ఆదిమూలం రాజీనామా? సత్యవేడుకు ఉప ఎన్నిక?

Publish Date:Sep 6, 2024

Advertisement

తిరుపతి జిల్లా సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగబోతోందా? పరిస్థితులు చూస్తుంటే ఉప ఎన్నిక జరగక తప్పదన్నట్టు కనిపిస్తోంది. ఊహించని విధంగా సత్యవేడుకు ఉప ఎన్నిక ముంచుకొచ్చింది. సత్యవేడు ప్రస్తుత ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం టీడీపీ మహిళా కార్యకర్తను లైంగికంగా వేధించిన కేసులో ఇరుక్కున్నారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఆదిమూలం మీద అత్యాచారం కేసు నమోదు అయింది. తిరుపతిలోని భీమాస్ ప్యారడైజ్ హోటల్లోని రూమ్ నంబర్లు 105, 106ల్లో ఆదిమూలం తనను శారీరకంగా హింసిస్తూ అత్యాచారం చేసినట్టు బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆదిమూలం రాసలీలలు నిర్వహించిన హోటల్ తాలూకు సీసీ టీవీ ఫుటేజ్‌ని కూడా పోలీసులు సేకరించినట్టు తెలుస్తోంది. వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి మొన్నటిఎన్నికల సందర్భంగా జంప్ అయిన ఆదిమూలం తన అసలు పార్టీ లక్షణాలను కూడా తనవెంట తెచ్చుకున్నారు. తెలుగుదేశం మహిళా కార్యకర్త విషయంలో లైంగిక వేధింపులకు పాల్పడుతూ సీక్రెట్ కెమెరాలకు దొరికిపోయి తన బతుకును రచ్చ చేసుకున్నారు. వైసీపీలో అయితే ఇలాంటి వ్యవహారాలను పట్టించుకోరుగానీ, తెలుగుదేశంలో మాత్రం ఇది చాలా సీరియస్ వ్యవహారం. ఆదిమూలం రాసలీలల గురించి బయటపడిన వెంటనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదిమూలాన్ని సస్పెండ్ చేశారు. ఇంత రచ్చ అయిన నేపథ్యంలో ఆదిమూలం చేత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి తీవ్రమైన చర్య తీసుకోవడం తెలుగుదేశం పార్టీలోని క్రమశిక్షణకు తార్కాణంగా నిలుస్తుంది. 

ఎమ్మెల్యే పదవికి ఆదిమూలం రాజీనామా చేశాక ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆదిమూలాన్ని పార్టీ నుంచి బహిష్కరించే అవకాశం వుంది. మరి ఆదిమూలం మళ్ళీ తన సొంతగూటికి వెళ్ళి పోటీ చేసినా గెలిచే అవకాశాలు ఎంతమాత్రం లేవు. ఆదిమూలం సంగతి అలా వుంచితే, ఉప ఎన్నికలో సత్యవేడు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేది ఎవరన్న ప్రశ్న అప్పుడే ఉదయించింది. మొన్నటి ఎన్నికల సందర్భంగా స్థానిక తెలుగుదేశం నాయకుడు జె.డి.రాజశేఖర్‌కి టీడీపీ టిక్కెట్ దక్కాల్సి వుంది. అయితే వైసీపీ నుంచి టీడీపీలోకి ఆదిమూలం మారడం వల్ల టిక్కెట్ ఆదిమూలానికే ఇవ్వాల్సి వచ్చింది. దాంతో జె.డి.రాజశేఖర్ నిరాశకు గురయ్యారు. అయితే క్రమశిక్షణ గల కార్యకర్తగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి, ఆదిమూలం గెలుపుకు తనవంతు కృషి చేశారు. ఇప్పుడు ఉప ఎన్నిక వస్తే జె.డి.రాజశేఖర్‌కే టిక్కెట్ దక్కే అవకాశం వుందని తెలుస్తోంది. ఇక వైసీపీ వ్యూహం ఎలా వుండబోతోందో చూడాలి. ఆదిమూలానికి క్లీన్ చిట్ ఇచ్చి ఆయన్నే సత్యవేడు నుంచి పోటీ చేయిస్తారా? లేక కొత్త అభ్యర్థిని ఎవరినైనా ఎంపిక చేస్తారా అనేది చూడాలి. మొన్నటి ఎన్నికలలో దారుణంగా ఓడిపోయిన వైసీపీ, సత్యవేడుకు కనుక ఉప ఎన్నిక వస్తే ఈ స్థానాన్ని సొంతం చేసుకుని తన మీద వున్న ‘11’ ముద్రను చెరుపుకోవడానికి తీవ్రంగా కృషి చేసే అవకాశం వుంది.

By
en-us Political News

  
స్నేహితులే కదా అని నమ్మాడు.. వాళ్లు ఫోన్ చేసి పిలిస్తే ఏదో మాట్లాడుకుందామని ఇంటి నుంచి బయటకు వచ్చాడు. కానీ అదే అతడి చివరి అడుగైంది.
భారతదేశంలో కోట్లాది మంది నిత్యం వినియోగిస్తున్న డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ కారిడార్‌ అయిన మాదాపూర్‌లో ఇటీవల వెలుగుచూసిన ఓయో హోటల్ యువతి అనుమానాస్పద మృతి ఉదంతం అత్యంత నాటకీయ పరిణామాల మధ్య కొత్తలుపులు తెరుస్తోంది.
హైదరాబాద్ మహానగరంలో వినాయక చవితి నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి.
దేశవ్యాప్తంగా ఎంతో అత్యాధునిక సౌకర్యాలు, అత్యున్నత భద్రతా ప్రమాణాలతో ప్రయాణాలకు మారుపేరుగా నిలిచిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఒక ఘటన కలకలం రేపింది.
ప్యారడైజ్‌ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. కానీ థియేటర్‌లో సినిమా చూసే ఆడియన్స్‌కు మరో సర్‌ప్రైజ్‌ సిద్ధమైంది.
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
బెంగళూరులోని కుమ్రం భీం కాదండోయ్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉంటూ తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్న కన్నడ నటుడు దర్శన్ కేసులోని ప్రధాన నిందితురాలు పవిత్రా గౌడ కోర్టులో చేసిన వ్యాఖ్యలు
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.