కల్తీ మద్యానికి సురక్షా యాప్ తో చెక్.. చంద్రబాబు

Publish Date:Oct 13, 2025

Advertisement

ఏపీలో పెను దుమారం రేపిన కల్తీ మద్యం వ్యవహారం రాజకీయంగా కూడా సంచలనం సృష్టించింది.  అన్నమయ్య జిల్లా ములకలచెరువులో కల్తీ మద్యం తయారీ కేంద్రం బయటపడం.. ఆ తరువాత   తీగలాగితే డొంక కదిలిన చందంగా దీని వెనుక ఉన్న రాజకీయ లింకులు వెలుగులోకి వచ్చాయి. అలానే నిందితులు కూడా ఒకరి వెంట ఒకరు అఅన్నట్లుగా బయటపడ్డారు.  ఈ కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావును కూడా పోలీసులు అరెస్టు చేశారు.  ఈ వ్యవహారం ఇలా ఉండగా.. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో భారీ ఎత్తున నకిలీ మద్యం బయటపడింది.

విషయమేంటంటే.. ములకలచెరువు కల్తీ మద్యం  వ్యవహారానికీ ఇబ్రహీంపట్నంలో బయటపడిన కల్తీ మద్యం బాటిళ్లకూ లింకు ఉండటంతో.. రాష్ట్రంలో అసలు నాణ్యమైన మద్యం దొరుకుతోందా.. తాము తాగేదంతా కల్తీ మద్యమేనా అన్న భయం మందుబాబుల్లో కలిగింది.  మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన కల్తీ మద్యం గుట్టురట్టు చేసేందుకు ఎక్సైజ్ శాఖ రంగంలోకి దిగింది. అదే సమయంలో మొత్తంగా కల్తీ మద్యానికి చెక్  పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక యాప్ ను తీసుకువచ్చింది. ఈ యాప్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదివారం (అక్టోబర్ 12)న ఉండవల్లిలో మీడియా సమావేశంలో ప్రారంభించారు.  ఈ యాప్ సాయంతో నకిలీ మద్యం బాటిళ్లను గుర్తించవచ్చని చెప్పిన చంద్రబాబు వైసీపీ హయాం నుంచి తమ ప్రభుత్వానికి కల్తీ మద్యం వారసత్వంగా వచ్చిందన్నారు.  కల్తీ మద్యం  మద్యంపై విచారణకు సిట్‌ ఏర్పాటు చేసినట్లు వెల్లడించిన చంద్రబాబు న  కల్తీ మద్యం కేసులో రాజీ  ప్రశక్తే లేదని స్పష్టం చేశారు.  మొత్తం  ప్రక్షాళన చేస్తామన్నారు. బెల్ట్‌ షాపుల బెల్ట్ తీస్తామన్నారు.  

ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్  ద్వారా నకిలీ మద్యాన్ని పూర్తిగా అరికడతామన్నారు. ఈ యాప్ ద్వారా బాటిళ్ల ట్రాకింగ్ ఈజీ అవుతుందన్నారు. కల్తీ మద్యం కేసు విషయంలో తమకు తనపర బేధం లేదన్న చంద్రబాబు.. దీనిలో ఎవరున్నా వదిలే ప్రశక్తే లేదని చెప్పారు.  2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారిందని అన్నారు. గత పాలకులు అన్ని వాళ్ల సొంత బ్రాండ్లనే లీగల్ చేశారు, ట్రాన్స్‌పోర్ట్ కూడా సొంత వాళ్లకు ఇచ్చారు, ఇల్లీగల్ నేర సామ్రాజ్యం ఏర్పాటు చేశారని అన్నారు. ఇప్పుడు దానిని పూర్తిగా కంట్రోల్లో పెట్టామని, రాష్ట్రంలో బెస్ట్ మద్యం పాలసీ తెచ్చామని సీఎం చెప్పారు. ఇకపై రాష్ట్రంలో నకిలీ మద్యానికి పూర్తిగా చెక్ పెడతామని చెప్పారు. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ, క్షేత్రస్థాయిలో పాలనా పరమైన విధానాలు మరియు లబ్ధిదారుల శైలి మారలేదనే తీవ్ర అసంతృప్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
దేశ రాజకీయాల్లో తెరవెనుక జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి.
దిల్లీలో నీట్ పరీక్షల లీకేజీకి సంబంధించి పక్కా ఆధారాలు బయటపడటంతో అక్కడ కేంద్ర ప్రభుత్వంపై యువత తిరగబడింది. కానీ ఏపీలో మెగా డీఎస్సీ పారదర్శకంగా ముగిసి, నియామక పత్రాలు కూడా అభ్యర్థులకు అందజేశారు. ఏపీ విద్యాశాఖ కూడా విపక్షాలు చేసిన ప్రతి ఆరోపణకూ రికార్డులతో సహా పక్కాగా వివరణ ఇచ్చింది.
కవిత పార్టీ పేరుపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందనీ, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీఐకి అధికారిక ఫిర్యాదు చేసింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత టీఎంసీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. మమతా బెనర్జీని ధిక్కరిస్తూ ఒక్కరొక్కరుగా కీలక నేతలు పార్టీని వీడుతున్నారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిన మోడీ.. ఇప్పడు పాలనలో రికార్డు అంటూ సంబరాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. మోడీ పాలనా మైలురాయి కేవలం స్వయం ప్రకటిత అంశం మాత్రమేనన్నారు.
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.