నామినేటెడ్ పదవులు... చాణక్య చంద్రబాబు!

Publish Date:Sep 25, 2024

Advertisement

నామినేటెడ్ పదవుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అధికారంలో భాగస్వాములుగా ఉన్న కూటమి పార్టీలలో అసంతృప్తి వ్యక్తం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే సమయంలో కూటమి పార్టీలలో తెలుగుదేశం వ్యతిరేకులను దూరం పెట్టడంలోనూ జాగ్రత్త వహిస్తున్నారు. ఇన్ని పరిమితుల మధ్య సొంత పార్టీ నేతలకు పదవుల విషయంలో అక్కడక్కడా తలెత్తుతున్న అసంతృప్తిని గమనించడం లేదా అన్న అభిప్రాయం తెలుగుదేశం వర్గీయులలోనే వ్యక్తం అవుతోంది. 

ఆ సంగతి కొద్ది సేపు పక్కన పెడితే కూటమి పార్టీలలో అసంతృప్తి వ్యక్తం కాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూనే.. ఆయా పార్టీలలో మరీ ముఖ్యంగా బీజేపీలో వైసీపీకి అనుకూల నేతలను పూర్తిగా పక్కన పెట్టేయడంలో చంద్రబాబు విజయం సాధించారనే చెప్పవచ్చు. తొలుత నామినేటెడ్ పదవులకు రంగం సిద్ధం అయ్యిందన్న వార్తలు రాగానే బీజేపీ తరఫున ఆ పదవులకు బీజేపీ కేంద్ర నాయకత్వం సిఫారసు చేసిన నేతలలో తెలుగుదేశం నేతలు, శ్రేణులకు సుతరామూ ఇష్టం లేని కొన్ని పేర్లు ఉన్నాయి. జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి వంటి వారికి నామినేటెడ్ పదవులు కట్టబెట్టాలంటూ బీజేపీ సిఫారసు చేయడం తెలుగుదేశం, జనసేన శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. అయితే చంద్రబాబు మాత్రం ఆచితూచి వ్యవహరించారు. వారి పేర్లను స్వయంగా బీజేపీ హై కమాండే ఉపసంహరించుకునేలా వ్యూహాత్మకంగా పావులు కదిపారు. ఇందు కోసం నామినేటెడ్ పదవుల భర్తీలో జాప్యం జరిగినా పెద్దగా పట్టించుకోలేదు. చివరికి మంగళవారం (సెప్టెంబర్ 24) ఆయన ఓ 20 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. ఆ జాబితాలో బీజేపీలోని వైసీపీ అనుకూల నేతల పేర్లు లేవు. అయినా బీజేపీ నుంచి ఇసుమంతైనా అసంతృప్తి వ్యక్తం కాలేదు. ఇది కచ్చితంగా  కూటమి ధర్మాన్ని పాటిస్తూనే.. కూటమి పార్టీల్లోని తెలుగుదేశం వ్యతిరేకులను పక్కన పెట్టేయడం  చంద్రబాబు చాణుక్యమే. అంతే కాదు.. ఇప్పుడే కాదు, భవిష్యత్ లోనూ అటువంటి వారికి ఎటువంటి అవకాశాలూ ఉండవని స్పష్టం చేయడమే.  

మంగళవారం (సెప్టెంబర్ 24)  చంద్రబాబు ప్రకటించిన నామినేటెడ్ పోస్టులలో బీజేపీ నుంచి కేవలం లంకా దినకర్ కు మాత్రమే పదవి లభించింది. ఆయన  తెలుగుదేశం మాజీ నాయకుడే. ఇక  జనసేన నుంచి ముగ్గురికి పదవులు లభించాయి. ఇక తెలుగుదేశం కు 16 పదవులు లభించాయి. అన్ని సమీకరణాలనూ పరిగణనలోనికి తీసుకుని సమగ్ర కసరత్తు తరువాతే చంద్రబాబు నామినేటెడ్ పోస్టులకు నేతలను ఎంపిక చేశారని ఆ పదవులు దక్కిన వారి పేర్లను బట్టి అర్ధమౌతోంది. 

