అమరావతికి కేంద్ర ప్రభుత్వ సంస్థల క్యూ!
Publish Date:Jun 24, 2024
Advertisement
గత ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ పేరు చెబితేనే పెట్టబడిదారులు వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయేవారు. కొత్త పరిశ్రమల సంగతి దేవుడెరుగు.. ఉన్న పరిశ్రమలే తట్టాబుట్టా సద్దుకుని ఇతర రాష్ట్రాలకు తరలిపోయిన పరిస్ధితి. ఆంధ్రప్రదేశ్ అంటే పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలకు ఒక పీడకలలా కనిపించేది. ఇదంతా గతం. గత ఐదేళ్లుగా జగన్ రాక్షస పాలనలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అలా ఉంటే.. రాష్ట్రంలో ప్రభుత్వం మారి తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టగానే.. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా తరలివచ్చే పరిస్థితి నెలకొంది. అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ, విభజిత ఏపీలో కానీ చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనై ప్రొగ్రెస్ అనేది కనిపించింది అనడంలో అతిశయోక్తి ఇసుమంతైనా లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ ఐటీ హబ్ గా రూపుదాల్చిందంటే అందుకు కారణం నారా చంద్రబాబునాయుడు. విభజిత ఆంధ్రప్రదేశ్ 2014 నుంచి 2019 వరకూ అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా ప్రపంచం దృష్టిని ఆకర్షించిందంటే అందుకూ చంద్రబాబే కారణం. చంద్రబాబు తరువాత 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ చంద్రబాబు వేసిన అభివృద్ధి పునాదులపై రాష్ట్ర ప్రగతిని పరుగెలెత్తించాల్సింది పోయి, అహంభావంతో, చంద్రబాబుకు పేరొస్తుందన్న దుగ్ధతో ఆ పునాదులను కూల్చివేయడానికి ప్రయత్నించారు. దీంతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి అడుగంటిపోయింది. పెట్టుబడులు పెట్టాలంటేనే పారిశ్రామిక వేత్తలు భయపడే పరిస్థితి నెలకొంది. ఉన్న పరిశ్రమలు కూడా రాష్ట్రం నుంచి తరలిపోయాయి. దీంతో రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి కల్పనలకు అవకాశమే లేని పరిస్థితి నెలకొంది. గత ఐదేళ్ల చీకటి రాజ్యానికి తెరపడగానే తూర్పున సూర్యుడు ఉదయించినంత సహజంగా సన్ రైజ్ స్టేట్ అయిన ఏపీకి పెట్టుబడులు తరలి వచ్చే సరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరి రెండు వారాలయ్యిందో లేదో రాష్ట్రంలో ప్రొగ్రస్ పరుగులెత్తుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ చీకటిలో మగ్గిపోయిన అమరావతి వెలుగులీనుతోంది. పోలవరం పనులు గాడిలో పెట్టేందుకు చంద్రబాబు చర్యలు ప్రారంభించారు. ఇక ఐదేళ్ల కిందట అంటే జగన్ సర్కార్ కొలువుదీరడానికి ముందు రాష్ట్రంలో ఏర్పాటుకు ముందుకు వచ్చిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆ తరువాత జగన్ నిర్వాకంతో ఏపీ వైపు చూడడమే మానేశాయి. ఆ సంస్థలన్నీ ఇప్పుడు ఏపీకి క్యూ కడుతున్నాయి. అలా క్యూకడుతున్న వాటిలో కాగ్, ఆర్బీఐ, ఎస్ బీఐ, ఎఫ్ సీఐ, సీపీడబ్ల్యుడి, ఇండియన్ డిపార్ట్ మెంట్ ఆఫ్ పోస్ట్, నిఫ్ట్, నిడ్ వంటివి ఉన్నాయి. ఈ సంస్థలన్నిటికీ గతంలో చంద్రబాబు ప్రభుత్వం భూములు కేటాయించింది. అయితే జగన్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత ఆ కేటాయింపుల ఊసెత్తలేదు. రాష్ట్రంలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు కార్యాలయాలు ఏర్పాటు చేస్తామంటూ ముందుకు వచ్చిన కేంద్ర ప్రభుత్వ సంస్థలతో కనీసం సంప్రదింపులు కూడా చేయలేదు. మళ్లీ ఇప్పుడు చంద్రబాబు సర్కార్ కొలువుదీరగానే వాటితో సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే సీఆర్డీయే అధికారులు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో చర్చలు జరుపుతున్నారు. దీంతో పెద్ద సంఖ్యలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు అమరావతికి తరలిరావడానికి ఉత్సాహం చూపుతున్నాయి. నాబార్డ్, యూనియన్ బ్యాంక్, కెనరాబ్యాండ్, ఎల్ఐసీ, ఇండియన్ ఆయిల్, ఎస్ బీఐ, హెచ్ పీసీఎల్ వంటి సంస్థలు అమరావతిలో కార్యాలయాల ఏర్పాటుకు ఆసక్తి కనబరుస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/central-government-inistitution-queue-to-amarawati-25-179318.html





