ఈటల.. ఆత్మగౌరవ పోరాటమిదేనా? తొలి రోజే ఇంత అవమానమా!
Publish Date:Jun 14, 2021
Advertisement
ఆత్మగౌరవం దెబ్బ తిందని..క్యాంప్ మారిస్తే అక్కడ ఆత్మ ఏమోగాని.. గౌరవం అస్సలు దక్కలేదనే కామెంట్లు సోషల్ మీడియాలో మొదలయ్యాయి. ఈటల రాజేందర్ ఆత్మగౌరవ పోరాటానికి ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలిందనిపిస్తోంది. రెడీమేడ్ నేతలను తెచ్చుకుని కూర బాగా వండే బిజెపి నేతలు.. వారిని నేతలుగా కాకుండా.. ఒక పనిముట్టులా వాడుతున్నట్లు ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో అనుభవాలతో అర్ధమవుతూనే ఉంది. ఇప్పుడు ఈటలను కూడా తెలంగాణలో తమకు హైప్ తెచ్చుకోవడం కోసమే తప్ప.. ఈటలకు న్యాయం చేయాలనే దయ, కరుణ ఏమీ బిజెపికి లేవు. ఎందుకంటే ఫోటోలో చూస్తుంటే అసలు మార్కింగ్ లేకపోతే ఈటల రాజేందర్ కనపడనే కనపడరు.అందుకు ఆయన హైట్ కారణం కాదు.. అక్కడున్న బిజెపి నేతల హెడ్ వెయిట్ కారణం. నడ్డా, బండి సంజయ్, రఘునందన్, రమేష్ రాథోడ్ లాంటివారు ఆ ఫోటోలో కనపడుతున్నారు. వీరందరి కంటే ఏ విషయంలోనూ ఈటల రాజేందర్ తక్కువ కాదు. ఒక విధంగా ఎక్కువే అని చెప్పుకోవాలి. అలాంటి ఈటల రాజేందర్ ను పక్కకు పెట్టేసి.. వీరంతా జేపీనడ్డాతో ఫోటో దిగటం అంటేనే అక్కడ ఈటలకు దక్కిన గౌరవం ఏంటో..? ఆత్మగౌరవ పోరాటం ఏంటో మరి? ఇదే కాదు.. అసలు ఈటల చేరిక.. ఆయన లెవెల్ కు మోదీ కాకపోయినా అమిత్ షాలో లెవెల్ లో జరగాలి. పోనీ ఆయన లేడనుకున్నాపార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలోనైనా జరగాలి. వీరెవరూ లేకుండా కేవలం ఒక కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ సమక్షంలో ఈటలను చేర్చుకోవడం ఏంటనేది ఎవరికీ అర్ధం కావాలి. ఈటలకు, ఆయన వెంట వెళ్లినవారికి అది అవమానంగా అనిపించినా.. దిగమింగుకుని సర్దుకుపోయినట్లున్నారు. ఇవన్నీ చూస్తుంటే అసలు రేపు హుజూరాబాద్ లో గెలిస్తే సరే..ఓడిపోతే ఈటలను పట్టించుకుంటారా అనే అనుమానాలొస్తున్నాయి. ఒక మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్.. అది కూడా టీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత ఒక కీలక నేతగా ఉన్న ఈటల... ఒక జాతీయ పార్టీలోకి వెళ్లేసరికి ఆయనకున్న విలువను తగ్గించుకున్నారో.. పెంచుకున్నారో అర్ధం కాని పరిస్ధితి కనపడుతోంది. కేసీఆర్ విలువ ఇవ్వలేదని.. అవమానించారని ఫీలయిన ఈటల రాజేందర్ మరి ఈ తాజా అవమానాల పట్ల ఎలా ఫీలయ్యారో.. అప్పుడే తెలియదు మనకు. టీఆర్ఎస్ లో అవమానాల గురించి ఏళ్ల తర్వాత చెప్పుకొచ్చిన రాజేంద్రుడు..వీటి గురించి ఎప్పటికో చెబుతారో మరి. ఇక ఈ ఫోటోలను గులాబీ దళం ఓ రేంజ్ లో వాడుకుంటుందనడంలో సందేహమే లేదు. ఆత్మగౌరవ నినాదానికి కౌంటర్ గా ఈ ఫోటోలనే వారు ప్రయోగిస్తారు.. ఆఖరికి హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో కూడా
http://www.teluguone.com/news/content/bjp-top-leaders-insult-etela-rajender-on-joining-time-39-117630.html





