జగన్ హయాంలో వందల కోట్ల ప్రజాధనాన్నివ్యయం చేసి నిర్మించిన అత్యంత విలాలవంతమైన, అంతకు మించి వివాదాస్పదమైన రిషికొండ ప్యాలెస్ వినియోగంపై ఉత్కంఠకు తెరపడిందా? ఈ విలాసవంతమైన భవనాన్ని ప్రస్తత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా వినియోగించనుందా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది. జగన్ హయాంలో నిబంధనలను తుంగలోకి తొక్కి, పర్యావరణ సమతుల్యతకు భగం వాటిల్లేలా పచ్చటి రుషికొండకు బోడి గుండు కొట్టి మరీ నిర్మించిన ఈ విలాలవంతమైన భవనాన్ని ఎలా వినియోగించుకోవాలన్న విషయంపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఆ సబ్ కమిటీ తాజాగా భేటీ అయ్యింది.
ఈ భేటీలో విశాఖపట్నంలోని వివాదాస్పద రుషికొండ ప్యాలెస్ ను కేవలం ఎగ్జిబిషన్ లా కాకుండా, ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే విధంగా తీర్చిదిద్దాలని కేబినెట్ సబ్ కమిటీ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. జగన్ హయాంలో రూ. 400 కోట్లకు పైగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మరీ ఈ ప్యాలెస్ ను నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ రుషికొండ ప్యాలెస్ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి భారంగా మారింది. గతంలో ఇక్కడ ఉన్న పర్యాటక శాఖ రిసార్ట్స్ ద్వారా ప్రభఉత్వానికి 7 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేది. కానీ వాటిని కూల్చివేసి ఈ ప్యాలెస్‌ను నిర్మించడంతో ఆ ఆదాయం లేకుండా పోవడమే కాకుండా.. రుషికొండ ప్యాలెస్ నిర్వహణ వ్యయమే నెలకు పాతిక లక్షల రూపాయలకు పెగా ఉంది.
ఈ ఆర్థిక భారాన్ని తగ్గించి రిషికొండ ప్యాలెస్ ను అంతర్జాతీయ హోటల్ చైన్స్‌కు అప్పగించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. తాజ్ గ్రూప్, లీలా ప్యాలెస్ వంటి దిగ్గజ సంస్థలుఈ దిశగా ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీటిని లగ్జరీ హోటళ్లుగా లేదా ప్రపంచస్థాయి రిసార్ట్స్‌గా మార్చడం ద్వారా అటు పర్యాటకాన్ని అభివృద్ధితో పాటు, ప్రభుత్వానికీ భారీగా ఆదాయం సమకూర్చుకోవచ్చని కమిటీ ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
తాజా భేటీలో కమిటీ చర్చించిన విషయాలపై సమగ్ర నివేదిక రూపొందించి దానిని ప్రభుత్వానికి సాధ్యమైనంత త్వరలో సమర్పించాలని కమిటీ భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆ నివేదికపై రాష్ట్ర మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకుంటుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cabinet-subcommittee-onrushikonda-palace-to-submitt-reoprt-36-216855.html
నగరంలోని వాణిజ్య సముదాయాలు, మార్కెట్లు, ప్రధాన కూడళ్ల వద్ద పార్కింగ్ స్థలం లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల రహదారులు ఇరుకుగా మారి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు కీలక ప్రాంతాలను గుర్తించి.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పీపీపీ పద్ధతిలో ఈ అత్యాధునిక పార్కింగ్ భవనాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.
