ఒక అభ్యర్ధి ఒకే నియోజక వర్గం ఎన్నికల సంఘం ప్రతిపాదన

Publish Date:Jun 18, 2022

Advertisement

ఒకే అభ్యర్ధి ఒకటి కంటే ఎక్కువ అసెంబ్లీ /లోక్ సభ స్థానాల్లో పోటీ చేయకుండా ఆంక్షలు విధించాలని, కేంద్ర ఎన్నికల సంఘం, 2004 నుంచే కేంద్ర  ప్రభుత్వాన్ని కోరుతోంది. అయితే, కారణాలు ఏవైనా,  ప్రభుత్వాలు మాత్రం ఆ ప్రతిపాదనను పక్కన పెట్టాయి. అయితే ఇప్పడు  కేంద్ర ఎన్నికల సంఘం మళ్ళీ, మరోసారి అదే ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచింది. ఒక అభ్యర్ధి ఒకటి కంటే ఎక్కువ స్థానాల నుంచి పోటీ చేయడంపై నిషేధం  అయినా విధించండి లేదంటే, రెండు స్థానాల నుంచి పోటీ చేసిన అభ్యర్ధి రెండు స్థానాలలో గెలిచి, ఏదో ఒక స్థానానికి రాజీనామ చేయవలసి  వస్తే, సదరు అభ్యర్ధి నుంచి భారీ జరిమానా వసూలు చేయాలని ఎన్నికల సంఘం సూచించింది.  

కేంద్ర న్యాయ శాఖ లెజిస్లేటివ్ సెక్రటరీతో ఎన్నికల సంస్కరణల పై జరిపిన చర్చల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఈ ప్రతిపాదన చేశారు.. సుమారు ఇరవై ఏళ్ల క్రితమే వచ్చిన ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ముందుకు మళ్లీ తీసుకొచ్చింది. ఒక అభ్యర్థి రెండు  స్థానాల్లో పోటీ చేసి గెలిచినా.. ఒక స్థానం నుంచి  రాజీనామా చేయక తప్పదు. అప్పుడు రెండవ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమవుతుంది. ఉప ఎన్నిక ఎన్నికల నిర్వహణకు అయ్యే ఆర్థిక భారం ప్రభుత్వ ఖజానాపై పడుతోందని ఎన్నికల సంఘం తెలిపింది. అంతేగాక ఎన్నికల సమయంలో సిబ్బంది చాలా మంది అవసరమవుతున్నారని పేర్కొంది.

రెండు స్థానాల్లో పోటీ చేసి గెలుపొందిన వారు ఒక స్థానానికి రాజీనామా చేస్తే జరిమానా విధించాలని సూచించింది ఈసీ. శాసనసభ, శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేసి రాజీనామా చేసిన వారికి రూ.5 లక్షలు, లోక్‌సభకు పోటి చేసే అభ్యర్థులకు రూ.10 లక్షలు జరిమానాగా విధించాలని ప్రతిపాదించింది. 1996లో ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించి ఒక వ్యక్తి రెండు కంటే ఎక్కువ స్థానాల నుంచి ఎన్నికల్లో పోటీ చేయకుండా నియంత్రించారు. అంతకుముందు వరకు ఒక అభ్యర్థి ఎన్ని స్థానాల్లోనైనా పోటీ చేసే వీలుండేది. 1996 సవరణ తర్వాత ఒక అభ్యర్ధి రెండు స్థానాలు మించి పోటీ చేయకుండా ఆంక్షలు విధించిన, పార్టీల ముఖ్య నేతలు  రెండు స్థానాల్లో పోటీ చేస్తూనే, ఉన్నారు. 2014 లోక్ సభ ఎన్నికలలో ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రం గుజరాత్’లోని వడోదరా, ఉత్తర ప్రదేశ్’లోని వారణాసి స్థానల నుంచి పోటీ చేసి రెండు చోట్ల విజయం సాధించారు. ఆ తర్వాత వడోదర స్థానానికి రాజీనామా చేసారు. అలాగే, 2019లో రాహుల్ గాంధీ యూపీలోని  అమేథి, కేరళలోని వయానార్ నియోజక వర్గాల్ నుంచి పోటీ చేసినా, అమేథిలో అయన ఓడి పోవడంతో రాజానామా చేయవలసిన అవసరం రాలేదు.

ఇలా, కీలక నేతలు సైతం రెండేసి  స్థానాల నుంచి పోటీ చేయడంతో    ఉప ఎన్నికలు అనివార్యం అవుతూనే ఉన్నాయి. అసెంబ్లీ, లేదా లోక్ సభ ఎన్నికల్లో  రెండేసి స్థానాల్లో పోటీ చేయడమే కాకుండా,  పదవిలో ఉండగానే పార్లమెంట్  సభ్యులు అసెంబ్లీ ఎన్నికల్లో, అసెంబ్లీ సభ్యులు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం వలన కూడా ఉప ఎన్నికలు, అనవసర వ్యయం అనివార్య మవుతున్నాయి. సో .. ఎన్నికల సంఘం ప్రతిపాదనను, సంక్లిష్ట న్యాయ సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వానికి సలహా ఇచ్చే, లా కమిషన్ కూడా సమర్ధించింది.

