చంద్రబాబు రంపచోడవరం పర్యటనకు సెంట్రల్ కమాండర్ సెక్యూరిటీ.!

Publish Date:Jul 23, 2026

Advertisement

రంపచోడవరంలో సీఎం చంద్రబాబు నాయుడు,  నారా లోకేష్ శుక్రవారం (జులై 24) పర్యటించనున్నారు ఈ పర్యటనలో హై వోల్టేజ్  సెక్యూరిటీ ఉండనుంది.  రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతం కావడంతో.. ఇక్కడ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఏపీ ఇంటెలిజెన్స్   సీఎం ప్రోగ్రాం కి కేంద్ర హోంశాఖ ను 100 మంది హై హెవీ కమాండర్  సెక్యూరిటీ కావాలని కోరింది. దీనిపై స్పందించిన కేందర  హోంశాఖ   90 మందిని పంపింది. 

మన్యం ప్రాంతంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు కలిసి పర్యటిస్తుండటంతో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. వీరు పర్యటించే రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతం అలాగే,  మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఈ హైసెక్యూరిటీ ఏర్పాటు చేశారు. బాబు పర్యటించే  ప్రాంతంతో పాటు పరిసర అటవీ ప్రాంతాల్లో ప్రత్యేక గ్రేహౌండ్స్,  పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. డ్రోన్  సహాయంతో ఆకాశమార్గాన నిఘా ఏర్పాటు చేశారు.  హెలిప్యాడ్ నుంచి సీఎం చంద్రబబు పాల్గొనే  సభా ప్రాంగణం వరకు మూడు అంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు.

ఈ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు,  మంత్రి లోకేష్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.  ముఖ్యంగా పోలవరం నిర్వాసితుల సమస్యలు, అటవీ హక్కుల పట్టాలు, తాగునీరు,  రహదారుల  పనులపై సమీక్ష నిర్వహిస్తారు. అలాగే..గిరిజన ప్రాంతాలలో డిజిటల్ విద్యకు సంబంధించి కీలక ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు. 

Central Command security, Chandrababu, Rampachodavaram tour 

By
en-us Political News

  
ఢిల్లీలో ముగిసిన సీజేపీ రెండో విడత చర్చలు..!
ఈ సందర్భంగా ఆలయ ప్రదక్షిణ మార్గంలో పొర్లు దండాలు పెట్టి మొక్కు తీర్చుకున్నారు.ఈ కార్యక్రమంలో బాలకృష్ణ అభిమానులు, తెలుగుదేశం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో సరికొత్త విప్లవం దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి.
అసలు ఈ అంశంపై సుప్రీం కోర్టులో రిట్ పిటీషనే దాఖలు కాలేదని పేర్కొన్న ఆయన దాఖలు కాని పిటిషన్ ను విచారణకు స్వీకరించకుండా నిరాకరించడమేంటని నిలదీశారు. మీడియా అత్యంత బాధ్యతా రహితంగా వ్యవహరించిందంటూ ఫైర్ అయ్యారు.
కొత్త చట్టం తెస్తున్న కేంద్ర ప్రభుత్వం..వచ్చే వారమే పార్లమెంట్‌లో బిల్లు..!
దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్న నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ ఉదంతంపై బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది.
కేటీఆర్ జన్మదిన వేడుకలలో శుక్రవారం (జులై 24నపాల్గొన్న ఆయన తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలన్నీ కేవలం నిరాధారమైన ప్రచారం, వదంతులు మాత్రమేనని స్పష్టత ఇచ్చారు.
తిరుమల తిరుపతి దేవస్ధానం ప్రతిష్ఠకు భంగం కలిగేలా పింక్ డైమండ్ విషయంలో అవాస్తవాలను ప్రచారం చేశారంటూ గతంలో దాఖలైన పరువు నష్టం కేసు విచారణ ఇప్పుడు తుది దశకు వచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా టీటీడీ జేఈవో వెంకయ్య చౌదరి క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయ్యింది.
ద్యార్థుల హక్కుల కోసం ఒక పోరాట యోధుడిలా నిలబడిన వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కోర్టు ఆదేశాల మేరకు ఆయనను గురుగ్రామ్‌లోని మేదాంతా ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా ఆయన వైద్య చికిత్సను నిరాకరించి నిరశన కొనసాగించడంతో కేంద్రం దిగివచ్చింది.
దీంతో ఆయనను స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఏఐజీ ఆస్పత్రిలో ఆయన మోకాలి గాయానికి గురువారం విజయవంతంగా సర్జరీ జరిగింది.
కాక్రోచ్ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీని ఖండించడమే కాకుండా.. దేశ విద్యావ్యవస్థలో ఇంతటి భారీ అక్రమాలు జరిగినా బాధ్యత వహించకపోవడం సరికాదనీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలన్న తమ డిమాండ్ లో ఇసుమంతైనా మార్పు లేదనీ విస్పష్టంగా ప్రకటించింది.
హెర్మూజ్ జలసంధిలో రావాణ స్తంభన, ఎర్రసముద్రంలో ప్రయాణిస్తున్న రెండు సౌదీ ఆయిల్ ట్యాంకర్లపై దాడుల నేపథ్యంలో ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒకే సారి 6 శాతం పైగా పెరిగింది. దీంతో ముడి చమురు బారెల్ ధర వంద డాలర్లకు చేరువైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.