విలీనం కాదు పొత్తే!?

Publish Date:Aug 16, 2024

Advertisement

బీఆర్ఎస్, బీజేపీ బంధం తొలి నుంచీ కూడా పలు అనుమానాలకు తావిచ్చే విధంగానే ఉంది. 2023 ఎన్నికలకు ముందు ఉప్పు, నిప్పులా పరస్పర విమర్శలు గుప్పించుకున్నప్పటికీ, బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య గట్టి బాండ్ ఉందన్న ఆరోపణలు వినిపించాయి. విమర్శల పర్వం అంతా  ఎలక్షన్ స్ట్రాటజీయేననీ, కాంగ్రెస్ ను బలహీనం చేయడానికే ఇరు పార్టీలూ ప్రధాన ప్రత్యర్థులుగా ప్రజలను నమ్మించడానికి చేసిన ప్రయత్నమేననీ అప్పట్లో పరిశీలకులు కూడా విశ్లేషణలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాను అధికారంలో ఉండగా జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానంటూ  దేశ వ్యాప్తంగా పర్యటనలు జరిపిన సంరద్భంగా కూడా ఆయన కలిసిన రాజకీయ పార్టీల నేతలెవరయ్యా అంటూ వారంతా బీజేపీ వ్యతిరేక పర్టీలకు చెందిన వారే. అంటే కాంగ్రెస్ కూటమికి దగ్గరగా ఉన్నవారే. దీంతో అప్పట్లోనే కేసీఆర్ జాతీయ రాజకీయాల ఆకాంక్షపై పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పైకి తీవ్రమైన బీజేపీ వ్యతిరేకత ప్రదర్శిస్తూ.. లోలోపల కేసీఆర్ చేసిందంతా ఆ పార్టీకి అనుకూలమైన పనులేనని అప్పట్లో పరిశీలకులు విశ్లేషించారు. అలా చేయడం ద్వారా మద్యం కుంభకోణం కేసులో కవిత అరెస్టు కాకుండా కాపాడుకునేందుకేనని వారు అప్పట్లో పేర్కొన్నారు. వాస్తవంగా అప్పట్లో అంటే ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలయ్యే వరకూ కవిత అరెస్టు కాలేదు. 

ఇక ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ దూకుడుకు కళ్లెం వేయడానికి పార్టీని  బీజేపీలో విలీనం చేసి రక్షణ పొందాలని కేసీఆర్ భావిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చాలా గట్టిగా ఖండించారు.  అదే సమయంలో విలీనం కాదు పొత్తు అని అర్ధం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు.  

గత ఏడాది చివరిలో  తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో పారాజయం పాలై బీఆర్ఎస్ గద్దె దిగింది. ఆ తరువాత ఈ ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికలలో  బీఆర్ఎస్ కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. దీనిపై కేటీఆర్ తనదైన శైలిలో చెప్పిన భాష్యమే బీఆర్ఎస్, బీజేపీల రహస్య బంధాన్ని బట్టబయలు చేసింది. సార్వత్రిక ఎన్నికలలో  ఏ కూటమిలోనూ లేని పార్టీలను జనం ఆదరించలేదని తమ పార్టీ జీరో పెర్ఫార్మెన్స్ కు కారణంగా కేటీఆర్ భాష్యం చేప్పారు. వాస్తవానికి బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక ఎమ్మెల్యేలు, కీలక నేతలు క్యూ కట్టి మరీ కాంగ్రెస్ లో చేరుతున్నారు. బీఆర్ఎస్ ఒంటరిగా మనగలగడం అసాధ్యమని వారు బాహాటంగానే చెబుతున్నారు.  నేతలు వరుసగా పార్టీని వీడుతున్న నేపథ్యంలో వారిని కాపాడుకునేందుకు భవిష్యత్ లో  బీజేపీతో కలిసి పని చేస్తామని కేటీఆర్ చెప్పకనే చెబుతున్నారు.  

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ విలీనం అంటూ ప్రచారం జరుగుతున్న  సమయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉన్నాయి. అలాగే త్వరలో రాష్ట్రంలో పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ ను ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్, బీజేపీల మధ్య పరస్పర సహకారం ఇరు పార్టీలకూ అవసరం. ఈ కారణంగానే విలీనం లేదంటూనే పొత్త తథ్యమన్న సంకేతాలను కేటీఆర్ ఇచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అక్టోబర్ 13న ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించే అవకాశం ఉందన్న వార్తలు రాజకీయ, జలవనరుల వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
జాతీయ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలు నడుస్తున్న వేళ, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.
శ్రీవారికి జైపూర్ దంపతులు రూ.51.55 లక్షల ఆభరణాల కానుక.!
గోల్డ్ కొనాలన్న ఆశ.. బిడ్డను కోల్పోయిన విషాదం.!
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యకు హైదరాబాద్‌లో భూమి పేరుతో మోసం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది.
దేశ రాజధాని దిల్లీలో రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది.
కన్నవారిని చూడాలని.. స్వస్థలానికి చేరుకోవాలని ఎన్నో ఆశలతో రైలు ఎక్కిన ఓ యువతి ప్రయాణం విషాదాంతమైంది.
దేశ రాజధాని దిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తలపెట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
భారతీయ రాజకీయ రంగంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.