ఈటలకు ఝలక్.. బీజీపీ తెలంగాణ పగ్గాలు బండికేనా?

Publish Date:Sep 6, 2024

Advertisement

తెలంగాణలో బీజేపీలో కుమ్ములాటలకు ఫుల్ స్టాప్ పెట్టాలన్న కృత నిశ్చయానికి ఆ పార్టీ హైకమాండ్ వచ్చినట్లుగా కనిపిస్తోంది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో అధికారం చేపట్టడమే లక్ష్యం అంటూ బీజేపీ అగ్రనాయకత్వం తీసుకున్న కొన్ని చర్యలు, నిర్ణయాలు బూమరాంగ్ అయ్యాయి. దీంతో అప్పట్లో అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అనుకున్నంతగా పెర్ఫార్మ్ చేయలేక చతికిల పడింది. అధికారం సంగతి అటుంచి కనీసం ప్రతిపక్ష హోదాకు అవసరమైనన్ని స్థానాలు కూడా సంపాదించలేకపోయింది. ఎప్పటిలాగే సింగిల్ డిజిట్ తో సరిపెట్టుకోవలసి వచ్చింది. దీంతో  సార్వత్రిక ఎన్నికల సమయంలో కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకుంది. అవి కొంత మేర ఫలించి కాంగ్రెస్ తో సమానంగా రాష్ట్రంలో లోక్ సభ స్థానాలను గెలుచుకోగలిగింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల తరువాత తెలంగాణలో బీఆర్ఎస్ పూర్తిగా డీలా పడిపోవడం వల్లనే బీజేపీ ఆ మాత్రం లోక్ సభ స్థానాలను గెలుచుకోగలిగిందని కమలనాథులకు అర్ధమైంది. 

ఇప్పుడు ఇక రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. గత ఏడాది జరిగిన రాష్ట్ర ఎన్నికల సమయంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకునేందుకు సమాయత్తమౌతోంది. అందులో భాగంగానే గత అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ అధ్యక్షుడిగా ఉద్వాసన పలికిన బండి సంజయ్ కే మళ్లీ రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చిందని రాష్ట్ర బీజేపీ శ్రేణులలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.వాస్తవానికి గత కొన్ని రోజులుగా పార్టీ రాష్ట్ర పగ్గాలు మల్కజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ కు కట్టబెట్టనున్నారన్న వార్తలు గట్టిగా వినిపించాయి. అయితే ఈటలకు పార్టీ రాష్ట్రపగ్గాలు అప్పగించే విషయంలో బండి సంజయ్, కిషన్ రెడ్డి సహా పలువురు నేతలు తీవ్ర వ్యతిరేకత కనబరిచారు. దీంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చే విషయంలో బీజేపీ వెనకడుగు వేసింది. కిషన్ రెడ్డినే కొనసాగించింది.

అయితే కిషన్ రెడ్డి ని పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలని సార్వత్రిక ఎన్నికల తరువాత నుంచీ పార్టీ హైకమాండ్ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే కిషన్ రెడ్డి స్థానంలో ఎవరిని నియమించాలన్న విషయంలోనే తేల్చుకోలేకపోతోంది.  పార్టీ అధ్యక్ష పగ్గాలు ఈటలకు అప్పగి స్తారన్నది దాదాపుగా ఖరారైందని కూడా అంతా భావించారు. అయితే అనూహ్యంగా బండి సంజయ్ రేసులోకి రావడం, ఈటలకు పార్టీ పగ్గాలు అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో బీజేపీ హైకమాండ్ వెనక్కు తగ్గింది. పార్టీ రాష్ట్ర పగ్గాలు బండి చేతుల్లో ఉన్న కాలంలో  బీజేపీకి రాష్ట్రంలో మంచి మైలేజీ ఉందని, ఆయనను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన తరువాతనే పార్టీలో కుమ్ములాటలు, గ్రూపులు ఎక్కువయ్యాయన్న భావనలో పార్టీ హైకమాండ్ ఉంది.

దీంతో ఈటలకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కట్టబట్టడాన్ని బండి వ్యతిరేకించడంతో పార్టీ అధిష్ఠానం పునరాలోచనలో పడిందని తెలుస్తోంది. అసలు వాళ్లూ వీళ్లూ అని వెతకడం ఎందుకు బండినే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని చేస్తే పోలా అన్న అభిప్రాయం ఇప్పుడు హైకమాండ్ లో వ్యక్తం అవుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  తాజాగా ఖమ్మంను అతలాకుతలం చేసిన భారీ వరదల సమయంలో  కేంద్ర మంత్రి హోదాలో ఆయన వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించడం, ఆయనకు పోటీగా ఈటల మరో బృందంతో పర్యటనకు రెడీ కావడం ఇద్దరి మధ్యా విభేదాలను ఉన్నాయన్న ప్రచారానికి బలం చేకూర్చింది. హై కమాండ్ అనుమతి లేకుండా బండి వరద ప్రాంతాలలో పర్యటించే అవకాశం ఉండదని అంటున్నారు. పార్టీ హైకమాండ్ బండినే ప్రోత్సహిస్తున్నదనడానికి ఇదే నిదర్శనమని చెబున్నారు.   

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.