Publish Date:Sep 24, 2024
ప్రత్యేక రాష్ట్ర కలని సాకారం చేసుకోవడం కోసం తెలంగాణ ప్రజలు పోరాటం చేసిన సమయంలో, ఒక్క టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ మాత్రమే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రవర్తించింది. అందరూ మా రాష్ట్రం మాకు కావాలి అని పోరాటం చేస్తుంటే, టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ మాత్రం ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారిని దారుణంగా తిడుతూ ప్రాంతీయ విద్వేషాలను పెంచి పోషించారు. తెలంగాణ పోరాటం జరిగిన సమయంలో మాత్రమే కాకుండా అధికారంలో వున్న పదేళ్ళలో కూడా ఆంధ్రావాళ్ళని తిట్టనిదే కేసీఆర్‌కి, ఆయన పార్టీ నాయకులకు తిన్నది అరిగేది కాదు. ఆంధ్రవాళ్ళ మీద విషం కక్కకపోతే ‘కేసీఆర్ అండ్ కో’కి మనశ్శాంతిగా వుండేది కాదు. అధికారంలో వున్నప్పుడు మాత్రమే కాదు.. అధికారం పోయిన తర్వాత కూడా బీఆర్ఎస్ తన ఆంధ్ర విద్వేషాన్ని వదులుకోలేదు. నిన్నగాక మొన్న ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ మీద ‘ఆంధ్రావాడు’ అంటూ విమర్శలు చేసిన ఘన బీఆర్ఎస్ పార్టీ నాయకులది. మొత్తమ్మీద ఆంధ్రుల విషయంలో బీఆర్ఎస్ వైఖరి ఎప్పుడూ ఒకేలా వుంది. అధికారంలోకి రాకముందు.. అధికారంలోకి వచ్చిన తర్వాత.. అధికారం పోయిన తర్వాత.. ఈ మూడు దశల్లోనూ ప్రాంతీయ ద్వేషంతోనే బీఆర్ఎస్ కొనసాగింది. ఇంతవరకు ఆంధ్రుల మీద పడి ఏడ్చి, ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారి మీద విద్వేషం పెంచడానికి ప్రయత్నించిన బీఆర్ఎస్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ప్రాంతాల వారీగా చీల్చడానికి కుట్రలు ప్రారంభించింది. తెలంగాణలోనే ఒక ప్రాంతానికి, మరో ప్రాంతానికి మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది.
గత పన్నెండేళ్ళుగా కేసీఆర్ పుణ్యమా అని ఒక్కడ అడుగు కూడా ముందుకు వేయని రీజినల్ రింగ్ రోడ్ ప్రాజెక్టుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరుగులు తీయించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. తాను రూపకల్పన చేస్తున్న ఫోర్త్ సిటీకి కూడా ఉపయోగపడే విధంగా వుండాలని ఆయన రీజినల్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ని కొద్దిగా మార్చారు. అంతే, బీఆర్ఎస్ సొంత మీడియా విమర్శలు ప్రారంభించేసింది. ముఖ్యమంత్రి తన సొంత జిల్లాకి, తన సొంత ప్రాంతానికి లాభం జరిగేలా చేస్తున్నారని బీఆర్ఎస్ మీడియా మొత్తుకుంటోంది. ప్రతీరోజూ ఇదే తరహా కథనాలను బీఆర్ఎస్ మీడియా వండి వడ్డిస్తోంది. ఇంతకాలం ఆంధ్రా మీద పడి ఏడిచిన బీఆర్ఎస్ ఇప్పుడు తెలంగాణలోని ఒక ప్రాంతం మీద పడి ఏడుస్తోంది. ఎప్పుడూ ఎవరో ఒకరి మీద పడి ఏడవకపోతే ఈ బీఆర్ఎస్ వాళ్ళకి తెల్లారదేమో!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/brs-regional-hatreds-39-185488.html
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.