బిఆర్ఎస్ లో అసమ్మతి.. పక్క పార్టీల వైపు చూపులు

Publish Date:Aug 29, 2023

Advertisement

తెలంగాణ బీఆర్ఎస్ లో అసమ్మతి సెగ రాజుకుంటుంది. పలువురు కీలక నేతలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో జంప్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ లో కూడా టికెట్లు దొరకని పక్షంలో బిజెపి గూటికి చేరాలని యోచిస్తున్నారు. బీఆర్ ఎస్ పార్టీ టికెట్ కోసం చివరి క్షణం వరకు ప్రయత్నించిన ఆశావహులు భంగపడ్డారు. కేసీఆర్ ప్రకటించిన మొదటి జాబితాలో 115 మంది అభ్యర్థులు ఉన్నారు. ఏడు చోట్ల అభ్యర్థుల మార్పు జరిగింది. మిగతా వారు సేమ్ టు సేమ్. అంతా పాత ముఖాలే. వీరిపై భూ కబ్జా, అవినీతి ఆరోపణలున్నాయి. ముఖ్యమంత్రి స్వయంగా బీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాల్లో తన ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు చేశారు. దళిత బంధు సాంక్షన్ చేయించినందుకు గాను పర్సంటేజిలు ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఆ ఎమ్మెల్యేల చిట్టా తన వద్ద ఉందని చెబుతూనే సిట్టింగ్ ఎమ్మెల్యేల పేర్లను ప్రకటించేశారు. హైదరాబాద్ లోని గోషామహల్, నాంపల్లితో బాటు జనగామ, నర్సాపూర్   నియోజకవర్గ  అభ్యర్థుల పేర్లు  ప్రకటించలేదు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పై భూ కబ్జా ఆరోపణలు, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పై సర్పంచ్ నవ్యతో మిస్ బిహేవియర్  ఆరోపణల నేపథ్యంలో అవకాశం కోల్పోయారు. వీరిరువురు వరుసగా రెండు పర్యాయాలు ఎమ్మెల్యేల గెలిచినప్పటికీ ఈ సారి టికెట్ లభించకపోవడం చర్చనీయాంశమైంది.  
ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేది డిఫరెంట్ స్టోరీ. రెండు పర్యాయాలు ఆమె గెలిచినప్పటికీ మూడో సారి టికెట్ రాలేదు. మంత్రిగా అవకాశం ఇవ్వాల్సి వస్తుందని తనకు టికెట్ ఇవ్వలేదని రేఖానాయక్ అంటోంది. 
రెండు పర్యాయాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పని చేసిన రేఖారాణికి ఈ సారి  ఖానాపూర్ టికెట్  దక్కకపోవడంతో ఆమె కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. టికెట్ రాకపోతే ఇతర పార్టీల వైపు చూడటం సహజం. కానీ రేఖారాణి పరిస్థితి భిన్నం. తన భర్త మాత్రం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో రేఖారాణి కూడా కాంగ్రెస్  పార్టీ నుంచి పోటీ చేస్తారన్న వార్తలు వచ్చాయి. బిఆర్ఎస్ లో అధిష్టానం టికెట్ నిరాకరిస్తే కాంగ్రెస్ లో క్యాడర్ ఆమెకు సహకరించడం లేదు. అక్కడ‘‘రేఖక్కా నువ్వు రాకక్క’’ అనే నినాదం  కాంగ్రెస్ కార్యకర్తల నుంచి వస్తోంది. కాంగ్రెస్ లో అప్పటికే టికెట్ ఆశిస్తున్న నేతలు మాత్రం రేఖారాణి రాకను వ్యతిరేకిస్తున్నారు.ఖానాపూర్ ఎస్టీ రిజర్వ్ సీటు. బిఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ ఎస్టీ కాదని రేఖారాణి ఆరోపణ. జాన్సన్ క్రిస్టియన్ అని రేఖారాణి తొలుత నుండి వాదిస్తోంది. ఎన్నికల డిక్లరేషన్ లో జాన్సన్  ఇచ్చే అఫిడవిట్ ను బట్టి లీగల్ కోర్స్ కోసం రేఖారాణి సిద్దంగా ఉంది. 
సాధారణంగా ఆయా పార్టీలు టికెట్ ఇవ్వకపోతే ఆశావహులు ఇతర పార్టీల్లోకి జంప్ అవుతారు. మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావ్ పరిస్థితి ఇందుకు భిన్నమనే చెప్పాలి. సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి మల్కాజ్ గిరి బీఆర్ ఎస్ అభ్యర్థిగా మైనంపల్లి అని కేసీఆర్ ప్రకటించారు.  115 అభ్యర్థుల్లో  మైనంపల్లి ఒకరు. ఆయనకు పోటీగా మరో అభ్యర్థి బిఆర్ఎస్ పార్టీలో లేరు. అయినా మైనంపల్లిపై వేటు వేసే ఆలోచనలో పార్టీ అధిష్టానం చేసింది. మళ్లీ బిఆర్ఎస్ ఆలోచన మార్చుకున్నట్లు తెలుస్తోంది.అభ్యర్థుల పేర్లను ప్రకటించే రోజే తిరుమలలో మైనంపల్లి మంత్రి హరీష్ రావ్ ను నీ అంతు చూస్తా అని బెదిరించడాన్ని పార్టీ సీరియస్ గానే తీసుకుంది. మంత్రి కేటీఆర్, ఎంఎల్ సీ కవిత ట్విట్టర్ వేదికగా స్పందించారు. మైనంపల్లి వ్యాఖ్యలను తప్పు పట్టారు. వాళ్లు హరీష్ రావ్ కు మద్దతుగా నిలిచారు. 
