తెలుగుదేశం కు ఓ గవర్నర్ పదవి.. కేంద్రం ఆఫర్ నిజమేనా?

Publish Date:Nov 29, 2024

Advertisement

తెలుగుదేశం, బీజేపీల మధ్య 2014-2019 మధ్య కాలంలో సంబంధాలు బెడిసికొట్టడానికి విభజన హామీల అమలు, రాష్ట్రానికి కేటాయింపులు, ప్రత్యేక హోదా, రైల్వేజోన్ లతో  పాటు మరో అంశం కూడా కారణం అయ్యింది. అదే గవర్నర్ పదవి. అప్పట్లో కేంద్రంలోని మోడీ సర్కార్ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీకి ఓ గవర్నర్ పదవి ఇస్తానన్న హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు అప్పట్లో మోత్కుపల్లి నర్సింహులును ఏదో ఓ రాష్ట్రానికి గవర్నర్ గా పంపిస్తానన్న వాగ్దానం చేశారు. అయితే ఆ ఐదేళ్ల కాలంలో అది జరగలేదు. ఈ లోగానే విభజన హామీల అమలు, వాగ్దానాలను నెరవేర్చడంలో అప్పటి మోడీ సర్కార్ మొండి వైఖరి కారణంగా తెలుగుదేశం ఎన్డీయే నుంచి బయటకు వచ్చేసింది. దీంతో అప్పటి గవర్నర్ పదవి హామీ నెరవేరలేదు. గవర్నర్ గిరీ రాలేదన్న అలకతో మోత్కుపల్లి అప్పట్లో తెలుగుదేశం పార్టీని వీడి వెళ్లిపోయారు. అది వేరే సంగతి.

ఇక ఇప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికల తరువాత  కేంద్రంలో మోడీ సర్కార్ తెలుగుదేశం మద్దతుపై మనుగడ సాగించాల్సిన పరిస్థితి ఏర్పడటంతో తనంత తానుగానే తెలుగుదేశం కు ఓ గవర్నర్ పదవి ఇచ్చేందుకు ఆఫర్ చేసిందని అంటున్నారు. ఇలా మిత్రపక్షాలకు గవర్నర్ పదవి ఇవ్వడమన్నది కొత్తేమీ కాదు. ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరికి అప్పటి కేంద్రం గవర్నర్ పదవులను కట్టబెట్టిన సంగతి విదితమే.  ఇప్పుడు కేంద్రం గవర్నర్ పదవి ఆఫర్ అన్నది వాస్తవమే అయితే ఆ పదవి కోసం కూడా తెలుగుదేశంలో పోటీ తీవ్రంగా ఉంటుందనడంలో సందేహం లేదు.

సీనియర్ నాయకులు అశోకగజపతిరాజు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కేఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు  పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరంతా కూడా తొలి నుంచీ తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు. ముఖ్యంగా యనమల, అశోకగజపతిరాజులు చంద్రబాబుకు సన్నిహితులుగా గుర్తింపు పొందారు. ఇక గోరంట్ల బుచ్చయ్య చౌదరి అయితే పార్టీ కష్టకాలంగా గట్టిగా నిలబడ్డారు. నిజంగా తెలుగుదేశం నుంచి ఒకరిని గవర్నర్ గా పంపించాలని కేంద్రం భావిస్తే చంద్రబాబు వీరిలో ఎవరికి అవకాశం ఇస్తారన్న చర్చ ఇప్పుడు  పార్టీలో జోరుగా సాగుతోంది. 

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.