వంద మందికి పైగా వైసీపీ నేతలపై కేసులు.. కారణమేంటో తెలుసా?
Publish Date:Jul 7, 2025

Advertisement
అధికారంలో ఉండగా ఇష్టారీతిగా చెలరేగిపోయినా చెల్లినట్లు, అధికారం కోల్పోయిన తరువాత కూడా చెలరేగిపోతామంటే కుదరదన్న విషయం ఇప్పుడు వైసీపీ నాయకులు, క్యాడర్ కు ఇప్పుడు బాగా తెలిసివస్తోంది. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి లెక్క చేసే పనే లేదంటూ ఇంత కాలం చెలరేగిపోయిన వైసీపీ నాయకులు, క్యాడర్ ఇప్పుడు ఉలిక్కిపడుతున్నారు. ఏక కాలంలో వంద మందికి పైగా వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. నోటీసులు కూడా అందాయి. దీంతో ఏం చేయాలో తెలియకు వైసీపీ ఉక్కిరిబిక్కిరైపోతోంది.
ఇంతకీ అసలు ఒకే సారి ఇంత మందిపై కేసులు, నోటీసుల వెనుక కారణమేంటంటే.. జగన్ ఇటీవల చేసిన రెంటపాళ్ల యాత్ర. జగన్ రెండపాళ్ల పర్యటన విషయంలో పోలీసులు ఆంక్షలు విధించారు. జగన్ ర్యాలీలో పాల్గొనే వారి సంఖ్యపైనా, జగన్ ర్యాలీలో ఉండాల్సిన కార్ల సంఖ్యపైనా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అయితే వైసీపీ ఆ ఆంక్షలు, ఆదేశాలను తుంగలో తొక్కి ఇష్టారీతిగా వేల మందితో, వందల కార్లతో ర్యాలీ నిర్వహించింది. ఆ సందర్భంగా జగన్ ప్రయాణిస్తున్న వాహనం కింద పడి సంగయ్య అనే వైసీపీ కార్యకర్త మరణించాడు. దీనిపై పోలీసులు వైసీపీ నియోజకవర్గాల ఇన్ చార్జ్ లకు, పలువురు కీలక నేతలకు నోటీసలుు పంపి, వారిపై కేసులు నమోదు చేశారు. జగన్ వాహనం కింద పడి సింగయ్య మరణించిన కేసు నడుస్తోంది. ఈ కేసులో జగన్ ఏ2గా ఉన్నారు.
ఇప్పుడు దానికి అదనంగా పోలీసుల అనుమతి లేకున్నా ర్యాలీ నిర్వహించడం, డీజే ఉపయోగించడం, అలాగే ట్రాఫిక్ కు అంతరాయం కలిగించడం, పోలీసు విధులకు ఆటంకం కలిగించడం వంటి అభియోగాలతో మాజీ మంత్రులు విడదల రజనీ, అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యేలు కాసు మహేష్ రెడ్డి, దేవినేని అవినాష్, నంబూరు శంకరరావు, బొల్లా బ్రహ్మనాయుడు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అన్నాబత్తుని శ్రవన్ సహా మొత్తం 113 మందిపై కేసులు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు. ఈ పరిణామంతో వైసీపీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పైకి బింకంగా కోర్టులో తేల్చుకుంటామంటూ చెబుతున్నా.. క్యాడర్ లో మాత్రం తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని పార్టీ వర్గాలు వర్రీ అవుతున్నాయి. ఇక పార్టీ కార్యక్రమాలకు కార్యకర్తల హాజరు అంతంత మాత్రంగానే ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/cases-on-over-hunfred-ycp-leaders-39-201424.html