అమెరికా నుండి ఇండియాకు వచ్చిన మైనంపల్లి మెదక్ నియోజకవర్గం నుంచి రాజకీయాలు ప్రారంభించి రామాయంపేట ఉప ఎన్నికలో టీడీపీ నుంచి 2008లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో జరిగిన శాసనసభా ఎన్నికల్లో రెండో సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.  2014లో మైనంపల్లి మల్కాజ్ గిరి టిడిపి టికెట్ ఆశించి భంగపడ్డారు.  అదే సంవత్సరం టీడీపీ నుంచి కాంగ్రెస్ లో జంప్ అయి అక్కడ కూడా టికెట్ రాకపోవడంతో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మల్కాజ్ గిరి లోకసభ టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడి పోయారు. కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన మైనంపల్లి హన్మంత్ రావ్ టీఆర్ఎస్ లోతిరుగులేని నాయకుడిగా ఎదిగారు. గ్రేటర్ టిఆర్ఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీ ఎంఎల్ సిగా ఎన్నికైన ఏడాదిలోపు జరిగిన ముందస్తు శాసనసభ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి రాంచందర్ రావ్ పై  మల్కాజ్ గిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీఆర్ఎస్ లో అప్రతిహాతంగా కొనసాగుతున్న మైనంపల్లి పుత్రవాత్సల్యంతో ఈ సారి మెదక్ టికెట్ ఆశించారు. సిట్టింగ్  ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి కి వెళ్లడంతో మైనంపల్లి తట్టుకోలేకపోయారు. సిట్టింగ్ అయిన తనకు మల్కాజ్ గిరి టికెట్ రావడంలో సంతోషం కన్నా కొడుకుకు టికెట్ రాకపోవడంతో మైనంపల్లి ఎక్కువ డిసపాయింట్ అయ్యారు.  పార్టీ మారే ఆలోచనలో మైనంపల్లి ఉన్నారు. ఎమ్మెల్యేగా తన మీద ఆశలు పెట్టుకున్న ప్రజలను దృష్టిలో పెట్టుకుని మైనంపల్లి రూట్ మార్చారు. వారం రోజుల పాటు ప్రజల్లోకి వెళ్లి అభిప్రాయాన్ని తీసుకుంటానని మైనంపల్లి చెబుతున్నారు. ఏ పార్టీ నుంచి పోటీ చేయాలి అని మైనంపల్లి ముందున్న సవాల్ అయితే మైనంపల్లి కాకపోతే ఎవరికి టికెట్ ఇవ్వాలన్నది బిఆర్ఎస్ ముందున్న సవాల్.  తనతో బాటు కొడుకు రోహిత్ కు మెదక్ అసెంబ్లీ టికెట్ ఇవ్వాల్సిందేనని మైనం పాటి తెగేసి చెప్పారు. 
కెసీఆర్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన తుమ్మల నాగేశ్వర రావ్ కు ఈసారి చుక్కెదురైంది. గత ఎన్నికలలో పాలేరు బీఆర్ఎస్ అభ్యర్థిగా తుమ్మల కు పాలేరు టికెట్ దక్కింది. ఆ ఎన్నికల్లో ఓడిపోవడంతో కేసీఆర్ పక్కకు పెట్టారు. తెలుగుదేశం పార్టీలో బలమైన నేతగా ఉన్నప్పుడే కేసీఆర్ ఆహ్వానం మేరకు ఖమ్మం జిల్లా కు చెందిన ఈ నేత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. 2014 లో బిఆర్ఎస్ అభ్యర్థిగా  పోటీ చేసిఓడిపోయినప్పటికీ మంత్రయ్యారు. 2019లో పాలేరు నుంచి అదే పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి టికెట్ కూడా లభించలేదు. ఇటీవల తుమ్మల ఖమ్మంజిల్లాలో బలప్రదర్శన నిర్వహించారు. గులాబీ జెండా లేకుండానే తుమ్మల రోడ్ షో చేపట్టారు. తాను ప్రజా క్షేత్రంలో ఉంటానని  ప్రకటించి బిఆర్ఎస్ కు దూరమవుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. తుమ్మల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. సెప్టెంబర్ మొదటి వారంలో కాంగ్రెస్ మొదటి జాబితా రానుంది. కాంగ్రెస్ లో టికెట్ రాని వారు ఇతర పార్టీల్లో చేరే అవకాశాలున్నాయి.  జంప్ జిలానీలకు చక్కటి అవకాశం లభించవచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.