ఇక ఇప్పుడు తెలుగుదేశంలో అక్కడక్కడా అసంతృప్తి వ్యక్తం కావడం విషయానికి వస్తే.. ఐదేళ్ల పాటు విపక్షంలో  ఉండటంతో..  పలువురు తెలుగుదేశం నాయకులు జగన్ అరాచక పాలనలో అన్ని విధాలుగా వేధింపులకు, దాడులకు, దౌర్జన్యాలకూ గురై ఇబ్బందులు పడ్డారు. వారి జాబితా చాలా చాలా పెద్దదే. అటువంటి వారంతా తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది కనుక ఏదో ఒక పదవి ఆశించడం సహజమే. అయితే పొత్తు ధర్మాన్ని పాటిస్తూ, ఒకే విడతలో అందరినీ సంతృప్తి పరిచేలా పదవుల పందేరం అంత సులభ సాధ్యం కాదు. ఇప్పుడు తెలుగుదేశంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతలకూ ఆ విషయం తెలుసు. అయినా వారిలో అసంతృప్తికి కారణం లేకపోలేదు.

ఎన్నికలలో తెలుగుదేశం అఖండ విజయంతో తమ పాత్రకు తగిన గుర్తింపు లభించలేదన్నదే ఆ అసంతృప్తికి కారణం. ఈ విషయాన్ని తెలుగుదేశం  జాతీయ అధికార ప్రతినిథి జీవీకే బాహాటంగానే వ్యక్తం చేస్తే, మరో జాతీయ అధికార ప్రతినిథి పఠాభి మాత్రం తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేశారు. గుర్తింపు లభించడం అంటే ఏంటన్న ప్రశ్నకు వారిచ్చిన సమాధానాల సారాంశం ఏంటంటే... పార్టీ నుంచి కమ్మూనికేషన్. పార్టీ విజయం సాధించిన తరువాత ఇంత వరకూ పార్టీ అధినేతను కలిసే అవకాశమే తమకు దక్కలేదన్నది వారిలో అసంతృప్తికి అసలైన కారణం. తాము పదవుల కోసం పార్టీలో లేమనీ, పార్టీ అధికారంలో ఉండాలన్న సంకల్పంతో జగన్ హయాంలో ఎన్నో ఇబ్బందులు, దాడులు, దౌర్జన్యాలను ఎదుర్కొని నిలబడ్డామని, అటువంటి తమకు పార్టీ అధినేత అప్పాయింట్ మెంట్ కూడా  దక్కకపోవడం ఒకింత అసంతృప్తి కలిగించిందనీ చెబుతున్నారు. ఈ విడత నామినేటెడ్ పదవులలో మీకు అవకాశం లేదు.. తరువాత చూద్దాం అన్న ఒక్క సందేశం పార్టీ అగ్రనాయకత్వం నుంచి తమకు అంది ఉంటే బాగుండేదనీ వారు అంటున్నారు. నిజమేకదా?!

By
en-us Political News

  
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు రేపు ఒకేసారి ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే అస్సాంలో 126 స్థానాలకూ కూడా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గతంలో బహుళ విడతల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా(సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆ డిపో సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్(గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేదా డోర్నకల్ కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కిద్వాయ్, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందారు. మోహ్సినా కిద్వాయ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిజాముద్దీన్ స్మశాన వాటికలో బుధవారం (ఏప్రిల్ 8) సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్‌లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ వంటి నేతలను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనను వినాల్సింది పోయి, వారికి మద్దతుగా వస్తున్న విపక్ష నేతలపై ఆంక్షలు విధించడం దారుణమన్నారు.
రిలే దీక్షకు మద్దతుగా గ్రామానికి చేరుకోవాలని ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలను పోలీసులు మార్గ మధ్యలోనే నిలిపివేస్తూ వెనక్కి పంపించేశారు. దీంతో పరిగి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.