కండువాలూ, ఖర్చులూ మావే .. బీఆర్ఎస్ బంపర్ ఆఫర్

Publish Date:Jan 8, 2023

Advertisement

అదిగో ఆ ..గుండాయన ... డబ్బులు ఎవరికీ ఊరికే రావు ...అన్నారు, కానీ, అది తప్పు. ఆయన ఏదో తెరాస కాలంలో ఉండి అలాంటి స్టేట్మెంట్ ఇచ్చారో ఏమో,కానీ, ఇప్పుడు బీఆర్ఎస్ జమానాలో పైసలే కాదు, పార్టీ పదవులు కూడా ‘ఫ్రీ’ గానే వస్తాయి. ఉచిత కడువాలు కప్పుకుంటే చాలు, ఖర్చులే కాదు, కావాలంటే ఎక్స్చేంజి, షేరింగ్ ఆఫర్లు, నజరానాలు అందుకోవచ్చును. అయితే అందుకు కొన్నికండిషన్స్ అప్లయ్ అవుతాయి. షరతులు వర్తిస్తాయన్న మాట. 

అయితే అవేమీ మరీ అంత కఠిన షరతులు కూడా కాదు. మీరు అలనాటి లంకలో పుట్టిన రాక్షసులే అయినా ఫర్వాలేదు ... మీకు ఏపీలో కాసింత గుర్తింపు ఉంటే చాలు,అలాగే నాలుగైదు పార్టీలు మారిన అనుభవము ఉంటే అది అదనపు అర్హత అవుతుంది. అలాగే, పోటీ చేసిన ప్రతి ఎన్నికలో ఓడి పోయిన అనుభవము ఉంటే ఇక తిరుగే లేదన్న మాట ... అలాంటి వారి కోసం బీఆర్ఎస్ తలుపులు ఎప్పుడూ బార్లా తెరుచుకునే ఉంటాయి.  

సరే .. ఇదంతా ఏదో కాసింత తికమకగా గందరగోళం వుంది కదూ. ఇక డైరెక్ట్’గా పాయింట్లోకి వచ్చేద్దాం.   తెలంగాణ రాష్ట్ర సమితి ( తెరాస) పేరును భారత రాష్ట్ర సమితి (భారాస) గా మార్చిన తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్, బంగారు తెలంగాణ బాటలో దేశాన్ని ‘బంగారు భారత్’ గా అభివృద్ధి చేసే పవిత్ర ఆశయంతో అడుగులు వేస్తున్నారు కదా.. పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించాలని సంకల్పించారు. అందులో భాగంగా ఆంధ్ర ప్రదేశ్’ మీద కేసీఆర్ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. సొంత రాష్ట్రం సంగతి తర్వాత చూసుకుందామని, ముందు పక్కరాష్ట్రం  ఏపీకి పార్టీ అధ్యక్షుడిని అప్పాయింట్ చేశారు.

అలాగే, ఏపీలో పార్టీలో చేరేందుకు ముందుకొచ్చే వారి కోసం ఒక బంపర్ ఆఫర్లు కూడా ఇచ్చారని అంటున్నారు. సహజంగా రాజకీయ నాయకులు ఒక పార్టీ నుంచి మరో పార్టీలో చేరేటప్పుడు, మంది మర్బాలాన్ని వెంట తీసుకు వెళ్లేందుకు, పెట్రోల్ ఖర్చులతో పాటుగా అనుచరుల విందు వినోదాలకు చేతి చమురు వదిలించుకోవలసి వస్తుంది. కానీ, ఏపీ నుంచి బీఆర్ఎస్’లో చేరేవారి కోసం కేసీఆర్, చుక్క చేతి చమురు అవసరంలేని బంపర్ ఆఫర్ ప్రకటించారని అంటున్నారు. బీఆర్ఎస్ లో చేరే నాయకులు, ఇంటి గడప దాటి కాలు బయట పెట్టింది మొదలు తిరిగి ఇల్లు చేరే వరకు అన్ని సదుపాయాలు బీఆర్ఎస్ చూసుకుంటుంది. అంతే, కాదు పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వారికి  అతిధి మర్యాదలు చేయడంతో పాటుగా బరువైన గిఫ్ట్ పాకెట్స్ కూడా ఐచ్చి పంపుతున్నారని అంటున్నారు.

ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ నుంచి మూడు పార్టీలు మారిన జనసేన నాయకుడు తోట చంద్రశేఖర్, ఐఆర్ఎస్ మాజీ అధికారి పార్థసారథి, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రశేఖర్’ను ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా నియమించారు.ఈ ముగ్గురు ఏపీ నుంచి హైదరాబాద్‌’ చేరుకొని, భారాస కార్యాలయంలో కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆ ముగ్గురు నాయకుల వెంట వారి అనుచరులు భారీగానే ‘లగ్జరీ’ కార్లలో తరలివచ్చారు. తెలంగాణ బీఆర్ఎస్ నాయకులు ఫ్లెక్సీలు, స్వాగత తోరాణాలు కట్టి ఘనంగా స్వాగతం పలికారు. ఖర్చుకు వెనకాడకుండా భారీగా ఖర్చు పెట్టారు.

నిజానికి ఈ ఘన స్వాగతాలు, అతిధి సత్కార్యాలు చూసిన  ఏపీలో ఎటూ కాకుండా ఉన్న రాజకీయ నిరుద్యోగులు, పొలో మంటూ బీఆర్ఎస్’లో చేరేందుకు పరుగులు తీస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అందులోను ఉచితాలకు అలవాటు పడిన ప్రాణాలు కదా .. మందు మాకు మర్యాదలు ఉచితంగా వస్తుంటే ఎలా కాదనగలరు.. అయితే విందు వినోదాల కోసం పార్టీలో చేరే వారు, నిజంగా పార్టీ కోసం పనిచేస్తారా, అంటే అది వేరే విషయం అంటున్నారు పరిశీలకులు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కాంట్రాక్టుల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
20 వార్డుల్లో 17 స్థానాలు గెలుపు.!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో పెను తుపాను ముప్పును ఎదుర్కొంటోంది.
​కడప పులివెందుల మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ ఎన్నికల కౌంటింగ్‌లో తెలుగుదేశం పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా  కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
 పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ  దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.