వన్ కాండిడేట్ వన్ వన్ కాన్స్టిట్యూయన్సీ ఒక అభ్యర్ధి ఒక నియోజక వర్గం ప్రతిపాదనకు పచ్చ జెండా ఊపింది. అయితే, రెండు నియోజక వరగాల్లో పోటీ చేసి గెలిచిన అభ్యర్ధుల నుంచి ఉప ఎన్నిక ఖర్చును వాసులు చేయాలన్న ప్రతిపాదనకు  మాత్రం లా కమిషన్ నో చెప్పింది. ఈ నేపధ్యంలో  బంతి ఇప్పుడు  మరోమారు  కేంద్ర ప్రభుత్వం కోర్టుకు చేరింది. వన్ నేషన్ వన్ టాక్స్, వన్ నేషన్ వన్ రేషన్ అంటున్న కేంద్ర ప్రభుత్వం వన్ కాండిడేట్ వన్ వన్ కాన్స్టిట్యూయన్సీ కి అంగీకరిస్తుందా లేదా అనేది చూడవలసి వుంది.

By
en-us Political News

  
ఆ నక్కల కారణంగానే తాను తన మార్గాన్ని ఎంచుకుని బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలోని తన మాజీ సహచరులపై తీవ్ర విమర్శలు గుప్పించిన కవిత.. బీఆర్ఎస్‌లోని కొందరు గుంటనక్కల వంటి నేతల బృందం తనను ఒంటరిని చేసి, పక్కన పెట్టడానికి పద్ధతి ప్రకారం పనిచేశారని కవిత చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ అత్యంత కీలకమైన మలుపుగా మారబోతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అత్యంత ఉత్కంఠభరిత వాతావరణంలో ప్రారంభం కానున్నాయి.
శాంతిభద్రతల విఘాతం కలగకుండా ఉండేందుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందస్తు భద్రతా వ్యూహంలో భాగంగా సెంట్రల్ ఢిల్లీని దాదాపు తమ అధీనంలోకి తీసుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఈ చలో పార్లమెంట్ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో తనదైన విలక్షణ శైలితో నిత్యం వార్తల్లో నిలిచే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేసినట్లేనా.. అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. గత కొంతకాలంగా ఆయన కారు దిగిపోనున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో ఆ ప్రచారానికి బలం చేకూర్చింది. సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న వేదికపై ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఉన్నారు. ఆ వేదికపై ప్రసంగిస్తున్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నా.. మల్లారెడ్డి పట్టించుకోకుండా చిరునవ్వులు చిందిస్తూ ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. సొంత పార్టీ అధినేతను అంతగా విమర్శిస్తున్నా మల్లారెడ్డిలో స్పందన లేకపోవడంతో ఆయన కారు దేగేయడం ఖాయమన్న ప్రచారానికి బలం చేకూర్చింది. అలాగే ఇటీవలే.. ఆయన ఒక ప్రైవేటు కార్యక్రమంలో కూడా తాను బీఆర్ఎస్ ను వీడనున్నట్లు సంకేతాలిచ్చారు. వాస్తవానికి.. గత ఎన్నికలలో పరాజయం పాలై బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన నాటి నుంచీ కూడా మల్లారెడ్డి పొలిటికల్ గా ఒకింత ఇనాక్టివ్ అయ్యారనే చెప్పారు. చాలా కాలంగా మల్లారెడ్డి అధికార కాంగ్రెస్ లేదా కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తన వ్యాపార, విద్యారంగ సంస్థల పరిరక్షణతో పాటు నియోజకవర్గంలో రాజకీయ ఉనికి కోసం ఆయన అధికార పార్టీతో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. ఒకప్పుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించిన చామకూర మల్లారెడ్డి.. ఇప్పుడు ఆయన ప్రసంగిస్తున్న వేదికపై కనిపించడం పట్ల కమలం శ్రేణుల్లో కూడా ఆగ్రహం వ్యక్తమౌతోంది. మొత్తం మీద మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడం ఖాయమన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది. అయితే ఆయన కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా? కాషాయ తీర్థం పుచ్చుకుంటారా అన్న విషయంపై అయితే రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే అనేకమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు హస్తం గూటికి చేరిన నేపథ్యంలో, మల్లారెడ్డి కూడా అదే బాట పడతారన్న అభిప్రాయమే పరిశీలకులలో కూడా వ్యక్తమౌతోంది. chamakura malla reddy latest news, medchal mla malla reddy, telangana political updates
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ కీలక సమీక్ష నిర్వహించింది.
తెలంగాణ భారతీయ జనతా పార్టీల్లో ఒక్కసారిగా పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.