ఆరోగ్య శ్రీ బకాయిల చెల్లింపులకు 300 కోట్లు విడుదల

Publish Date:Aug 24, 2024

Advertisement

జగన్ హయాంలో  పథకాల అమలు తీరు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా సాగింది. పథకాలు అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ, వాటి కోసం అంటూ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చేశారు జగన్. అలా పేరుగొప్ప ఊరుదిబ్బ చందంగా జగన్ హయాంలో అమలైన పథకం ఆరోగ్య శ్రీ.   ఆర్భాటంగా పథకాల ప్రకటనే తప్ప ఆ పథకాల అమలుకు కావలసిన సొమ్ముల  విడుదలలో మొండి చేయి చూపడంతో జగన్ హయాంలో ఆరోగ్య శ్రీ అమలు తూతూ మంత్రంగానే సాగింది.  వందల కోట్లు అప్పు చేసి జగన్ సర్కార్ చేస్తున్నదేమిటయ్యా అంటే విడతల వారీగా ప్రభుత్వోద్యోగుల వేతనాలు చెల్లించడం. ఇప్పటికే అమలు చేస్తున్న బటన్ నొక్కుడు కార్యక్రమాలకు అరకొరగా నిధులు పందేరం చేయడం మాత్రమే. 
జగన్ విధానాల డొల్ల తనానికి  బకాయిలు పేరుకు పోయి ఆరోగ్య శ్రీ  పథకం ఓ నిదర్శనం.  
ఆస్పత్రులకు ఆరోగ్య శ్రీ బకాయిలు విడుదల చేయడానికి చేతులు రాని జగన్.. సరిగ్గా ఎన్నికలకు ముందు మాత్రం ఆర్భాటంగా ఆరోగ్య శ్రీ కింద వైద్య సేవల పరిమితిని పాతిక లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.   అమలు కాని పథకానికి పరిమితి ఎంత పెంచితే  మాత్రం నష్టం ఏమిటన్న రీతిలో జగన్ సర్కార్ తీరు ఉండేది.  

 జగన్  హయంలో ఆసుపత్రులకు చెల్లించాల్సిన ఆరోగ్యశ్రీ బకాయిలు కొండలా పేరుకుపోయాయి. ఒక్కో ఆసుపత్రికి   కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉందంటే అతిశయోక్తి కాదు.  గతంలో అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు హయాంలో  కొంచం ఆలస్యంగానైనా, అంటే  ఏ ఏడాదికి ఆ ఏడాది ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించే వారు.   వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ సర్కార్ ఆరోగ్య శ్రీ బిల్లుల చెల్లింపును మూలన పడేశారు. ఈ విషయంపై  ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో ప్రభుత్వ పెద్దలు బెదిరింపులకు దిగారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.  సరే ప్రస్తుతం జగన్ సర్కార్ నిర్వాకం తెలుగుదేశం కూటమికి భారంగా మారింది.  ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లిస్తే తప్ప ఆ సేవలు అందించలేమంటూ ఆస్పత్రులు చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది. దీంతో చంద్రబాబు సర్కార్ ఆరోగ్య శ్రీ ట్రస్ట్ అనుబంధ ఆస్పత్రులకు పెండింగ్ బయాయిల చెల్లింపుల కోసం 300 కోట్ల రూపాయలు విడుదల చేసింది. విడతల వారిగా బకాయిలన్నీ చెల్లించేందకు నిర్ణయం తీసుకుంది. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించే విషయంలో రాజీ ప్రశక్తే లేదని చంద్రబాబు ఉద్ఘాటించారు.  ప్రజలకు మేలు చేయడమే ప్రభుత్వాల విధి అని చాటారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నా పేదలకు ఆరోగ్య సేవలు నిరాటంకంగా అందాలన్న లక్ష్యంతో నిధులు విడుదల చేశారు. 

By
en-us Political News

  
దేశ రక్షణ రంగంలో అత్యంత కలకలం రేపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
సినిమా తరహాలో పక్కా ప్లాన్ వేశాడు.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకవని భావించాడు.. కానీ చివరకు చేసిన చిన్న పొరపాటే అతడిని పోలీసులకు పట్టించింది.
అంతర్జాతీయ విమానయాన రంగంలో కలకలం సృష్టించిన ఫ్లైదుబాయ్ విమాన హైజాక్ యత్నం కేసులో విచారణ వేగవంతం కాగా, ఊహించని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దేశం కోసం ప్రాణాలర్పించిన ఓ వీర జవాన్ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
ఆశిష్ అనే యువకుడు జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కేసు.. దర్యాప్తు ముమ్మరం.!
ఆంధ్రప్రదేశ్‌లో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది
చిన్నారి జీవితాన్ని విషాదంగా మార్చిన బిస్కెట్.!
ఆకాశంలో ఓ పక్షి.. విమానంలో వందలాది మంది ప్రయాణికులు.. క్షణాల్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ! శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పక్షి ఢీకొట్టినట్లు అనుమానం
న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
అమెరికాలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ఉపాధి కోసం అగ్రరాజ్యానికి వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
భారత పైలట్ చెప్పిన షాకింగ్ నిజాలు..!
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.