అత్యధిక మొత్తంలో విరాళాలు అందుకున్న పార్టీల్లో బీఆర్ఎస్ టాప్

Publish Date:Apr 26, 2023

Advertisement

రాజకీయ పార్టీలకు వివిధ సంస్థలు వ్యక్తులు ఇచ్చే పార్టీ విరాళాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆగ్రస్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ  టాప్ 5లో నిలిచింది

దేశంలోని వివిధ ప్రాంతీయ పార్టీల్లో ఐదు రాజకీయ పార్టీలు మాత్రమే విరాళాల్లో అత్యధిక వాటా దక్కించుకున్నాయని ఎన్నికల సంస్కరణల కోసం పనిచేస్తున్న అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను 26 ప్రాంతీయ పార్టీలకు మొత్తం రూ.189.80 కోట్ల నిధులు విరాళాల కింద వచ్చాయని ఏడీఆర్ తెలిపింది. ఈ మొత్తంలో ఐదు పార్టీలకే రూ.162.21 కోట్లు (85 శాతం) విరాళాలు అందాయని వెల్లడించింది.

ఈ ఐదు పార్టీల్లో .. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ,జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) ,సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)లకు రూ.162.21 కోట్లు (85 శాతానికిపైగా) అందాయని ఏడీఆర్ తెలిపింది.

ప్రాంతీయ పార్టీల్లో అత్యధిక విరాళాలు పొందిన రాజకీయ పార్టీగా కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ పార్టీకి 2021-22లో 14 విరాళాల ద్వారా రూ.40.90 కోట్లు లభించాయి. రెండో స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఉంది. ఆప్ 2619 విరాళాల ద్వారా రూ.38.24 కోట్లు అందుకుని ద్వితీయ స్థానంలో నిలిచింది. ఇక మూడో స్థానంలో రూ.33.26 కోట్లతో జేడీయూ రూ.29.80 కోట్లతో ఎస్పీ నాలుగో స్థానంలో రూ.20 కోట్లతో వైసీపీ అయిదో స్థానంలో నిలిచాయి.

ఆయా పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాల ఆధారంగా ఈ గణాంకాలను వెల్లడిస్తున్నట్టు ఏడీఆర్ పేర్కొంది. విరాళాల రూపంలో రూ.20వేలకు పైన అంతకన్నా తక్కువ మొత్తాల్లో అందిన వివరాలను 26 ప్రాంతీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేశాయి.

2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను 26 ప్రాంతీయ పార్టీలకు మొత్తం రూ.189.80 కోట్ల నిధులు విరాళాల కింద వచ్చాయని ఏడీఆర్ తెలిపింది. ఈ మొత్తంలో ఐదు పార్టీలకే రూ.162.21 కోట్లు (85 శాతం) విరాళాలు అందాయని వెల్లడించింది.

ఈ ఐదు పార్టీల్లో .. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)లకు రూ.162.21 కోట్లు (85 శాతానికిపైగా) అందాయని ఏడీఆర్ తెలిపింది.

ఆయా పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాల ఆధారంగా ఈ గణాంకాలను వెల్లడిస్తున్నట్టు ఏడీఆర్ పేర్కొంది. విరాళాల రూపంలో రూ.20వేలకు పైన అంతకన్నా తక్కువ మొత్తాల్లో అందిన వివరాలను 26 ప్రాంతీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేశాయి.

కాగా 2021–22 సంవత్సరానికి అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) బిజూ జనతాదళ్ (బీజేడీ) ఎన్డీపీపీ, ఎన్డీఎఫ్, ఏఐఎఫ్బీ, పీఎంకే, జేకేఎన్సీ పార్టీలు తమ విరాళాల వివరాలను వెల్లడించలేదని ఏడీఆర్ వివరించింది.

మరి కొద్ది నెలల్లో దేశంలోని పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో రాజకీయ పార్టీలకు విరాళాల జాతర  ఎలక్షన్  వ్యయానికి బాగా ఉపయుక్తంగా ఉంటాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.