జగన్ సర్కార్ అరాచక పాలనకు అండా దండా కేంద్రామే!

Publish Date:Oct 10, 2023

Advertisement

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం రాష్ట్ర ఆర్థిక  అరాచకత్వం, అరాచక పాలన కొనసాగుతోందనడంలో ఎవరిలోనూ ఎలాంటి సందేహం లేదు. ఈ విషయంలో బీజేపీకి కూడా స్పష్టత ఉంది.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సహా కేంద్ర, రాష్ట్ర బీజేపీ నాయకులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఆద్వాన్నంగా ఉందో, రాష్ట్రంలో పాలన ఎంత అరాచకంగా సాగుతోందో చాలా కాలంగా చెబుతూనే ఉన్నారు. విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. మోడీ విశాఖ పర్యటన సందర్భంగా వాడవాడలా వైసీపీ పాలనా వైఫల్యాలపై చార్జిషీట్లు ధాఖలు చేయాలని రాష్ట్ర బీజేపీ నాయకులకు పిలుపు కూడా ఇచ్చారు. పిలుపు ఇవ్వడం కాదు.. ఆదేశించారు. ఇందులో రహస్యమేమీ లేదు.

అయినా అప్పట్లో బీజేపీ రాష్ట్ర నాయకత్వం, ముఖ్యంగా అప్పటికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు.. మోడీ ఆదేశాలను పట్టించుకోలేదు. దీంతో రాష్ట్ర బీజేపీలోని ఒక వర్గం నాయకులు సోము వీర్రాజుపై పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. బీజేపీ అధిష్ఠానం కూడా రాష్ట్రంలో పార్టీ తీరుపై కన్నెర్ర చేసింది. సోము వీర్రాజును పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి  తప్పించింది. ఆయనను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తున్నట్లుగా ఆయనకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చింది. ఆయన స్థానంలో దగ్గుబాటి పురంధేశ్వరిని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించింది.  పురంధేశ్వరి రాష్ట్ర బీజేపీ పగ్గాలు చేపట్టిన  క్షణం నుంచి జగన్ సర్కార్ చేస్తున్నఅడ్డగోలు అప్పులపై పూర్తి  వివరాలతో  మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరి చెప్పారు. అక్కడితో ఆగకుండా  ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కు రాష్ట్ర   అప్పుల చిట్టా  సమర్పించారు.   ఇదంతా చూసి ఇక జగన్ సర్కార్ కు అప్పులు పుట్టవు, కేంద్రం ఏపీ పరిస్థితులపై దృష్టి సారించిందని అంతా భావించారు. కానీ వాస్తవంగా అందుకు భిన్నంగా జరిగింది.  పురంధేశ్వరి భేటీ తరువాత   రాష్ట్ర అప్పుల పరిధి (ఎఫ్ఆర్బీఎం) విషయంలో కేంద్ర ప్రభుత్వం  పార్లమెంట్ ఉభయ సభల్లో రెండు విభిన్నప్రకటనలు చేసి,వాస్తవ పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానం లేకుండా చేశారు. 

నిజానికి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అడుగుపెట్టినప్పటి నుంచి, ఆర్ధిక  క్రమశిక్షణ గాడి  తప్పింది. జగన్మిహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తోలి క్షణం నుంచే, సంక్షేమాన్ని గీత దాటించేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు సంక్షేమం ముసుగు కప్పి, బటన్ నొక్కుడు మాత్రమే పాలన చేసేశారు.  ఆర్థిక క్రమశిక్షణ అన్న మాటకు అర్ధమే లేకుండా చేసేశారు. అప్పులు చేసి మరీ ఓటు బ్యాంకు పథకాలతో ప్రజలను ఆకర్షించడమే లక్ష్యం అన్నట్లుగా పాలనకు గాడి తప్పించేశారు. ఈ విషయాలన్నిటిపై తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతూనే ఉంది. అయితే  అడ్డగోలు అప్పులను నిరోధించాల్సిన కేంద్రం మాత్రం ఏపీ విషయంలో ఔను ఒక్క ఏపీ విషయంలో మాత్రమే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది.

జగన్ సర్కార్ ఎంత అడ్డగోలుగా అప్పులకు ఎగబడుతోందో.. అంతే అడ్డగోలుగా అందుకు మోడీ సర్కార్ అనుమతులు ఇచ్చేస్తోంది.   రాష్ట్రంలో సొంత బలం లేని బీజేపీ.. తమ చెప్పుచేతల్లో ఉండే జగన్ సర్కార్ ఆర్థిక అరాచకత్వానికి అన్ని విధాలుగా అండా, దండా అందిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  రాష్ట్ర ప్రభుత్వం తప్పిదాలను, ఓ వంక విమర్శిస్తూనే, మరో వంక   జగన్ రెడ్డి ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తోంది. అంటే కొట్టినట్లు బీజేపీ చేస్తుంటే.. ఏడ్చినట్లు వైసీపీ చేస్తున్నదన్నదన్న మాట. ఈ విధంగా ఇరు  పార్టీల  మధ్యా రహస్య మైత్రి బహిరంగంగా కొనసాగుతోందని, పిల్లి కళ్లు మూసుకు పాలు  తాగుతూ ఎవరూ గమనించడం లేదనుకున్నచందంగా వైసీపీ, బీజేపీలు వ్యవహరిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.