జెండా జనసేన.. అజెండా వైసీపీ.. బాలినేని రంగు బయటపడిందా?
Publish Date:Aug 12, 2026
Advertisement
కూటమి పార్టీల మధ్య.. మరీ ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన మధ్య ఐక్యతకు విఘాతం కలిగేలా ఒంగోలు కేంద్రంగా చోటు చేసుకున్న పరిణామం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. కూటమిలో భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన ఒంగోలు నేతల మధ్య నెలకొన్న విభేదాలు రోడ్డున పడి మీడియా సమావేశంలో పరస్పరం విమర్శలు, ఇరోపణలూ చేసుకునే వరకూ వెళ్లింది. ఈ విషయంలో ఇరు పార్టీల అగ్రనాయకత్వం జోక్యం చేసుకుని ఇరువురు నేతలకూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో పరిస్థితి కొంత వరకూ సద్దుమణిగినట్లు కనిపిస్తున్నా.. అసలు పరిస్థితి ఇంత వరకూ రావడానికి కారణం ఎవరన్న దానిపై పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు మాత్రం ఫుల్ స్టాప్ పడలేదు. ముఖ్యంగా మాజీ మంత్రి జనసేన నాయకుడు బాలినేని తీరు పట్ల ఇటు తెలుగుదేశంలోనూ, అటు జనసేనలోనూ ఆగ్రహం వ్యక్తం అవుతోంది. 2024 ఎన్నికల తరువాత బాలినేని శ్రనివాసరెడ్డి.. వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరారు. ఆ ఎన్నికలలో ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ రావు ఎన్నికయ్యారు. బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ కు బంధువు కావడం, 2024 ఎన్నికలలో తనకు ప్రత్యర్థి కావడంతో అప్పట్లోనే దామచర్ల జనసేనలోకి బాలినేని ఎంట్రీని వ్యతిరేకించారు. అయితే పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేనాని, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు నచ్చచెప్పడంతో.. అంగీకరించి సర్దుకు పోయారు. అయితే తాజాగా బాలినేని జనార్దర్ రెడ్డి ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ రావు అండదండలతోనే భూ, ఇసుక, రేషన్ మాఫియాలు విచ్చలవిడిగా నడుస్తున్నాయంటూ ఆరోపణలు గుప్పించారు. జనసేన మద్దతు, ఓట్లతోనే దామచర్ల గెలిచారంటూ వ్యాఖ్యలు చేశారు. అక్కడితో ఆగకుండా.. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి స్వతంత్రంగా పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఈ ఆరోపణలపై ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ రావు కూడా ఘాటుగా రియాక్టయ్యారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఫస్ట్రేషన్తో నిరాధార ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బాలినేని, ఆయన కుమారుడు కలిసి సిండికేట్ మద్యం వ్యాపారాలు నడుపుతూ కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో తనపై, తన అనుచరులపై ఏకంగా 79 కేసులు పెట్టి తీవ్రంగా వేధించారని గుర్తుచేశారు. తనను రాజకీయంగా ఎదిరించే ధైర్యం లేక, బాలినేని ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. 2024 సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో ఒంగోలు ప్రజలు దామచర్ల జనార్ధన్ రావును 34వేల026 ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించిన సంగతిని గుర్తు చేశారు. మైనింగ్ సహా అన్ని అంశాలపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. అవన్నీ పక్కన పెడితే.. ఇప్పుడు కూటమి నాయకులలో బాలినేని శ్రీనివాసరెడ్డి తీరు పట్ల హాట్ హాట్ చర్చ జరుగుతోంది. బాలినేని విమర్శలు, సవాళ్లు చూస్తుంటే.. పేరుకు ఆయన జనసేన జండా పట్టుకున్న అజెండా మాత్రం వైసీపీయే అన్నట్లుగా ఉందంటున్నారు. కూటమి పార్టీల మధ్య వివాదాలు సృష్టించడం ద్వారా వైసీపీకి రాజకీయంగా లబ్ధి చేకూర్చే వ్యూహంతో బాలినేని వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. Balineni versus Damacharla, Prakasham, Politics, Janasena Janda, YCP, Ajenda, TeluguOne
http://www.teluguone.com/news/content/bllinen-versus-famacharla-39-228727.html





