వాస్తవం. ప్రపంచంలో  అతి పురాతన ప్రజాస్వామ్య దేశం అమెరికాలోని పార్లమెంట్ భవనానికి 230 సంవత్సరాలు పూర్తయ్యాయి. అంతటి అమెరికా కూడా చారిత్రక మూలాలను వదల కుండా ఇప్పటికీ  కేపిటల్ హిల్ ను తమ పార్లమెంట్ భవనంగా గౌరవిస్తోంది. 

ఇంకా సెంట్రల్ విస్తా గురించి చూస్తూ గుజరాత్ కు చెందిన విమల్ పటేల్ అనే వాస్తు శిల్పి అధీనంలో సెంట్రల్ విస్తా రూపొందుతోంది. ఈ భవన సముదాయం వాస్తుతంత్ర విధానంలో నిర్మితం అవుతోందని విమల్ పటేల్ బృందం చెబుతోంది.

ఇదిలా ఉండగా,  సెంట్రల్ విస్తా వాస్తుపై పండితులు పెదవి విరుస్తున్నారు.  86 ఎకరాల్లో నిర్మితం అవుతున్న ఈ ప్రాజెక్ట్ వాస్తుకు పూర్తి విరుద్ధమని వారి వాదన. త్రికోణ ఆకారంలో నిర్మితం అవుతున్న సెంట్రల్ విస్తా చివరికి నష్టాలను కలిగిస్తుందని  లెక్కలు వేస్తున్నారు. ఒరిస్సా  భువనేశ్వర్ లోని బ్రహ్మేశ్వర దేవాలయం వాస్తు సెంట్రల్ విస్తాలో కనిపిస్తుందని  దేవాలయాల వాస్తు మరో నిర్మాణానికి పెట్టడం అరిష్టమని పండితులు వాదిస్తున్నారు. ఏది ఏమైనా సెంట్రల్ విస్తా బీజేపీ నాయకత్వానికి మరో తలనొప్పిగా మారిందని చెప్పక తప్పదు.

By
en-us Political News

  
భారతీయ రాజకీయాల్లో సాధారణంగా కనిపించే శత్రుత్వాలు,
ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంతంలో సుమారు 15 వేల‌ నుంచి 20 వేల‌ మంది వ‌ర‌కూ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఒక‌ అంచనా. అయితే ఈ ప‌రిశ్ర‌మ ఇక్క‌డ స్థాపించ‌డంపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన కామెంట్లు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
కాంగ్రెస్ హైకమాండ్ కు, మరీ ముఖ్యంగా గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన వీహెచ్ రాజ్యసభకు మూడు పర్యాయాలు ఎంపికయ్యారు. అయితే 2016 తర్వాత ఇంత వరకూ ఆయనకు పార్టీ పరంగా ఎటువంటి పదవీ దక్కలేదు.
కేరళం ప్ర‌జ‌ల‌కు దశాబ్దాలుగా సేవ చేస్తూ, విలువలతో కూడిన‌ రాజకీయాలు చేసే సతీశన్‌కు ఈ పదవి రావడం సముచిత గుర్తింపని రేవంత్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధికి మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు అధికార బాధ్యతలు అప్పగించారని అన్నారు.
ఎల్‌డీఎఫ్ హయాంలో వి.డి.సతీశన్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. క్లిష్ట సమయలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఆయన తీవ్రంగా శ్రమించారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి తీసుకు రావడంలో సతీశన్ కీలక పాత్ర పోషించారు. కేరళం కాంగ్రెస్ కేడర్‌లో కూడా ఇదే అభిప్రాయం బలంగా ఉంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న అధిష్ఠానం సీఎంగా సతీశన్ ను ఎంపిక చేసింది.
సాధారణంగా ముఖ్యమంత్రులు, మంత్రుల పర్యటనల సమయంలో భద్రతా కారణాల రీత్యా పెద్ద సంఖ్యలో వాహనాలు కాన్వాయ్‌లో ఉంటాయి. అయితే.. దీనివల్ల భారీగా ఇంధన వ్యయం అవ్వడమే కాకుండా.. ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయని భావించిన సీఎం, డిప్యూటీ సీఎం.. ఖజానాపై అనవసర భారం పడకూడదనే ఉద్దేశంతో, భద్రతకు విఘాతం కలగకుండానే వాహనాల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించారు.
తీవ్రమైన పోక్సో కేసు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆ కారణంగానే బండి కుమారుడిపై పోక్సో కేసు నీరుగారిపోయిందని ధ్వజమెత్తారు.
హైదరాబాద్‌ను ఏ విధంగా ఐటీ, హెల్త్ హబ్‌గా మార్చానో గుర్తు చేస్తూ.. అమరావతిని అంతకంటే అద్భుతమైన నగరంగా నిర్మిస్తానని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్ గతమైతే, అమరావతి భవిష్యత్తు అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకుని దాదాపు మూడు వారాల పాటు విధులకు దూరంగా హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకున్న ఆయన బుధవారం ఉదయం అమరావతిలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకుని విధుల్లో నిమగ్నమయ్యారు.
ఈ బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 144 మంది శాసనసభ్యులు మద్దతు పలకగా.. 22 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. మరో ఐదుగురు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
అయితే 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అమరావతి నిర్మాణ వేగం పెరిగింది. అయినా వైసీపీ అధినేత మావిగన్ ప్రతిపాదన, అమరావతి పురోగతిని అడుగడుగునా అడ్డుకోవడమే లక్ష్యంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, వ్యవహరిస్తున్న తీరు మాత్రం అమరావతి అనిశ్చితి మేఘాలు పూర్తిగా తొలగిపోకుండా ఉండేందుకు కారణమయ్యాయి.
బండి బగీరథ ఈ కేసు నుంచి పులుకడిగిన ముత్యంలా బయటపడితేనే.. తిరిగి బండి సంజయ్ కు పార్టీలో ప్రాధాన్యత, గుర్తింపు ఉంటాయని అన్యాపదేశంగానే అయినా విస్పష్ట సందేశం ఇచ్చింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వమైతే.. చట్టం ముందు అంతా సమానమేనని స్పష్టం చేసింది.
ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో విజయ్ తన కారు డ్రైవర్‌ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్‌కు విజయ్ టీవీకే తరఫున టికెట్ ఇచ్చారు. చెన్నైలోని విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శబరినాథన్ విజయం సాధించారు. తాజాగా ఆయన్ను ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.