ఈ భారీ ప్రాజెక్టును వీఎంఆర్‌డీఏ మాస్టర్ ప్లాన్ 2041లో భాగంగా చేర్చారు. ఈ సెమీ రింగ్ రోడ్డు అనకాపల్లి, పెందుర్తి, ఆనందపురం వంటి కీలక ప్రాంతాలను కలుపుతూ సాగుతుంది. దీనివల్ల నగర ప్రధాన ప్రాంతాల్లోకి ప్రవేశించాల్సిన అవసరం లేకుండానే వాహనాలు ఒక వైపు నుంచి మరో వైపుకు సులభంగా చేరుకుంటాయి. ముఖ్యంగా భారీ రవాణా వాహనాలు నగరం వెలుపలి నుంచే వెళ్లేందుకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
బండి భగీరథ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. జ్యోతినగర్‌కు చెందిన ఒక యువతితో అతనికి స్నేహం ఏర్పడింది. కొంతకాలానికి ఆ యువతి అతనిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. అయితే.. భగీరథ్ పెళ్లికి నిరాకరించడంతో పరిస్థితి మలుపు తిరిగింది. ఆ యువతి, ఆమె తల్లిదండ్రులు కలిసి అతనిపై క్రిమినల్ కేసులు పెడతామని బెదిరించారు.
పసిఫిక్ మహాసముద్రంలోని తూర్పు, మధ్య ప్రాంత ఉపరితల ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నాయనీ, దీనివల్ల దేశంలో వర్షపాతం గణనీయంగా తగ్గి.. కరువు పరిస్థితులు ఏర్పడే ముప్పు ఉందని తెలిపింది. ముఖ్యంగా నైరుతి రుతుపవనాలపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందనీ, అందువల్ల సాగునీటి కొరత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
మన దేశానికి చెందిన ఆరు విభిన్నమైన వంటకాలు ఈ ప్రతిష్టాత్మక జాబితాలో స్థానం సంపాదించుకోవడం గమనార్హం. కేవలం రుచితోనే కాకుండా, భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటిచెప్పే ఈ వంటకాలు ఇప్పుడు ప్రపంచ స్థాయి గుర్తింపును దక్కించుకున్నాయి.
గోదావరి జలాల పంపిణీ అంశాన్ని పునఃసమీక్షించేందుకు ఒక ప్రత్యేక ట్రైబ్యునల్‌ను నియమించాలని చంద్రబాబు ఈ భేటీలో కేంద్ర మంత్రిని కోరనున్నారు. అలాగే గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న సమ్మక్క సారలమ్మ బ్యారేజీ నిర్మాణాన్ని అడ్డుకోవాలని ఆయన విజ్ఞప్తి చేయనున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం పెరిగింది. నెలరోజులలోనే రెండు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలపడం నిజంగా చారిత్రాత్మకమని చెప్పవచ్చు.
సత్యవేడులో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన యూనిట్‌ను ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చంద్రబాబు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన ఆసక్తికర పోస్టు ఇప్పుడు తెగ వైరల్ అయ్యింది.
మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ముసాయిదా నివేదికను (డీపీఆర్) ఈ సందర్భంగా అధికారులు మంత్రుల ముందు ఉంచారు.
మనుషులు, స్తంభాలు, ఇతర నిటారుగా ఉన్న వస్తువుల నీడలు వాటి పాదాల కిందకే పరిమితమై.. బయటకు కనిపించవు. ఈ పరిస్థితి ఒకటి రెండు నిముషాల పాటు ఉంటుంది.
ఈ కాల్పుల విరమణ ఒప్పందం విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా తన సామాజిక మాధ్యవ మేదిక ట్రూత్ ద్వారా ప్రకటించారు. ఈ ఓప్పందం యుద్ధం ముగింపు దిశగా కీలక పురోగతి అని ఆయన పేర్కొన్నారు.
Fin Allen Sixers Fest in Delhi, easy, win, over, dc, ipl2026, 4th, concicutive
ఘటన సమయంలో ఇంటి పై అంతస్తులో ఇద్దరు పిల్లలు ఉండగా, తనూజ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒంటరిగా ఉన్నారు.
ఇంట్లో పని చేసే కల్పన అనే మహిళ బయట వ్యక్తులతో సంప్రదింపులు జరిపి ఈ నేరానికి సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.