త్వరలో మరో పదిఅసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు?
Publish Date:Jun 17, 2012
Advertisement
రాష్ట్రంలో మళ్ళీ ఉపఎన్నికలు తప్పవనిపిస్తోంది. 18 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు పూర్తయి ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ఈ ఉపఎన్నికల ప్రస్థానానికి ఎమ్మెల్యేలు సిద్ధమవు తున్నారు. ఈసారి ఉపఎన్నికలు కనీసం పదిస్థానాల్లో ఉంటాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఆల్ రెడీ కాంగ్రెస్ నుంచి ముగ్గురు, తెలుగుదేశంపార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. కాకినాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖరరెడ్డి, బొబ్బిలి కాంగ్రెస్ అమ్మేల్యే రావువెంకట సుజయ్ కృష్ణ రంగారావు, పార్వతీ పురం ఎమ్మెల్యే సవరపు జయమణి, తెలుగుదేశంపార్టీ నుంచి కొడాలి శ్రీవెంకటేశ్వర రావు (నాని), ఆ పార్టీ నుంచే మరొక ఎమ్మెల్యే కూడా తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం జగన్ తో వీరందరూ మంతనాలు జరుపుతున్నారు. ఉపఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలతో గంటన్నరసేపు మాట్లాడిన జగన్ వారికి సమీపంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఉత్సాహపడుతున్న ఎమ్మెల్యేల వివరాలను తెలిపారని సమాచారం. మొత్తం పదిమంది ఎమ్మెల్యేలతో రెండోసారి ఉపఎన్నికల్లో విజయఢంకా మోగిస్తే ప్రభుత్వమే లొంగివస్తుందని ఎమ్మెల్యేలు కూడా జగన్ తో ఏకీభవించారట. ఈ సమాచారం మరోసారి సానుభూతి ఓట్లకు జగన్ పార్టీ సిద్ధమయింది. మరి తెలుగుదేశం, అధికార కాంగ్రెస్ పార్టీలు ఏమంటాయో మరి. చిత్రంగా కాంగ్రెస్ విప్ తులసిరెడ్డి మాట్లాడుతూ తాము మరోసారి ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని విజయమ్మతో సవాల్ చేసే సమయానికే ఆ పార్టీ సిద్ధమైంది. ఆ విషయం ఆయనకు తెలియకుండా జగన్ పార్టీ సిద్ధమా అని విజయమ్మను ప్రశ్నించారు. మరోవైపు అసలు 294 స్థానాలకు ఎన్నికలు పెడితే జగన్ సిఎం అయిపోతారు కదా అన్న ఆలోచనలో కూడా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ, ఈ రెండేళ్ళ సమయాన్ని కాంగ్రెస్ వదులుకోదలచుకోలేదు. ఈ రెండేళ్ళలో గట్టి పునాది వేసుకుని 2014 కల్లా బలమైన పార్టీగా ఎలా తయారవ్వాలనే సమాలోచనల్లో మునిగింది. ఏదేమైనా మరోసారి కనీసం పదిస్థానాల్లో ఉపఎన్నికకు జగన్ పార్టీ సిద్ధమైంది. దీనికి ఎమ్మెల్యేల రాజీనామాలకు రంగం సిద్ధమవుతోంది. ఆ పార్టీ ఉపఎన్నికల ద్వారా తాము బలంగా ఉన్నామని నిరూపించుకునే ఏ అవకాశాన్నీ వదులుకోదలచుకోలేదు. అంతేకాకుండా రాష్ట్రపతి ఎన్నికల గురించి కూడా జగన్ ను సంప్రదిస్తున్న ఈ సమయంలోనే మరోసారి సత్తాచాటుకునే అవకాశాన్ని వదులుకోకూడదని ఆ పార్టీ పెద్దలు నిర్ణయించేశారు. అందుకే ఇప్పటిదాకా రాజీనామా చేద్దామా వద్దా అన్న ఎమ్మెల్యేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. అలానే జాతీయస్థాయికి ఎదిగేందుకు ఇంకో ఎంపి ఉంటే బాగుంటుందని ఎంపి సబ్బం హరి కూడా రాజీనామా చేయాలని జగన్ ఆదేశాలు వెళ్లాయని తెలుస్తోంది. మళ్ళీ రోజుల్లోనే ఈ రాజీనామాలు తెరపైకి వస్తాయని పరిశీలకులూ భావిస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ స్పందన ఎలా ఉంటుందో ఈ రాజానామాల తరువాతే అర్థమవుతుంది.
http://www.teluguone.com/news/content/bypolls-in-another-10-segments-24-14934.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





