ఆషాఢ మాసం బోనాలను జంట నగరాలు ముస్తాబు
Publish Date:Jun 25, 2025
Advertisement
హైదరాబాద్ జంటనగరాల్లో జరిగే బోనాల ఉత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.20కోట్లు మంజూరు చేసింది. నగరంలోని 2,783 దేవాలయాలకు వివిధ కార్యక్రమాలు నిర్వహణ కోసం నిధులను చెక్కుల రూపంలో జారీ చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఆషాఢ మాసంలో ముందుగా నగరంలోని గోల్కొండ బోనాలు జూన్ 29న జులై 1, 2 తేదీల్లో బల్కంపేట ఎల్లమ్మ బోనాలు, జులై 13, 14 తేదీల్లో శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవస్థానం బోనాలు, జులై 20న లాల్ దర్వాజా బోనాలు.. జులై 23న చార్మినార్ భాగ్యలక్ష్మి బోనాలు, మిగిలిన దేవాలయాల్లో ఈ ఉత్సవాలు వైభవంగా జరుగుతాయని పేర్కొన్నారు. జూలై 21న పాతబస్తీలో భక్తిశ్రద్ధలతో అమ్మవారి సామూ హిక ఘటాల ఊరేగింపు, తదనంతరం మారు బోనంతో ఈసారి ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలు ముగియనున్నాయి.పాతబస్తీలో నిర్వహించే బోనాల జాతరకు మరో రూ.10 కోట్ల నిధులను అదనంగా కేటాయించాలని భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ప్రతినిధులు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కోరారు. హైదరాబాద్-గోల్కొండ కోటలోని జగదాంబిక మహంకాళి ఆలయానికి భక్తులు పోటెత్తారు. నేడు అమ్మవారికి మెట్ల బోనాలు, ఒడి బియ్యం సమర్పించే కార్యక్రమాలు నిర్వహించనున్నారు
http://www.teluguone.com/news/content/bonalalu-39-200651.html





