దోషులపై జీవితకాల నిషేధం కుదరదన్న కేంద్రం
Publish Date:Feb 26, 2025
Advertisement
వివిధ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నేతలపై జీవిత కాల నిషేధాన్ని విధించాలన్న అభ్యర్థను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. దోషిగా తేలిన వ్యక్తిపై ఆరేళ్ల పాటు నిషేధం విధిస్తే సరిపోతుందని తెలిపింది. ఓ వ్యక్తిపై జీవిత కాల నిషేధం అనేది కఠినతరమని పేర్కొంది. అయితే రాజకీయ నేతలపై జీవిత కాల నిషేధం ఎన్నేళ్లు అనే దానిపై నిర్ణయాధికారం పార్లమెంట్దేనని ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం ఖరాకండిగా తేల్చి చెప్పింది. దోషులుగా రుజువు అయితే జీవితకాల నిషేధాన్ని విధించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కేంద్రం తన అభిప్రాయాన్ని వివరిస్తూ.. సుప్రీం కోర్టులో తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది. దోషులుగా తేలిన నేతలపై జీవిత కాలం నిషేధం విధించాలంటూ న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ సుప్రీం కోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ నేపథ్యంలో దీనిపై స్పందన తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు కోరింది. ఆ క్రమంలో సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం తాజాగా తన అభిప్రాయాన్ని వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేసింది.
http://www.teluguone.com/news/content/center-oppose-life-time-ban-on-politicians-proved-convicted-39-193480.html





