పెద్దిరెడ్డి పయనమెటు?  

Publish Date:Jun 15, 2021

Advertisement

ఎన్ని పార్టీలు మారినా, తెలుగు దేశం నేతగానే గుర్తుండిపోయే, ప్రస్తుత బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి తదుపరి పయనం ఎటు, అన్నది ఇప్పుడు, రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా హుజురాబాద్’ అసెంబ్లీ నియోజక వర్గంలో చర్చనీయాంశంగా మారింది.పెద్దిరెడ్డి ఎప్పటి నుంచో హుజురాబాద్ సీటు మీద కన్నేసి ఉంచారు. అయితే, అనూహ్య రాజకీయ పరిణామాల నేపధ్యంలో, ఆ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న  మాజీ మంత్రి ఈటల రాజేందర్, తెరాసకు, శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో, పెద్దిరెడ్డి రాజకీయ భవిష్యత్, ‘ఎదర బతుకంతా చిందరవందర’ అన్నట్లుగా మారింది.ఏమి చేయడమో పాలుపోక కావచ్చు.

ఈటల బీజేపీ ఎంట్రీని పెద్దిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. జిల్లా నేతలను సంప్రదించకుండా, రాష్ట్ర నాయకత్వం, ఈటలను ఎలా పార్టీలో చేర్చుకుంటుందని గర్జించారు.అలాగే, భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కుంటున్న, మాజీ మంత్రిని పార్టీలోకి తీసుకుని ఎలాంటి సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారని పార్టీ పెద్దలను నిలదీసినంత పనిచేశారు. ఆ విధంగా  పెద్దిరెడ్డి ఆదిలోనే ఈటల ఎంట్రీని అడ్డుకునే గట్టి ప్రయత్నం చేశారు. అయితే, అయన ఆవేదన, ఆక్రందనలను పార్టీ అస్సలు పట్టించుకోలేదు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేదా ఇతర రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరూ, ఆయన వ్యాఖ్యలను పట్టించుకోలేదు. ఎవరూ రియాక్ట్ కాలేదు. 
అదలా ఉంటే, ఇక అక్కడి నుంచి మౌనంగా ఉండిపోయిన పెద్దిరెడ్డి మళ్ళీ తెరమీదకు వస్తున్నారు. ఈటల రాజేందర్ ఢిల్లీ వెళ్లి కలువ పూల కాషాయ కండువా కప్పుకుని వచ్చిన నేపధ్యంలో, పెద్ది రెడ్డి బుధవారం హుజురాబాద్ వెళుతున్నారు. కార్యకర్తలతో సమావేసమవుతున్నారు. పార్టీ మారే ముందు సహజంగా నాయకులు వేసే మొదటి అడుగు, కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం. కార్యకర్తల మనోభావాలను తెలుసు కోవడం... ఆ తర్వాత కార్యకర్తల బుజాల మీద తుపాకీ తమ మనోగతాన్ని బయట పెట్టడం ... ఆ తర్వాత కథ అందరికీ తెలిసింది. నిన్నగాక మొన్న ఈటల రాజేందర్ చేసిందీ ఇదే .. రేపు పెద్ది రెడ్డి .. మరో రావు చేసేది కూడా అదే. 

ఈటల బీజేపీలో చేరడంతో, ఇక పెద్ది రెడ్డి హుజురాబాద్ మీద పెట్టుకున్న ఆశలను వదులుకోక తప్పదు. ఒక వేళ రేపటి  ఉపఎన్నికల్లో ఏ కారణం చేతనైనా ఈటల పోటీ చేయక పోయినా, వారి శ్రీమతి జమున రెడీగా ఉన్నారు. అంతే కాకుండా,బీజేపీలో చేరిన సందర్భంగా సోమవరం ఢిల్లీలో, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి  మీడియా సమావేశంలో మాట్లాడిన ఈటల, “ హుజురాబాద్’ ఉప ఎన్నికలో పోటీ చేస్తాం ... గెలుస్తాం” అని బల్ల గుద్దారు. సరే, గెలుస్తారా లేదా అన్నది పక్కన పెడితే, నియోజక వర్గాన్ని వదులుకునే ప్రశ్నే లేదన్న విషయం  అయితే ఈటల మరోమారు స్పష్టం చేశారు.  సో.. పెద్ది రెడ్డికి  హుజురాబాద్ బీజేపీ తలుపులు శాశ్వతంగా మూసుకుపోయాయి.. ఇక ప్రత్యాన్మాయం చూసుకోవడం ఒక్కటే, ఆయన ముందున్న మార్గం. తెరాసలో ‘నో వేకెన్సీ’ , కేసీఆర్ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణకు ఆహ్వానం పంపారు కానీ, పెద్ది రెడ్డిని పట్టించుకోలేదు. కాంగ్రెస్’లోనూ అదే పరిస్థితి. గత ఎన్నికల్లో ఈటల పై పోటీచేసిన కౌశిక్ రెడ్డి, ప్రస్తుతానికి అయితే పార్టీలోనే ఉన్నారు. అంతే కాదు, ఆయన పార్టీ  మారుతున్నట్లు,అధికార తెరాసలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు. 

గత ఎన్నికల్లో స్ట్రెయిట్ ఫైట్ లో 60 వేలకు పైగా ఓట్లు తెచ్చుకున కౌశిక్ రెడ్డి, ఈసారి ముక్కోణపు పోటీలో విజయం సాధించే అవకాశలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు సైతం పేర్కొంటున్నారు. ఈ పరిస్థితులలో ఆయన కారెక్కుతారా లేదా అనేది ఇప్పుడే తేలే విషయం కాదు. అప్పటివరకు అయితే, కాంగ్రెస్ పార్టీలో కూడా, ‘నో వేకెన్సీ’నే..పెద్ది రెడ్డి గతంలో ఆ పార్టీ ఈ పార్టీ తరిగి చివరకు సొంత గూటికి (టీడీపీ) చేరారు. మళ్ళీ మరో సారి .. ట్రస్ట్ భవన్ మెట్లు ఎక్కుతారా... లేక ఉన్న చోటనే ఉంది పోతారా .. ..లేక ...ఇంకా ... ఏదైనా నిర్ణయం తీసుకుంటారా, తెలియాలంటే మరి కొన్ని గంటలు అగవల్సిందే..

By
en-us Political News

  
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.