మా నిధులు మీరెలా వాడేశారు.. జగన్‌పై కేంద్రం సీరియస్

Publish Date:Jul 9, 2023

Advertisement

ఏపీలో అభివృద్ధి, సంక్షేమం సంగతి ఎలా ఉన్నా ఆర్ధిక పరిస్థితి మాత్రం దారుణంగా ఉందన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఎడా పెడా తెచ్చిన అప్పులు పెరిగి ఇప్పుడు పెద్ద అనకొండలా మారిపోయాయి. రాష్ట్రంలో దెబ్బతిన్న అభివృద్ధి, ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ పెట్టకపోవడం, వైసీపీ నేతల తీరు కారణంగా పెట్టుబడులు పెట్టేవారు రాష్ట్రం వైపు చూడడమే మానేశారు. ఉన్న వాళ్ళలో కొందరు రాష్ట్రాన్ని వదిలి పారిపోయారు. దీంతో రాష్ట్రానికి వచ్చే ఆదాయం లేక పప్పు బెల్లం మాదిరి తలకి ఇంత చొప్పున చేసే పంపకాలు పెరిగి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశాయి. మరో వైపు కరోనాతో దెబ్బతిన్న సామాన్య ప్రజల ఆర్ధిక స్థితిపై భారీగా ధరల పెంపు పిడుగు పడడంతో కొనుగోలు శక్తి తగ్గిపోయి ఉన్న ఆదాయం కూడా దిగజారిపోయింది. దీంతో ఏపీ పరిస్థితి ఆర్ధికంగా అగమ్యగోచరంగా మారిపోయింది.

 ఏపీలో గత ఏడాది కాలం నుండి నెలా నెలా జీతాలకు, పెన్షన్లకు కూడా జేబులు తడుముకోవాల్సిన పరిస్థితి. అప్పులు చేయాల్సిన దుస్థితి. గత రెండేళ్లుగా ఏ ప్రభుత్వ ఉద్యోగికీ ఒకటో తేదీన జీతం అందలేదు. కొందరైతే ఏ నెలకి ఆ నెల జీతం చూడడంపై ఆశలు వదులుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వ భూములు, బాండ్లు, మద్యంపై వచ్చే ఆదాయాన్ని, పలు దేవాలయాల ఆదాయాన్ని కూడా తనఖా పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ వద్ద కూడా పరిమితికి మించి అప్పులు చేసింది. ఇవి చాలవని వివిధ కార్పొరేషన్ల నిధులు, కేంద్ర పథకాలకు వచ్చే నిధులను కూడా తన ప్రభుత్వాన్ని నడిపేందుకు వాడుకున్నారు. అలాగా ఇప్పుడు కేంద్రం ఒక పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఇవ్వగా.. జగన్ ప్రభుత్వం దాన్ని సొంత అవసరాలకు వాడుకుంది. దీంతో ఆగ్రహించిన కేంద్ర ప్రభుత్వం ఆ నిధుల‌ను తక్షణమే సంబంధిత ఖాతాలో జ‌మ చేసి ర‌సీదుల‌ను పంపించాల‌ని ఆదేశించింది. ఈ విష‌యం ప్ర‌భుత్వంలో తీవ్ర క‌ల‌క‌లం రేపింది.

 కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలలో ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న ప‌థ‌కం కూడా ఒకటి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని పేద‌ల‌కు ఇళ్లు నిర్మించాల‌నే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టగా ఈ మధ్యనే అందుకోసం కేంద్రం నిధులకు కేటాయిస్తుంది. ఈ క్ర‌మంలో భాగంగా 90 శాతం నిధుల‌ను కేంద్రం ఇవ్వనుండగా 10 శాతం నిధుల‌ను రాష్ట్రాలు భ‌రించాలి. ఆ నిధులతో రాష్ట్ర ప్రభుత్వమే ల‌బ్ధి దారుల‌ను ఎంపిక చేసి, ఇళ్ల‌ను నిర్మించి ఇవ్వాలి. ప్రతి ఏడాది ఈ కార్యక్రమానికి కేంద్రం నిధులు ఇస్తుండగా.. ఈ మధ్యనే పలు రాష్ట్రాలకు నిధులను జమ చేసింది. ఏపీకి సంబంధించి కూడా ఏటా నిధులు ఇస్తోంది. అయితే.. ఈ నిధుల్లో తాజాగా రూ.639 కోట్ల‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం రాష్ట్ర ప్రభుత్వ ప‌థ‌కాల‌కు మళ్లించింది. దీంతో కేంద్రం ఆగ్రహించింది.

 కేంద్ర పథకానికి, పేదల గృహ నిర్మాణానికి ఇచ్చిన‌ నిధులపై సమాచారం లేకుండా మల్లింపుపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది.  కనీసం జీవో కూడా లేకుండా రూ.639 కోట్ల‌ను దారిమళ్లించడంపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. అంతేకాదు, తక్షణమే ఆ నిధులను సింగిల్‌ నోడల్‌ ఖాతాకు జ‌మ చేయాలని జగన్మోహన్ రెడ్డి సర్కారును ఆదేశించింది. ఈ పథకంలో భాగంగా కేంద్రం ఈ ఏడాది రూ.3,084 కోట్లు మంజూరు చేసింది. అందులో ఒకసారి విడుదల చేసిన రూ.1879 కోట్లలో నుంచి రూ.639 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది. నిజానికి ఈ పథకంలో భాగంగా రాష్ట్రం ఇవ్వాల్సిన వాటా జమ చేయకపోవడం వలనే ఈ నిధులు అలా పెండింగ్ ఉన్నాయి. రాష్ట్ర వాటా రూ.221 కోట్లు ఇవ్వకపోవడంతో కేంద్రం రూ.1,174 కోట్ల నిధుల్ని నిలిపివేసింది. ఇవ్వాల్సినని ఇవ్వకపోగా.. సమాచారం కూడా లేకుండా ఇష్టారాజ్యంగా నిధులను మళ్లించడం కేంద్రానికి కోపం తెప్పించింది.

By
en-us Political News

  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.