అర్ధరాత్రి వరకు కలెక్టరేట్‌లోనే సీఎం చంద్రబాబు!

Publish Date:Sep 3, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు కష్టం వచ్చిందంటే విలవిలలాడిపోతారు. వారి కష్టాలను తీర్చి సాధారణ జీవితం గడిపే వరకూ నిద్రాహారాలు మరచిపోతారు. అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా ఆయన తీరు అదే.  గతంలో ఉత్తరాఖండ్ విలయంలో చిక్కుకున్న తెలుగువారిని స్వరాష్ట్రాలకు, వారి ప్రాంతాలను పంపించేందుకు చంద్రబాబు పడిన తపన చేసిన కృషి ఇప్పటికీ అందరికీ గుర్తుండిపోతుంది.

వారి కోసం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆయన అధికారంలో లేరు. విపక్ష నేత. ప్రజలను ఆదుకునే విషయంలో  ఆయనకు రాజకీయాలతో పని లేదు. ప్రజల క్షేమమే ముఖ్యం. ఇక విశాఖను హుద్ హుద్ తుపాను అతలాకుతలం చేసిన సమయంలో కూడా రోజుల తరబడి విశాఖలోనే బస చేసి, విశాఖ కలెక్టరేట్ నే తన సెక్రటేరియెట్ గా మార్చుకుని బస్సులోనే విశ్రాంతి తీసుకుంటూ సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించిన సంగతీ తెలిసిందే.

ఇప్పుడు బెజవాడను కనీవినీ ఎరుగని వరద ముంచెత్తిన ఆపత్సమయంలోనూ చంద్రబాబు నిద్రాహారాలను పట్టించుకోకుండా బెజవాడలోనే మకాం వేసి సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం (సెప్టెంబర్ 1) అర్థరాత్రి నుంచీ ఆయన నిర్విరామంగా వరద బాధితులను ఆదుకోవడంలోనే నిమగ్నమయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటనలు చేస్తూ, కలెక్టరేట్ లో సమీక్షలు నిర్వహిస్తూ, ఎప్పటికప్పుడు అధికారులకు దిశా నిర్దేశం చేస్తూ అవిశ్రాంతంగా గడిపారు. సోమవారం (ఆగస్టు 2)న కూడా ఆయన అదే పని చేస్తూ గడిపారు.

సోమవారం అర్ధరాత్రి 2 గంటల వరకూ ఆయన విజయవాడ కలెక్టరేట్ లోనే ఉండి  సహాయక చర్యలు, వరద నిర్వహణపై పర్యవేక్షించారు.  సీఎంతో పాటు  పలువురు మంత్రులు, అధికారులు కూడా ఉన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలకు ఆహారం పంపిణీ, అవసరమైన చోట్ల సురక్షిత ప్రాంతాలను జనాల తరలింపు తదితర అంశాలను స్వయంగా పర్యవేక్షించి పనులు జరిగేలా చూశారు. ముంపు ప్రాంతాల ప్రజలకు హెలికాప్టర్ల ద్వారా ఆహారాన్ని అందేలా చూశారు. మరీ రిమోట్ ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా అహార పదార్థాలు, మందులను అందించారు.  

By
en-us Political News

  
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం తెలుగు రాష్ట్రాల్లో ఒక కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది.
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్ వ్యక్తిగత జీవితంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది.
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో అవినీతి బాగోతాన్ని వెలుగులోకి తెచ్చారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
జాతీయ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడెక్కుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ వ్యవహారంపై కాంగ్రెస్ న్యాయపోరాటానికి దిగింది.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వెస్ట్ బైపాస్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
ప్రస్తుతం మార్కెట్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి
అర్థశాస్త్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి విజేతల ప్రకటన వెలువడింది.
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.