ఆ బోట్లపై అనుమానాలెందుకంటే..?

Publish Date:Sep 10, 2024

Advertisement

కృష్ణమ్మ వరద పోటెత్తి ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రమాదకరంగా ప్రవహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా ఐదు బోట్లు కొట్టుకు వచ్చి బ్యారేజీ గేట్లు ఢీకొన్న సంఘటనను తేలిగ్గా తీసుకోరాదనీ, ఆ బొటు యజమానులను తక్షణమే అరెస్టు చేసి విచారించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. అనవసరంగా విచారణ పేరిట కాలయాపన చేయకుండా బోటు యజమానులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య సైతం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

అసలు భారీ వరద సమయంలో బోట్లు కొట్టుకు వచ్చి ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీ కొనడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. మంత్రి నిమ్మల రామానాయుడు అయితే ఆ సంఘటన ప్రమాదవశాత్తూ జరిగింది కాదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. అసలు ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొన్న ఘటనపై అనుమానాలు రేకెత్తడానికి ప్రధాన కారణం ఆ సంఘటన జరిగిన సమయంలో అక్కడ అసాధారణ పరిస్థితులు ఉండటమే. ఏమిటా అసాధారణ పరిస్థితులు అంటే వరదలో కొట్టుకు వచ్చి ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొన్న ఐదు బోట్లలో మూడు ఒకదానికి ఒకటి కట్టేసి ఉన్నాయి. ఈ విధంగా బోట్లను కట్టేయడం జరగదు. ఎందుకంటే వరదల సమయంలో ఏ బోటుకు ఆబోటును వేర్వేరుగానే లంగరు వేస్తారు. ఒక వేళ కొట్టుకుపోతే ఒక బోటు కొట్టుకుపోతుంది. మిగిలినవైనా మిగులుతాయి. ఇలా కట్టివేయడం వల్ల ఒకబోటు కొట్టుకుపోతే మిగిలిన బోట్లు కూడా దానితో పాటే కొట్టుకుపోతాయి. ఇలా అసాధారణంగా మూడు బోట్లను ఒకదానికి ఒకటి కట్టివేయడంతో మూడూ కలిసి కొట్టుకుపోయి ప్రకాశం బ్యారేజీ గేట్లకు నష్టం చేకూర్చాయి.

ఇక బోట్ల విషయంలో అనుమానాలు బలంగా వ్యక్తం కావడానికి మరో కారణమేంటంటే.. ఆ బోట్లను బల హీనమై ప్లాస్టిక్ తాడుతో లంగర్ వేయడం. సాధారణంగా వరదల సమయంలో  అలాంటి బలమైన ప్లాస్టిక్ తాడుతో బోట్లను ఎవరూ కట్టేయరు. అంతే కాకుండా భారీ వరదకు సంబంధించి స్థానికంగా జారీ చేసిన హెచ్చరికలను కూడా బోటు యజమానులు పట్టించుకోకపోవడాన్ని బట్టి చూస్తే కావాలనే వాటిని ప్రవాహంలో కొట్టుకుపోయి బ్యారేజీ గేట్లను ఢీకొట్టాలన్న కుట్ర ఉందని అనిపించక మానదు. వాస్తవానికి ఆ బోట్లను గొల్లప్రోలు గ్రేవ్ యార్డ్ వద్ద కట్టేశారు.దీంతో అవి ప్రవాహానికి కొట్టుకుపోయి ప్రకాశం బ్యారేజీ గేట్లను బలంగా ఢీకొన్నాయి. ఆ బోట్ల యజమానులకు వైసీపీతో దగ్గర సంబంధాలు ఉండటం, ఆ బోట్లకు వైసీపీ రంగులు వేసి ఉండటం చూస్తుంటే వైసీపీ నేతలు లేదా వారి అనుచరులకు ఈ ఘటనతో ప్రమేయం ఉందని భావించాల్సి వస్తున్నది.

ప్రజా భద్రతకు, బ్యారేజీకి నష్ఠం వాటిల్లే విధంగా జరిగిన ఈ సంఘటనపై ఇప్పటికే పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలోనే బోటు యజమానులను వెంటనే అరెస్టు చేసి విచారించాలన్న డిమాండ్ జోరందుకుంది. ఒక పక్క బుడమేరు ముంపు, మరో పక్క కృష్ణానదిలో గతంలో ఎన్నడూ లేని విధంగా 12 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం, ఇంకో పక్క భారీ వర్షంతో బెజవాడ గజగజా వణుకుతుంటే.. ఎలాంటి భద్రతా లేకుండా, అత్యంత నిర్లక్ష్యంగా బోట్లను నదిలో ఉంచిన బోటు యజమానుల నిర్లక్ష్యాన్ని ఎంత మాత్రం ఉపేక్షించరాదని అంటున్నారు. అంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి శిక్ష పడాల్సిందేనంటున్నారు. అలా కాకుండా ఈ ఘటన వెనుక నిర్లక్ష్యం కాకుండా కుట్ర ఉంటే వాళ్లను ఉరి తీసినా పాపంలేదంటున్నారు. ఆ బోట్ల ధాటికి బ్యారేజీ గేట్ల కౌంటర్ వెయిట్లు మాత్రమే దెబ్బతిన్నాయి కనుక సరిపోయింది కానీ, అదే బ్యారేజీ దిమ్మలు ధ్వంసమై ఉంటే ఎంత ప్రమాదం జరిగేదన్నది ఊహకే అందనంత భయంకరంగా ఉండేదని అంటున్నారు.  

By
en-us Political News

  
హైదరాబాద్ మహానగరంలో వినాయక చవితి నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి.
దేశవ్యాప్తంగా ఎంతో అత్యాధునిక సౌకర్యాలు, అత్యున్నత భద్రతా ప్రమాణాలతో ప్రయాణాలకు మారుపేరుగా నిలిచిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఒక ఘటన కలకలం రేపింది.
ప్యారడైజ్‌ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. కానీ థియేటర్‌లో సినిమా చూసే ఆడియన్స్‌కు మరో సర్‌ప్రైజ్‌ సిద్ధమైంది.
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
బెంగళూరులోని కుమ్రం భీం కాదండోయ్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉంటూ తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్న కన్నడ నటుడు దర్శన్ కేసులోని ప్రధాన నిందితురాలు పవిత్రా గౌడ కోర్టులో చేసిన వ్యాఖ్యలు
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.