సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్‌పై కేంద్రం యాక్షన్.. రఘురామ ఎఫెక్ట్..
Publish Date:Jul 3, 2021
Advertisement
రఘురామ దెబ్బకు జగన్ సర్కార్ అబ్బా అంటోంది. ఢిల్లీలో ఉండి కొడితే.. ఏపీ ప్రభుత్వానికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతోంది. వదల బొమ్మాళీ అంటూ ఎంపీ రఘురామ తన జోలికి వచ్చిన ఏ ఒక్కరినీ అంత ఈజీగా వదిలిపెట్టడం లేదు. సీఎం జగన్‌కే చుక్కలు చూపిస్తున్నారు. ఇక తనపై కుట్ర చేసి.. కేసులు కట్టి.. కస్టడీలో టార్చర్ చేసిన.. సీఐడీ అదనపు డీజీ సునీల్‌కుమార్‌పై ఓ రేంజ్లో రివేంజ్ తీసుకుంటున్నారు. ఐపీఎస్ సునీల్‌కుమార్‌పై వచ్చిన మూడు ఫిర్యాదులపై నివేదిక ఇవ్వాలంటూ కేంద్ర హోంశాఖ ఏపీ సర్కారును ఆదేశాలివ్వడం సంచలనంగా మారింది. రఘురామతో పెట్టుకున్నందుకు జగన్ ప్రభుత్వం షేక్ అవుతోందని అంటున్నారు. ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్‌పై వచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని ఏపీ సీఎస్‌ను కేంద్ర హోంశాఖ ఆదేశించడంతో ఏపీ సర్కారు చిక్కుల్లో పడింది. ఇన్నాళ్లూ సునీల్ కుమార్‌ను ప్రమోట్ చేస్తూ.. రఘురామకు వ్యతిరేకంగా ప్రోత్సహిస్తున్న జగన్ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ ఆదేశాలు మింగుడుపడని విషయమే. ఐపీఎస్ సునీల్‌కుమార్ సివిల్ సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించారంటూ గతంలో కేంద్ర హోంశాఖకు ఎంపీ రఘురామ ఫిర్యాదు చేశారు. ఐపీఎస్ హోదాలో ఉంటూ సమాజంలో అలజడి సృష్టించేలా మాట్లాడారనేది కంప్లైంట్ సారాంశం. ఓ మతానికి అనుకూలంగా ప్రసంగాలు చేయడం.. మరో మతాన్ని తక్కువ చేసేలా మాట్లాడటం సివిల్ సర్వీస్ రూల్స్‌కు వ్యతిరేకమంటూ సునీల్‌కుమార్ ప్రసంగాల వీడియోలను సాక్షాలుగా చూపుతూ కేంద్రహోంశాఖకు ఫిర్యాదు చేశారు ఎంపీ రఘురామ. అయితే, ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. రఘురామ తనపై ఫిర్యాదు చేయగానే.. సోషల్ మీడియాలో తాను పోస్ట్ చేసిన ఆ వీడియో కంటెంట్‌ను వెంటనే డిలీట్ చేసేశారు ఐపీఎస్ సునీల్‌కుమార్. ఐపీఎస్ సునీల్‌కుమార్ మాట్లాడిన మాటల వీడియో సాక్షాలను పరిశీలించిన హోంశాఖ.. సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ ఏపీ సర్కారును ఆదేశించింది. రఘురామ చేసిన ఫిర్యాదుతో పాటు ఆయన సమర్పించిన వీడియో ఆధారాలను ఏపీ ప్రభుత్వ పరిశీలన కోసం పంపించింది. సునీల్‌కుమార్ వ్యవహారంపై వచ్చిన మూడు ఫిర్యాదులపై నివేదిక ఇవ్వాలని ఏపీ సీఎస్‌కు కేంద్రహోంశాఖ లేఖ రాయడం కీలక పరిణామం. సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్‌పై వేటు పడితే.. ఎంపీ రఘురామ కాలర్ ఎగరేయడం ఖాయం.
http://www.teluguone.com/news/content/central-home-ministry-orders-ap-govt-to-take-action-against-ips-sunil-kumar-39-118833.html





