2 నుంచి చంద్రబాబు లండన్ పర్యటన

Publish Date:Oct 30, 2025

Advertisement

ఏపీ ఫస్ట్ అన్నది చంద్రబాబు నినాదం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొంథా రూపంలో పెను ముప్పు ఉన్నదన్న సమాచారంతో తుపాను నష్టాన్ని కనిష్టానికి తగ్గించి, ప్రజలను క్షేమంగా ఉంచడమే లక్ష్యంగా ఆయన గత మూడు రోజులుగా నిద్రాహారాలతో సంబంధం లేకుండా నిర్విరామంగా కృషి చేశారు. ఆయన కృషి, శ్రమ ఫలించాయి. తుపాను వల్ల రాష్ట్రానికి పెద్దగా నష్టం వాటిల్ల కూడదన్న ఆయన సంకల్పబలం ముందు మొంథా తుపాను తోకముడిచింది. అతి భీకరంగా తీరం వైపునకు దూసుకువచ్చిన తుపాను.. పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. తీరం దాటి బలహీనపడింది. తుపాను విపత్తు నుంచి ఏపీని సురక్షితంగా బయటపడేసిన వెంటనే రాష్ట్రానికి ప్రగతి బాటలు పరిచే పనిలో నిగమ్నమైపోయారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. గత నాలుగు రోజులుగా తుపాను పరిస్థితిపై నిరంతర సమీక్షలు, రియల్ టైమ్ పర్యవేక్షణతో క్షణం తీరిక లేకుండా  గడిపిన చంద్రబాబు గురువారం ఉదయం కూడా తుపాను ప్రభావిత ప్రాంతాలల సమాయ పునరావాస చర్యలపై అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

ఇక ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన మరోమారు విదేశీ పర్యటనకు సిద్ధమైపోయారు. నవంబర్ 2 నుంచి అంటే ఆదివారం నుంచి చంద్రబాబు ఐదు రోజుల పాటు లండన్ లో పర్యటించనున్నారు.  పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా  చంద్రబాబు ఈ పర్యటనకు బయలు దేరు తున్నారు.  ఈ పర్యటనలో ఆయన పలు అంతర్జాతీయ పెట్టుబడిదారులతో  భేటీ అవుతారు.

విశాఖపట్నంలో త్వరలో జరగబోయే గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌‌ కు పెట్టుబడిదారులను ఆహ్వానించడంపై ప్రత్యేక దృష్టి పెట్టిన చంద్రబాబు  లండన్‌లో సీఐఐ ఆధ్వర్యంలో జరుగుతున్న రోడ్‌ షోలో పాల్గొని ఆంధ్రప్రదేశ్‌లోని పెట్టుబడి అవకాశాలను    ఈ పర్యటనలో ఆయన పలు గ్లోబల్ కంపెనీల ప్రతినిధులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించి, పెట్టుబడుల సహకారం, టెక్నాలజీ మార్పిడి, ఉద్యోగావకాశాల సృష్టి వంటి అంశాలపై చర్చించనున్నారు. నవంబర్‌ 6న సీఎం చంద్రబాబు అమరా వతికి తిరిగి రానున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పెట్టుబడిదారుల కేంద్రంగా నిలపాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కదులుతోందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటన ముగించుకుని చంద్రబాబు నవంబర్ 6న అమరావతికి తిరిగి వస్తారు.  

By
en-us Political News

  
భారతదేశానికి జంబుద్వీపం అనే పేరు ఎలా వచ్చింది? పూజల సంకల్పంలో జంబుద్వీపం అని ఎందుకు అంటారు? పురాణాలు మరియు చరిత్ర తెలిపే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి.
Before choosing a group health insurance plan, you should consider the eligibility criteria and check whether the insurer has a smooth claim processing. Let us explore what are the group health insurance benefits in more detail.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆసుపత్రి నిర్వహణకు సంబంధించిన ఆర్థిక వనరులు, లావాదేవీలపై ఐటీ   ప్రత్యేక దృష్టి పెట్టింది. గత కొంతకాలంగా పెద్ద మొత్తంలో జరిగిన నగదు లావాదేవీలకు సరైన లెక్కలు లేకపోవడం, పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసాలు ఉండటమే ఈ దాడులకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
అలాంటి అరుదైన, విలక్షణమైన వన్యప్రాణుల జాబితాలో ఇండోనేషియాలోని సులవేసి ద్వీపానికి చెందిన  మ్యాక్రోసెఫాలోన్ మెలియో పక్షి  జాతి ఒకటి. సాధారణ పక్షుల వలె చెట్లపై గూళ్లు కట్టుకుని, గుడ్లను పొదిగే సంప్రదాయ పద్ధతికి ఇది పూర్తి భిన్నం. ఈ పక్షి జీవన శైలి  అడవి కోడిని పోలి ఉంటుంది.
ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వాతావరణ రాడార్లు అందుబాటులోకి రాకముందే..   పూర్వీకులు చెట్లను, జంతువులను, కీటకాలను గమనించి రానున్న విపత్తులను అంచనా వేశారు. ఆ అంచనాలు దాదాపు కచ్చితంగా ఉండేవి. పర్యావరణంలో వచ్చే చిన్న చిన్న మార్పులను,  భూగర్భంలో జరిగే అలజడిని మనుషుల కంటే ముందుగా వృక్షజాలం పశుపక్ష్యాదులు పసిగడతాయని శాస్త్రీయ అధ్యయనాలుచెబుతున్నాయి.
ఈనాడు సంస్థల వ్యవస్థాపకుడు చెరుకూరి రామోజీరావు జీవిత విశేషాలు, ఆయన అవలంబించిన వ్యాపార విధానాలు మరియు ఎదుర్కొన్న రాజకీయ సవాళ్లపై ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డి.ఎన్. ప్రసాద్  తెలుగువన్ ది జర్నలిస్ట్ మూడో  ఎపిసోడ్‌లో  తెలుగువన్ ఎండీ  రవిశంకర్ తో పంచుకున్నారు.  
ఉపాధి కోసం వలస వెళ్లిన కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బట్టలు ఉతికేందుకు కుంటకు వెళ్లిన ముగ్గురు నీటిలో మునిగి దుర్మరణం చెందారు. ఈ హృదయవిదారక ఘటన వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
న్యూయార్క్ సమీపంలోని ఆల్బనీ ప్రాంతంలో  నివాసముంటున్న ఆమె అమెరికా కాల మానం ప్రకారం గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో ఖమ్మంలో ఉన్న తన తండ్రి నల్లమల్ల ఆనంద్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతుండగానే  గుండె నొప్పితో కుప్పకూలిపోయారు.
జామో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలంపూర్ గ్రామంలో ఉన్న ఒక బాణసంచా తయారీ యూనిట్లో  భారీ పేలుడు సంభవించింది.   శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు  
తెలంగాణలో కూడా వచ్చేమూడు రోజులూ పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వర్షాలు కురిసే సమయాల్లో పిడుగుపాటుకు అవకాశాలున్నందున విద్యుత్ స్తంభాలు, చెట్లకింద నిలబడవద్దని హెచ్చరించింది.
నాగర్‌కర్నూల్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ పేరిట రూ.29.27 కోట్ల విలువైన 12,530 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైన భారీ కుంభకోణం వివరాలు.
కృష్ణా జిల్లాలో దీపావళి టపాసులు కాల్చే సమయంలో కెమికల్ డ్రమ్ పేలి పదేళ్ల బాలుడు మృతి చెందిన విషాదకర సంఘటన పూర్తి వివరాలు. పిల్లల భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.