చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు కన్నుమూత

Publish Date:Nov 16, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తినాయుడు కన్నుమూశారు.  దీర్ఘకాల అనారోగ్యంతో ఉన్న ఆయన హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం ఉదయం ఆయన పరిస్థితి విషమించి కార్డియాక్ అరెస్ట్‌తో తుది శ్వాస విడిచారు.  ఈ విషయాన్ని ఆయన కుమారుడు నారా రోహిత్ పీఆర్వో అధికారికంగా మీడియాకు తెలిపారు. కాగా సోదరుడి మరణ వార్త తెలియగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. తన చిన్నాన్న తీవ్ర అస్వస్థతతో ఉన్నారన్న సమాచారంతో మంత్రి లోకేష్  తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని హైదరాబాద్ చేరుకున్నారు.  నారా, నందమూరి కుటుంబసభ్యులు  ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. నందమూరి రామకృష్ణ, దగ్గుబాటి పురందేశ్వరి వద్దకు వచ్చారు. మరి కొద్ది సేపటిలో  చంద్రబాబు కూడా ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వస్తున్నారు.  
చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే అయిన రామ్మూర్తి నాయుడు అనారోగ్యం కారణం చాలా కాలంగా యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు.  నారా రామ్మూర్తి నాయుడుకు ఇరువురు కుమారుడు ఉన్నారు. వారిలో ఒకరు నారా రోహిత్  సినిమా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నారు. చంద్రబాబునాయుడు దంపతులు దగ్గరుండి ఈ నిశ్చితార్థం నిర్వహించారు. రామ్మూర్తినాయుడి అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన నారావారి పల్లెలో ఆదివారం నిర్వహించనున్నట్లు  కుటుంబ సభ్యులు తెలిపారు. 

By
en-us Political News

  
సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ మానసిక రోగి హల్‌చల్‌ చేయడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
దేశ రాజకీయాల్లో ప్రాంతీయ అసమానతలు, ఉత్తరాది ప్రాబల్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన గళాన్ని గట్టిగా వినిపించారు.
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత యువ షూటర్, తెలంగాణ ముద్దుబిడ్డ ఈషా సింగ్ అద్భుత ప్రతిభ కనబరిచారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది.
హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్‌లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దూకుడు పెంచింది.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంక్షేమ అధ్యాయానికి తెరలేచింది.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది.
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్‌ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.