Publish Date:Aug 12, 2022
చిన్నారులకు అవసరమయ్యే అన్ని ప్రాడెక్ట్స ను ఉత్పత్తి చేసి విక్రయించే సంస్థ ఏది అంటే ఎవరికైనా టక్కున గుర్తొచ్చేది జాన్సన్ అండ్ జాన్సన్. సబ్బు నుంచి చిన్నారుల కోసం ఉపయోగించే టవల్స్, ఆయిల్, మాయిశ్చరైజర్స్, డైపర్స్ ఇలా పువ్వుల్లాంటి తమ చిన్నారుల ఆరోగ్య రక్షణ కోసం ఉప యోగించే ప్రతి వస్తువూ జన్సన్ అండ్ జాన్సనే బ్రాండ్ ను ఉపయోగించేవారు కోకొల్లలు.
అలాంటిది ఇప్పుడు జన్సన్ అండ్ జాన్సన్ ఒక పెద్ద వివాదంలో ఇరుక్కుంది. ఆ సంస్థ ఉత్పత్తి చేసే బేబీ టాల్క్ పౌడర్ లో క్యాన్సర్ కారకాలున్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ టాల్క్ అమ్మకాలు నిలిచిపోనున్నాయి. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ టాల్కమ్ పౌడర్ లో ఉపయోగించే ఆస్ బెస్టాస్ ఒవేరియన్లో క్యాన్సర్ కారకాలున్నాయని వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ టాల్కమ్ పౌడర్ లో క్యాన్సర్ కారకాలున్నాయంటూ దాదాపు 38వేల కేసులు నమోదయ్యాయి. అయితే క్యాన్సర్ కారకాల ఆరోపణలను జాన్సన్ అండ్ జాన్సన్ ఖండించింది. తాము ఉత్పత్తి చేసే బేబీ టాల్కం పౌడర్ సురక్షితమైనదేనని వైద్య నిపుణులు నిర్ధారించారనీ చెబుతోంది. అయినా వినియోగదారుల ఆరోపణలను దృష్టిలో ఉంచుకుని బేబీ టాల్కం పౌడర్ విక్రయాలను నిలిపివేయాలని నిర్ణయించింది.
దీంతో వచ్చే ఏడాది తరువాత ఈ సంస్థ విక్రయిస్తున్న బేబీ టాల్కమ్ విక్రయాలు నిలిచిపోనున్నాయి. ఈ బేబీ టాల్కమ్ పౌడర్ స్థానంలో కార్న్ స్టార్చ్ ని వినియోగించాలని నిర్ణయించింది. అదలా ఉంచితే రెండేళ్ల కిందటే జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ టాల్కం పౌడర్ విక్రయాలను అమెరికా, కెనడాలలో నిలిపివేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cancer-threat-with-johnson-and-jhonson-baby-talcum-sales-to-be-stopped-25-141804.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.